Share News

Indian: ఇజ్రాయెల్ సరిహద్దులో క్షిపణి దాడి.. భారతీయుడు మృతి, మరో ఇద్దరికి గాయాలు

ABN , Publish Date - Mar 05 , 2024 | 09:40 AM

ఇజ్రాయెల్‌పై సోమవారం క్షిపణి దాడి జరిగింది. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులో గల మార్గలియట్ వ్యవసాయ క్షేత్రంపై క్షిపణి దాడి జరిగిందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. క్షిపణి దాడిలో ఓ భారతీయ పౌరుడు మృతిచెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ముగ్గురు కేరళకు చెందిన వారని అధికారులు ప్రకటించారు.

Indian: ఇజ్రాయెల్ సరిహద్దులో క్షిపణి దాడి.. భారతీయుడు మృతి, మరో ఇద్దరికి గాయాలు

ఏబీఎన్ ఇంటర్నెట్: ఇజ్రాయెల్‌పై (Israel) సోమవారం క్షిపణి దాడి జరిగింది. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులో గల మార్గలియట్ వ్యవసాయ క్షేత్రంపై క్షిపణి దాడి (Missile Attack) జరిగిందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. క్షిపణి దాడిలో ఓ భారతీయ పౌరుడు (Indian National) మృతిచెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ముగ్గురు కేరళకు చెందిన వారని అధికారులు ప్రకటించారు. క్షిపణి దాడిలో చనిపోయిన వ్యక్తి కేరళలో గల కొల్లామ్‌కు చెందిన పట్నిబిన్ మాక్స్‌వెల్‌గా గుర్తించారు. గాయపడ్డ జోసెఫ్ జార్జ్, పాల్ మెల్విన్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పాల్‌కు సర్జరీ జరిగిందని తెలుస్తోంది. ఇజ్రాయెల్‌లో క్షిపణి దాడి చేసింది హెజ్ బొల్లా అని సందేహిస్తున్నారు. హమాస్‌కు మద్దతుగా అక్టోబర్ 8వ తేదీ నుంచి ఉత్తర ఇజ్రాయెల్‌లో గల పలు ప్రాంతాలపై రాకెట్లు, క్షిపణులు, డ్రోన్లతో దాడికి హెజ్ బొల్లా తెగబడుతోంది. ప్రతీకారంగా హెజ్ బొల్లా స్థావరాలపై దాడి చేస్తున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. హమాస్ యుద్దం ప్రారంభమైనప్పటి నుంచి లెబనాన్ కేంద్రంగా పనిచేస్తోన్న హెజ్ బొల్లాతో ఇజ్రాయెల్‌ మధ్య ఘర్షణ నెలకొంది. హెజ్ బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఈ ఘర్షణలో 10 మంది తమ సైనికులు చనిపోయారని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడులతో తమ 229 మంది సిబ్బంది చనిపోయారని హెజ్ బొల్లా చెబుతోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 05 , 2024 | 09:41 AM