Students: ఆస్ట్రేలియాకు భారీగా తగ్గిన భారత విద్యార్థులు
ABN , Publish Date - Oct 05 , 2024 | 05:00 AM
ఆస్ట్రేలియాకు ఉన్నత విద్య కోసం వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దరఖాస్తులు సంఖ్యలో 66ు తగ్గుదల ఉందని ‘ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’ పత్రిక పేర్కొంది.
న్యూఢిల్లీ, అక్టోబరు 4: ఆస్ట్రేలియాకు ఉన్నత విద్య కోసం వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దరఖాస్తులు సంఖ్యలో 66ు తగ్గుదల ఉందని ‘ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’ పత్రిక పేర్కొంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం జూలైలో ఫీజులను భారీగా పెంచింది. గత ఏడాది వరకూ విదేశీ విద్యార్థులు తమ ఖాతాల్లో సేవింగ్స్ రూపంలో రూ.12 లక్షలు చూపించాల్సి వచ్చేది.
దానిని రూ.17 లక్షలకు పెంచుతూ రెండు దఫాలుగా నిర్ణయం తీసుకుంది. దీనికితోడు వివిధ కారణాలు చూపుతూ అక్కడే ఉండిపోవడానికి ప్రయత్నించే వారిని అడ్డుకోవడానికి అనువుగా నిబంధనలను కఠినతరం చేసింది. దీంతో ఆస్ట్రేలియాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య 66,910 నుంచి 22,967కి పడిపోయింది.