Thailand: థాయ్‌లాండ్ కొత్త ప్రధానిగా షినవత్రా.. మోదీ విషెస్
ABN , Publish Date - Aug 18 , 2024 | 11:56 AM
మాజీ ప్రధాని థాక్సిన్ కుమార్తె పేటోంగ్‌టార్న్ షినవత్రా(Paetongtarn Shinawatra)ను థాయ్‌లాండ్(Thailand) పార్లమెంటు ప్రధానమంత్రిగా ఎన్నుకుంది. 37 ఏళ్ల వయస్సులో ఆమె దేశంలోని అతి పిన్న వయస్కురాలిగా ఎంపికయ్యారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ థాయ్‌లాండ్ ప్రధానమంత్రికి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.
బిలియనీర్, వ్యాపారవేత్త, మాజీ ప్రధాని థాక్సిన్ కుమార్తె పేటోంగ్‌టార్న్ షినవత్రా(Paetongtarn Shinawatra)ను థాయ్‌లాండ్(Thailand) పార్లమెంటు ప్రధానమంత్రిగా ఎన్నుకుంది. 37 ఏళ్ల వయస్సులో ఆమె దేశంలోని అతి పిన్న వయస్కురాలిగా ఎంపికయ్యారు. ఆమె అత్త యింగ్లక్ తర్వాత ఈ పదవిని చేపట్టిన రెండవ మహిళ కావడం విశేషం. మాజీ ప్రధాని శ్రేతా తవిసిన్ రాజ్యాంగ న్యాయస్థానం ద్వారా తొలగించబడిన రెండు రోజుల తర్వాత షినవత్రా ఎంపిక జరిగింది. ఇద్దరూ ఫ్యూ థాయ్ పార్టీకి చెందినవారు.
ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ థాయ్‌లాండ్ ప్రధానమంత్రికి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో విజయవంతంగా మీ పదవీకాలం నిర్వహించాలని ఆకాంక్షించారు. దీంతోపాటు భారతదేశం, థాయ్‌లాండ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, మీతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నామని చెప్పారు.
310 మంది ఎంపీల మద్దతు
నైతిక ఉల్లంఘన కేసులో కోర్టు నిర్ణయంతో మాజీ ప్రధాని శ్రేతా తవిసిన్ ఇటీవల తొలగించబడ్డారు. శుక్రవారం జరిగిన పార్లమెంటరీ ఓటింగ్‌లో ఎంపీలు షినవత్రా(Shinawatra)ను దేశ ప్రధానిగా ఎన్నుకున్నారు. థాయ్‌లాండ్ చరిత్రలో పేటోంగ్‌టార్న్ షినవత్రా రెండో మహిళా ప్రధానమంత్రి. పాంటోంగ్టార్న్ థాయిలాండ్ అధికార పార్టీ అయిన ఫ్యూ థాయ్ నాయకుడు. ఆయన ఎన్నికైన ఎంపీ కాదు. ప్రధానమంత్రి పదవికి అభ్యర్థిగా ఎంపీగా ఉండాల్సిన అవసరం లేదు.
అనుకూలంగా 310 ఓట్లు
ప్రధానమంత్రి పదవికి పేటోంగ్‌టార్న్ మాత్రమే అభ్యర్థి. పార్లమెంటులో ఆమెకు అనుకూలంగా 310 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 145 మంది సభ్యులు ఓటు వేశారు. 27 మంది ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. ప్రస్తుత కొత్త ప్రధాని పేటోంగ్‌టార్న్ అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. థాయ్‌లాండ్‌లో నిలిచిపోయిన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం. సైనిక తిరుగుబాట్లు, కోర్టు జోక్యాలను నివారించడం కీలకమని చెప్పవచ్చు.
షినవత్రా ఎవరు?
థాయ్‌లాండ్ మాజీ ప్రధాని తక్సిన్ షినవత్రా చిన్న కుమార్తె పేటోంగ్‌టార్న్ . Eng అనే మారుపేరుతో పిలువబడే పేటోంగ్‌టార్న్, థాయ్‌లాండ్‌లోని ప్రతిష్టాత్మకమైన చులాలాంగ్‌కార్న్ విశ్వవిద్యాలయం, UK నుంచి హోటల్ మేనేజ్‌మెంట్, రాజకీయ శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఆమె 17 సంవత్సరాల వయస్సులో ఆమె మాస్టర్స్ చదువుతున్న సమయంలో మెక్‌డొనాల్డ్స్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేయడం ద్వారా వెలుగులోకి వచ్చారు.
హోటల్‌కి CEO
పేటోంగ్‌టార్న్ రాండ్ డెవలప్‌మెంట్ కంపెనీ హోటల్‌కి CEOగా కూడా పనిచేశారు. అక్కడ తన నాయకత్వ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చే వరకు ఆమె ఈ పదవిలో కొనసాగారు. పటోంగ్టార్న్ వాణిజ్య పైలట్ పిడోక్ సూక్సావాస్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. గతేడాది ఎన్నికల ప్రచారం సమయంలో ఆమెకు మగబిడ్డ పుట్టాడు.
ఇవి కూడా చదవండి:
Attack: మహిళా ఎయిర్ హోస్టెస్‌పై దాడి.. స్పందించిన ఎయిర్ ఇండియా
Kolkata : హోరెత్తిన వైద్యుల నిరసన
Delhi : కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్‌గా అభిషేక్ సింఘ్వీ
Read More International News and Latest Telugu News