Share News

Indian Embassy : లావోస్‌ నుంచి 47 మందికి విముక్తి

ABN , Publish Date - Sep 01 , 2024 | 04:43 AM

లావోస్‌లోని సైబర్‌ స్కామ్‌ సెంటర్లలో చిక్కుకుపోయిన 47 మంది భారతీయులని రక్షించినట్లు అక్కడి భారత ఎంబసీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.

 Indian Embassy : లావోస్‌ నుంచి 47 మందికి విముక్తి

వీయెంతియాన్‌, ఆగస్టు 31: లావోస్‌లోని సైబర్‌ స్కామ్‌ సెంటర్లలో చిక్కుకుపోయిన 47 మంది భారతీయులని రక్షించినట్లు అక్కడి భారత ఎంబసీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. లావోస్‌లోని బొకెవొ ఫ్రావిన్స్‌లోని గోల్డెన్‌ ట్రయాంగిల్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌లోని సైబర్‌ స్కామ్‌ సెంటర్లలో వీరు చిక్కుకున్నారు. ఆ సెంటర్లపై దాడులు జరిపిన లావోస్‌ అధికారులు 29 మందిని రక్షించి భారత ఎంబసీకి అప్పగించారు.

మరో 18 మంది స్వయంగా ఎంబసీకి వచ్చి తమను రక్షించాలని కోరారని భారత ఎంబసీ ‘ఎక్స్‌’లో తెలిపింది. లావో్‌సలోని భారత రాయబారి ప్రశాంత్‌ అగ్రవాల్‌ బాధితులతో మాట్లాడి వారు ఎదుర్కొన్న కష్టాలను తెలుసుకొన్నారు. బాధితుల్లో 30 మంది స్వదేశానికి బయలుదేరారు. మిగిలిన 17 మందిని స్వదేశానికి చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత నెలలో కూడా భారత ఎంబసీ ఈ సైబర్‌ స్కామ్‌ సెంటర్ల నుంచి 13 మందిని స్వదేశానికి చేర్చింది. ఇప్పటి వరకు ఇలా లావో్‌సలో చిక్కుకుపోయిన 635 మంది భారతీయులను భారత ఎంబసీ రక్షించి స్వదేశానికి చేర్చింది.

Updated Date - Sep 01 , 2024 | 04:45 AM