Share News

Indian American Girl: వరల్డ్ బ్రైటెస్ట్ స్టూడెంట్‌గా భారత సంతతి విద్యార్థిని

ABN , Publish Date - Jan 16 , 2024 | 08:24 AM

విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించేందుకు జాన్స్ హాప్‌కిన్స్ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ ఏటా పరీక్షలు నిర్వహిస్తుంది. గత ఏడాది సమ్మర్‌లో ఎగ్జామ్ కండక్ట్ చేసింది. 90 దేశాలకు చెందిన 16 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు.

 Indian American Girl: వరల్డ్ బ్రైటెస్ట్ స్టూడెంట్‌గా భారత సంతతి విద్యార్థిని

ఏబీఎన్ ఇంటర్నెట్ డెస్క్: విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించేందుకు జాన్స్ హాప్‌కిన్స్ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ ఏటా పరీక్షలు నిర్వహిస్తుంది. గత ఏడాది సమ్మర్‌లో ఎగ్జామ్ కండక్ట్ చేసింది. 90 దేశాలకు చెందిన 16 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. స్కాలస్టిక్ అసెస్‌మెంట్ టెస్ట్, అమెరికన్ కాలేజ్ టెస్టింగ్‌ నిర్వహించారు. వారిలో భారతీయ సంతతికి చెందిన 9 ఏళ్ల ప్రీషా చక్రవర్తి (Preesha) ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ప్రపంచంలో ఉత్తమ విద్యార్థిగా నిలిచారు.

కాలిఫోర్నియా ఫ్రీమాంట్‌లో గల వార్మ్ స్ప్రింగ్ ఎలిమెంటరీ స్కూల్‌లో ప్రీషా చక్రవర్తి గ్రేడ్-3 చదువుతున్నారు. 2023 సమ్మర్‌లో పరీక్షకు హాజరయ్యానని చిన్నారి మీడియాకు తెలియజేశారు. 16 వేల మందిలో విద్యార్థుల్లో 30 శాతం కన్నా తక్కువ విద్యార్థులు హై హనర్స్ లేదా గ్రాండ్ హనర్స్‌‌లో స్కోర్ చేశారు. అన్ని అంశాల్లో స్క్రూటినీ చేయగా ప్రీషా అగ్రస్థానంలో నిలిచారు. వెర్బల్, క్వాంటిటేటివ్ విభాగం గ్రేడ్-5 ప్రదర్శనల్లో 99వ పర్సంటైల్‌తో సమానంగా నిలిచి టైటిల్ దక్కించుకున్నారు ప్రీషా చక్రవర్తి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 16 , 2024 | 08:24 AM