Lottery In UAE: 7, 13 నంబర్లు సెలక్ట్ చేశాడు.. రూ.33 కోట్ల లాటరీ కొట్టాడు
ABN , Publish Date - Feb 11 , 2024 | 11:35 AM
కేరళకు చెందిన రాజీవ్‌ను రూ.33 కోట్ల లాటరీ వరించింది. దాంతో అతను సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు. తాను గల్ఫ్‌లో గత పదేళ్ల నుంచి ఉంటున్నానని చెప్పుకొచ్చారు.
ఏబీఎన్ ఇంటర్నెట్ డెస్క్: కేరళకు చెందిన రాజీవ్‌ను (Rajeev) రూ.33 కోట్ల లాటరీ వరించింది. దాంతో అతను సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు. తాను గల్ఫ్‌లో గత పదేళ్ల నుంచి ఉంటున్నానని చెప్పుకొచ్చారు. మూడేళ్ల నుంచి లాటరీ టికెట్ కొంటున్నానని వివరించారు. ఇన్నాళ్లకు తనకు అదృష్టం వరించిందని సంతోషంగా ఉన్నారు.
లాటరీ నెంబర్ల ఎంపిక ఇలా
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అల్ఐన్‌లో ఆర్కిటెక్ కంపెనీలో రాజీవ్ పనిచేస్తున్నారు. తన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి ఉంటున్నారు. కొన్నాళ్ల నుంచి లాటరీ టికెట్ కొనుగోలు చేయడం ప్రారంభించారు. రెండు నెలల క్రితం మిలియన్ దిర్హామ్ లాటరీ మిస్ అయ్యింది. ఆ సమయంలో కూడా తన కుమారుల బర్త్ డే డేట్ ఎంపిక చేసి లాటరీ కొనుగోలు చేశారు. జనవరి 10వ తేదీన మాత్రం వారిని అదృష్టం వరించింది. ఆరు లాటరీ టికెట్లు కొనుగోలు చేసి, లాటరీ గెలుచుకున్నారు.
భార్యతో కలిసి సెలక్ట్
లాటరీ టికెట్లు కొనుగోలు చేయాలని రాజీవ్ నిర్ణయం తీసుకున్నారు. భార్యతో కలిసి టికెట్లను ఎంపిక చేశారు. తమ ఇద్దరు కుమారుల పుట్టిన తేదీతో ఉన్న నంబర్లను సెలక్ట్ చేశారు. అలా వారిని అదృష్టం వరించింది. 15 మిలియన్ దిర్హామ్ లాటరీ వచ్చింది. దీంతో రాజీవ్ ఆనందానికి అవధి లేకుండా పోయింది. తనకు ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదని అంటున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.