Share News

Billionaire: కలిసొచ్చిన స్టార్టప్స్.. ఏకంగా..!!

ABN , Publish Date - Jul 16 , 2024 | 05:11 PM

జై చౌదరి 1980లో అమెరికా వెళ్లారు. అక్కడ ఇంజినీరింగ్ చదివారు. తర్వాత ఐబీఎంలో జాబ్ చేశారు. యునిసిస్ కంపెనీలో కూడా పని చేశారు. సిలికాన్ వ్యాలీలో డాట్ కామ్ బూమ్, నెట్ స్కేప్ స్టార్టప్‌లు సక్సెస్ అయ్యాయి. దాంతో సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసే దిశగా చౌదరి అడుగులు వేశారు.

Billionaire: కలిసొచ్చిన స్టార్టప్స్.. ఏకంగా..!!
Jay Chaudhry

ఎప్పుడు, ఎవరూ ఏ స్థాయిలో ఉంటారో చెప్పలేం. కెరీర్ ఆధారంగా భవిష్యత్‌ను నిర్ణయిస్తోంది. కొందరు జాబ్ చేసి, మానేస్తారు. ఉన్న కొంత డబ్బుతో బిజినెస్ లేదంటే స్టార్టప్ కంపెనీ ప్రారంభిస్తారు. అందులో కొందరు సక్సెస్ అవుతారు. ఆ జాబితాలో ముందు వరసలో నిలుస్తారు జై చౌదరి (Jay Chaudhry). చౌదరి భారతీయుడే.. అమెరికాలో స్థిరపడ్డారు. జాబ్ చేసి మానేశారు. కంపెనీ నెలకొల్పాలని అనుకున్నారు. అతని వెంట భార్య కూడా నడిచింది. ఇద్దరు కలిసి కంపెనీ నెలకొల్పి సక్సెస్ ఫుల్ కపుల్‌గా మారారు.

jay-3.jpg


అమెరికాలో చదువు, కొలువు.. తర్వాత

జై చౌదరి 1980లో అమెరికా వెళ్లారు. అక్కడ ఇంజినీరింగ్ చదివారు. తర్వాత ఐబీఎంలో జాబ్ చేశారు. యునిసిస్ కంపెనీలో కూడా పని చేశారు. సిలికాన్ వ్యాలీలో డాట్ కామ్ బూమ్, నెట్ స్కేప్ స్టార్టప్‌లు సక్సెస్ అయ్యాయి. దాంతో సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసే దిశగా చౌదరి అడుగులు వేశారు. అట్లాంటాలో ఐక్యూ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ జాబ్ వదులకున్నారు. అతని భార్య జ్యోతి బెల్ సౌత్‌లో సిస్టమ్స్ ఆనలిస్ట్ జాబ్ వదిలేసి, భర్త వెంట నడిచింది. ఇద్దరు కలిసి కూడబెట్టిన 5 లక్షల డాలర్లతో 1997లో సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్ వేర్ స్టార్టప్ ‘సెక్యూర్ ఐటీ’ ప్రారంభించారు. ఆ సమయంలో ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఫైర్ వాల్స్ కేవలం 5 శాతం మాత్రమే ఉండేవి. క్రమంగా వాటిని గణనీయంగా పెంచారు. కేవలం 18 నెలల్లో ఫైర్ వాల్స్ 50 శాతానికి చేరుకున్నాయని చౌదరి వివరించారు. అలా చౌదరి విజయ ప్రస్థానం ప్రారంభమైంది. 1998లో సెక్యూర్ ఐటీ కంపెనీని వెరిసైన్‌కు 70 మిలియన్ డాలర్లకు విక్రయించారు. ఏడాదిలో చౌదరి అంటే ఏంటో తెలిసి వచ్చింది. తర్వాత మరో రెండు సైబర్ సెక్యూరిటీ కంపెనీలు, ఈ కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేశారు.

jay-1.jpg


Trump Shooter: ట్రంప్‌పై కాల్పులకు ముందు మాస్టర్ ప్లాన్.. అతడేం చేశాడో తెలుసా?

మలుపు తిప్పిన జెడ్ స్కాలర్

సైబర్ సెక్యూరిటీ కంపెనీలు, ఈ కామర్స్ బిజినెస్‌ను చౌదరి చూస్తున్నారు. దాంతో ఆయన సంతృప్తి చెందలేదు. 2007లో కీలక నిర్ణయం తీసుకున్నారు. పాత ఫైర్ వాల్స్ నుంచి క్లౌడ్ మార్చే దిశగా అడుగులు వేశారు. అందుకోసం జెడ్ స్కాలర్ అనే కంపెనీని నెలకొల్పారు. చౌదరి దంపతులు 50 మిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టారు. తాను అనుకున్నది సాధించేందుకు చౌదరి దంపతులు అహోరాత్రులు శ్రమించారు. ఆ దంపతులను విజయం వరించింది. ప్రస్తుతం జెడ్ స్కాలర్ వార్షిక ఆదాయం 1.6 బిలియన్ డాలర్లుగా ఉంది. 30 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగి ఉంది. చౌదరి నికర ఆదాయం 11.5 బిలియన్లు అని ఫోర్బ్స్ అంచనా వేసింది.

jay-2.jpg


కాలేజీ కుర్రాడు

‘నా జీవితాన్ని స్టార్టప్ ఆలోచన మలుపు తిప్పింది. నేను చదివేందుకు ఇష్టపడతా. సాంకేతికత అంటే ఇష్టం. 1996లో నెట్ స్కేప్ స్టార్టప్ విజయం నన్ను కంపెనీ పెట్టేందుకు ప్రేరెపించింది. నెట్ స్కేప్ స్టార్టప్ వ్యవస్థాపకుడు మార్క్ ఆండ్రెసిన్ కాలేజీ యువకుడు. మరి నేను ఎందుకు స్టార్టప్ ప్రారంభించకూడదు అనుకున్నా. ఆ విషయం గురించి భార్యతో మాట్లాడా. అదే విషయంపై ఇద్దరం ఎక్కువ ఆలోచించాం. తర్వాత మాకు నమ్మకం కలిగింది. నేను చిన్నప్పుడు సాధారణ జీవితం గడిపా. జార్జియాలో గల అల్ఫారెట్టాలో 2 లక్షల డాలర్లతో చిన్న ఇల్లు ఉంది. ఆ సమయంలో నా వద్ద ఫ్యాన్సీ కారు లేదు. నా కుమారుడు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివాడు అని’ జై చౌదరి తన విజయగాధను వివరించారు.

jay-4.jpg


Read Latest
International News and Telugu News

Updated Date - Jul 16 , 2024 | 05:37 PM