PM Modi Russia Tour: భారతీయ వస్త్రాధరణలో ప్రధాని మోదీకి స్వాగతం పలికిన రష్యన్ చిన్నారి..
ABN , Publish Date - Jul 09 , 2024 | 11:18 AM
PM Narendra Modi in Russia: ఐదేళ్ల తరువాత రష్యాకు వెళ్లిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆ దేశం ఘన స్వాగతం పలికింది. రెండు రోజు పర్యటనలో భాగంగా రష్యాకు వెళ్లిన ప్రధాని మోదీకి అక్కడ విశేష స్వాగత సత్కారాలు లభించాయి. అయితే, ప్రధాని మోదీ రాక సందర్భంగా మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో రష్యన్ మహిళలు భాంగ్రా నృత్య ప్రదర్శన...
PM Narendra Modi in Russia: ఐదేళ్ల తరువాత రష్యాకు వెళ్లిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆ దేశం ఘన స్వాగతం పలికింది. రెండు రోజు పర్యటనలో భాగంగా రష్యాకు వెళ్లిన ప్రధాని మోదీకి అక్కడ విశేష స్వాగత సత్కారాలు లభించాయి. అయితే, ప్రధాని మోదీ రాక సందర్భంగా మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో రష్యన్ మహిళలు భాంగ్రా నృత్య ప్రదర్శన చేశారు. భారతీయ సంప్రదాయ వస్త్రధారణలో.. భాంగ్రా డ్యాన్స్ చేస్తూ మోదీకి వెల్‌కమ్ చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
స్పెషల్ అట్రాక్షన్‌గా చిన్నారి..
ఇదిలాఉంటే..అయితే, ఈ మహిళల గ్రూప్‌లో ఓ చిన్నారి బాగా హైలెట్ అయ్యింది. రష్యాకు చెందిన ఐదేళ్లలోపు వయసున్న చిన్నారి.. భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి ఆకట్టుకుంది. అంతేకాదండోయ్.. ధోల్ దరువులకు ఎంతో ఉత్సాహంగా నృత్యం చేస్తూ.. సాంస్కృతిక కార్యక్రమాల్లో సందడి చేసింది. చూడచక్కని రూపుతో, ఆకట్టుకునే వస్త్రాలంకరణతో డ్యాన్స్ కుమ్మేసింది. ఈ చిన్నారి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది క్షణాల్లో బాగా వైరల్ అయ్యింది. చిన్నారి తన నృత్యంతో నెటిజన్ల హృదయాన్ని కొల్లగొడుతోంది.
భారీగా వ్యూస్..
ఎక్స్‌లో ఈ వీడియోను పోస్ట్ చేసిన 24 గంటల్లోనే భారీగా వ్యూస్ వచ్చాయి. దాదాపు 1,20,000 మంది వీక్షించగా.. 7 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక చిన్నారి నృత్యానికి మంత్రముగ్దులైన నెటిజన్లు.. తమ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. హార్ట్ సింబల్స్ పెడుతున్నారు. చాలా క్యూట్‌గా ఉందని.. మోస్ట్ బ్యూటీఫుల్ అని మరికొందరు ఇలా తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
పుతిన్‌తో కీలక చర్చలు..
రెండు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యాకు వెళ్లారు. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌తో కలిసి 22వ వార్షిక భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. శిఖరాగ్ర సమావేశానికి ముందు.. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని మోదీకి ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఇక వీరి భేటీలో ద్వైపాక్షిక, ఆర్థిక సంబంధాలు, ఉక్రెయిన్ యుద్ధం సహా అనేక అంశాలపై ప్రధాని మోదీ చర్చించనున్నారు.