Share News

Hamza bin laden: బతికే ఉన్న బిన్ లాడెన్ కొడుకు.. మళ్లీ ఊపిరి పోసుకుంటున్న అల్‌ ఖైదా!

ABN , Publish Date - Sep 13 , 2024 | 05:45 PM

బిన్ లాడెన్ మరణంతో కనుమరుగైపోయిన ఉగ్ర సంస్థ అల్ ఖైదా మళ్లీ బుసలు కొడుతోందా? లాడెన్ కుమారుడు హమ్జా లాడెన్ నేతృత్వంలో పాశ్చాత్య ప్రపంచాన్ని మరోసారి టార్గెట్ చేయనుందా? అంటే అవుననే అంటోంది అంతర్జాతీయ మీడియా. అతడి నేతృత్వంలో అల్ ఖైదా మళ్లీ పాశ్చాత్య ప్రపంచాన్ని టార్గెట్ చేసుకునేందుకు రెడీ అవుతోందన్న వార్త సంచలనంగా మారింది.

Hamza bin laden: బతికే ఉన్న బిన్ లాడెన్ కొడుకు.. మళ్లీ ఊపిరి పోసుకుంటున్న అల్‌ ఖైదా!

ఇంటర్నెట్ డెస్క్: బిన్ లాడెన్ మరణంతో కనుమరుగైందని అంతా భావిస్తున్న ఉగ్ర సంస్థ అల్ ఖైదా మళ్లీ బుసలు కొడుతోందా? లాడెన్ కుమారుడు హమ్జా లాడెన్ నేతృత్వంలో పాశ్చాత్య ప్రపంచాన్ని మరోసారి టార్గెట్ చేయనుందా? అంటే అవుననే అంటోంది అంతర్జాతీయ మీడియా. ఉగ్ర ప్రపంచపు రాకుమారుడిగా పేరు పడ్డ హమ్జా బిన్ లాడెన్ (Hamza bin Laden) 2019లో అమెరికా దాడుల్లో మరణించాడని ఇప్పటివరకూ అంతా భావించారు. కానీ హమ్జా సజీవంగా ఉండటమే కాకుండా అఫ్ఘానిస్థాన్‌లో తలదాచుకున్నాడని, అల్ ఖైదాకు మళ్లీ కొత్త జవసత్వాలనిస్తూ పాశ్చాత్య ప్రపంచాన్ని టార్గెట్ చేసుకునేందుకు సిద్ధమయ్యాడన్న వార్త ప్రస్తుతం కలకలం రేపుతోంది(Osama Bin Laden's Son Hamza Alive).


అమెరికా సేనలు తరలిపోయాక అప్ఘానిస్థాన్‌ను (Afghanistan) తాలిబన్లు హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. మత ఛాందస వాదంతో ఒకప్పుడు స్థానిక ప్రజలకు నరకం చూపించిన తాలీబన్లు తాము ప్రస్తుతం మారిపోయామని ప్రపంచానికి నచ్చ చెప్పేప్రయత్నం చేస్తున్నారు. తమ దేశంతో దౌత్య సంబంధాలు పునరుద్ధరించాలంటూ భారత్ సహా అనేక దేశాలను అభ్యర్థిస్తున్నారు. మరోవైపు, తాలిబన్లకు పాకిస్థాన్ పూర్తి మద్దతునిస్తూ అంతర్జాతీయ సమాజం మనసు మార్చే ప్రయత్నం చేస్తోంది. అయితే, తాలిబన్ల ఆధీనంలోని ఆఫ్ఘనిస్థాన్‌ ఉగ్ర మూకల అడ్డాగా మారిందని అంతర్జాతీయ మీడియా ఇప్పటికే పలు మార్లు హెచ్చరించింది. అల్ ఖైదా, పాక్‌కు చెందిన టీపీపీ ఉగ్రవాదులు కూడా అక్కడ ఆశ్రయం పొందుతున్నారని చెబుతోంది. ఈ నేపథ్యంలో బిన్ లాడెన్ కుమారుడు కూడా బతికే ఉన్నాడన్న వార్త పెను కలకలానికి దారి తీసింది.


మీడియా కథనాల ప్రకారం, హమ్జా బిన్ లాడెన్ ప్రస్తుతం దారా అబ్దుల్లా ఖేల్ జిల్లాలో తలదాచుకున్నాడు. సుమారు 450 మంది పాకిస్థానీ, అరబ్బు ఉగ్రవాదులు అతడికి కాపలా కాస్తున్నారు. బిన్ లాడెన్ మరణం తరువాత చెల్లాచెదురై పోయిన అల్ ఖైదా ఉగ్రవాదులు హమ్జా నేతృత్వంలో మళ్లీ ఏకీకృతం అవుతున్నారట. బిన్ లాడెన్ అనంతరం అల్ ఖైదా పగ్గాలు అయమన్ అల్ జవహరీ చేతికి వెళ్లాయి. అప్పట్లో హమ్జా అయమన్‌తో కూడా కలిసి పనిచేశాడట.


అయితే, 2019లో అమెరికా వైమానిక దాడుల్లో హమ్జా మరణించినట్టు వార్తలు వెలువడ్డా దాన్ని నిఘా వర్గాలు ఖండించినట్టు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. అప్ఘానిస్థాన్‌లోని తాలిబన్ల వ్యతిరేక కూటమని నేషనల్ మొబిలైజేషన్ ఫ్రంట్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. హమ్జాను అమెరికా గతంలోనే గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించింది. అతడు ఇరాన్‌లో గృహనిర్బంధంలో ఉన్నట్టు కూడా గతంలో వార్తలు వెలువడ్డాయి. హమ్జా సౌదీ అరేబియాలోని జెద్దాలో జన్మించాడు. ఆ తరువాత కొన్నేళ్ల పాటు తల్లితో కలిసి ఇరాన్‌లో నివసించాడు. ఇక పాకిస్థాన్‌లో తలదాచుకున్న బిన్ లాడెన్‌‌ను 2011లో అమెరికా ప్రత్యేక సైనిక దళాలు మట్టుపెట్టిన విషయం తెలిసిందే.

Read Latest and International News

Updated Date - Sep 13 , 2024 | 05:58 PM