King Charles: కింగ్ చార్లెస్‌కు క్యాన్సర్
ABN , Publish Date - Feb 06 , 2024 | 09:34 AM
బ్రిటన్ రాజు ఛార్లెస్‌కు క్యాన్సర్ వ్యాధి సోకింది. ప్రొస్టేట్ గ్రంథికి సంబంధించిన పరీక్షలు నిర్వహించే సమయంలో వ్యాధి నిర్ధారణ జరిగింది. ఏ క్యాన్సర్ వచ్చిందనే అంశాన్ని మాత్రం బకింగ్ హోమ్ ప్యాలెస్ వెల్లడించలేదు.
ఏబీఎన్ ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్ రాజు ఛార్లెస్ (Charles) క్యాన్సర్ వ్యాధి సోకింది. ప్రొస్టేట్ గ్రంథికి సంబంధించిన పరీక్షలు నిర్వహించే సమయంలో వ్యాధి నిర్ధారణ జరిగింది. ఏ క్యాన్సర్ వచ్చిందనే అంశాన్ని మాత్రం బకింగ్ హోమ్ ప్యాలెస్ వెల్లడించలేదు. ప్రస్తుతం ఛార్లెస్ ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొంది. కొన్నిరోజులు విధులకు దూరంగా ఉంటారని ప్రకటనలో తెలిపింది.
అనారోగ్య సమస్యలతో గత నెలలో కింగ్ ఛార్లెస్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అక్కడ మూడు రోజులు ఉన్నారు. ఆ సమయంలో క్యాన్సర్ సోకిందనే విషయం తెలిసింది. వ్యాధికి సంబంధించిన చికిత్సను వైద్యులు ప్రారంభించారు. క్యాన్సర్ సోకినందున ప్రజలతో సమావేశం కావొద్దని వైద్యులు సూచించారు. అధికారి, అనధికార కార్యక్రమాలు ప్రిన్స్ చార్లెస్ దూరంగా ఉంటారని బకింగ్ హోమ్ ప్యాలెస్ మీడియాకు తెలిపింది. వైద్య బృందానికి కింగ్ ఛార్లెస్ కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు అందజేస్తోన్న చికిత్స గురించి సంతృప్తిగా ఉన్నారు. క్యాన్సర్ వ్యాధి నుంచి కోలుకుంటానని చెబుతున్నారు. త్వరలో విధులు నిర్వహిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.