Share News

Donald Trump: ట్రంప్‌పై కాల్పులు.. చైనాలో ట్రంప్ ఫొటోలతో టీ షర్టులు

ABN , Publish Date - Jul 14 , 2024 | 06:35 PM

పెన్సిల్వేనియాలో ఆదివారం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump)పై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఎన్నికలు జరగనున్న ఏడాదిలో ట్రంప్‌పై హత్యాయత్నం అమెరికా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

Donald Trump: ట్రంప్‌పై కాల్పులు.. చైనాలో ట్రంప్ ఫొటోలతో టీ షర్టులు

న్యూయార్క్: పెన్సిల్వేనియాలో ఆదివారం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump)పై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఎన్నికలు జరగనున్న ఏడాదిలో ట్రంప్‌పై హత్యాయత్నం అమెరికా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనను అందరూ ఖండించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు.

ప్రధాని మోదీ సైతం ఈ ఘటనను ఖండించారు. అయితే ట్రంప్‌పై కాల్పులు జరిపిన 2 గంటల్లోపే అమెరికా వీధుల్లో టీ షర్టులు వైరల్ అవుతున్నాయి. ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిపిన 2 గంటల తర్వాత, చైనా ఆన్‌లైన్ రిటైలర్లు సావనీర్ టీ-షర్టులను విక్రయించడం ప్రారంభించారు.


టావోబావో విక్రేత లి జిన్‌వీ మాట్లాడుతూ.. "ట్రంప్‌పై కాల్పులు జరిగిన వెంటనే టావోబావోపై టీ షర్టులను ముద్రించడం ప్రారంభించాం. డిజిటల్ ప్రింటింగ్ టెక్నాలజీ షర్ట్‌లపై 'Shooting Makes me Stronger' అని ముద్రిస్తున్నాం"అని తెలిపారు. ట్రంప్‌పై కాల్పుల అంశం దేశ విదేశాల్లో ప్రకంపనలు రేపుతోంది. నిందితుడిని థామస్ మ్యాథ్యూ క్రూక్స్‌గా గుర్తించారు.

For Latest News and National News click here

Updated Date - Jul 14 , 2024 | 07:12 PM