Share News

Hindus Rally: దాడుల నుంచి రక్షణ కల్పించాలని 30 వేల మంది హిందువుల ర్యాలీ

ABN , Publish Date - Nov 02 , 2024 | 11:43 AM

ముస్లింలు మెజారిటీగా ఉన్న బంగ్లాదేశ్‌లో తమకు రక్షణ లేకుండా పోయిందని హిందువులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మధ్యంతర ప్రభుత్వం తమను దాడులు, వేధింపుల నుంచి రక్షించాలని, హిందూ సమాజ నాయకులపై దేశద్రోహ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ 30 వేల మంది మైనారిటీ హిందువులు ర్యాలీ నిర్వహించారు.

Hindus Rally: దాడుల నుంచి రక్షణ కల్పించాలని 30 వేల మంది హిందువుల ర్యాలీ
Hindus protection

బంగ్లాదేశ్‌(Bangladesh)లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలు ఎవరికీ కనిపించడం లేదని హిందువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో యూనస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హిందువులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. 30 వేల మందికి పైగా హిందువులు బంగ్లాదేశ్ వీధుల్లోకి వచ్చి ర్యాలీ నిర్వహించారు. ఆ క్రమంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు ఉంచారు. బంగ్లాదేశ్‌లో నిరసన తెలిపేందుకు వచ్చిన హిందువులు తమకు ముస్లింల నుంచి రక్షణ కావాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు హిందువులపై పెట్టిన దేశద్రోహం కేసులను ఎత్తివేయాలని కోరారు. ఈ క్రమంలో హిందువులు బంగ్లాదేశ్ ప్రభుత్వానికి 72 గంటల అల్టిమేటం ఇచ్చారు.


అనేక చోట్ల నిరసనలు

బంగ్లాదేశ్‌లోని ఆగ్నేయ భాగంలో ఉన్న చిట్టగాంగ్‌లో ఈ నిరసన జరిగింది. పెద్ద ఎత్తున జనాలు రావడంతో చాలా దూరం వరకు రోడ్లన్నీ జనంతో కిటకిటలాడాయి. ప్రతి ఒక్కరూ రోడ్లపై బైఠాయించి తమ డిమాండ్లను నెరవేర్చాలని కొత్త ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హిందువుల గుంపును చూసిన తర్వాత చిట్టగాంగ్ వీధుల్లో పెద్ద సంఖ్యలో బంగ్లాదేశ్ పోలీసులు, భద్రతా దళాలను మోహరించారు. దీంతో చిట్టగాంగ్‌తో పాటు బంగ్లాదేశ్‌లోని అనేక చోట్ల నిరసనలు మొదలయ్యాయి. అయితే ఇంత పెద్ద సంఖ్యలో హిందువులు భారీ సంఖ్యలో ర్యాలీ చేయడంతో ఈ అంశం కాస్తా ప్రస్తుతం దేశ విదేశాల్లో చర్చనీయాంశంగా మారింది.


19 మంది హిందూ నేతలపై కేసు

బంగ్లాదేశ్‌లోని యూనస్ ప్రభుత్వం ఇప్పటివరకు 19 మంది హిందూ నాయకులపై కేసులు నమోదు చేసింది. వారిలో ఇద్దరిని అరెస్టు చేశారు. కేసు నమోదైన వారిలో హిందూ మత నాయకుడు చిన్మోయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారి కూడా ఉన్నారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా గళం విప్పారు. వీరంతా అక్టోబర్ 25న చిట్టగాంగ్‌లో జరిగిన ప్రదర్శనలో బంగ్లాదేశ్ జాతీయ జెండాపై కాషాయ జెండాను ఎగురవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బంగ్లాదేశ్ సనాతన్ జాగరణ్ మంచ్ నాయకుడు చిన్మోయ్ కృష్ణ దాస్ ఆగస్టు 5న షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టినప్పటి నుంచి హిందువులపై దాడులకు వ్యతిరేకంగా నిరసనలలో ముందంజలో ఉన్నారు.


హిందువుల జనాభా కేవలం 8 శాతం

ఆగస్టు నుంచి ఇప్పటి వరకు హిందువులపై వేల సంఖ్యలో దాడులు జరిగాయని హిందువులు అంటున్నారు. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాను అధికారం నుంచి తొలగించినప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో అస్థిర వాతావరణం నెలకొంది. ఆగస్టు 4, 2024న బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు జరిగినప్పటి నుంచి హిందువులనే కాకుండా బౌద్ధులు, క్రైస్తవులు, సిక్కులతో సహా మైనారిటీలందరిపై కూడా మారణహోమం కొనసాగుతోంది. ఆగస్టు 4 నుంచి బంగ్లాదేశ్‌లో హిందువులపై 2000కు పైగా దాడులు జరిగాయి.


మోదీ, ట్రంప్ కూడా..

ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా హిందువులపై జరుగుతున్న అకృత్యాలను ఇటివల ప్రస్తావించడం విశేషం. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ట్వీట్‌ను షేర్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ ఈ అంశాన్ని లేవనెత్తారు. ఐక్యరాజ్యసమితితో సహా అనేక ఏజెన్సీలు మానవ హక్కులను పరిరక్షించడానికి యూనస్ ప్రభుత్వానికి కఠినమైన ఆదేశాలు ఇచ్చాయి. ప్రస్తుతం నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం నడుస్తోంది. బంగ్లాదేశ్‌లో ముస్లిం జనాభా 91 శాతం కాగా, హిందువుల జనాభా 8 శాతం మాత్రమే ఉంది. ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం 72 గంటల్లోగా ఏమైనా చర్యలు తీసుకుంటుందా లేదా హిందువులు తమ ఆందోళనను తీవ్రతరం చేస్తారా అనేది చూడాలి.


ఇవి కూడా చదవండి:

US Elections: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో ఈ 2 రాష్ట్రాలే కీలకం.. ఇవే డిసైడ్ చేస్తాయా..


SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్‌ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..

Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..

Read More International News and Latest Telugu News

Updated Date - Nov 02 , 2024 | 11:46 AM