Sankranthi: క్రాకోవ్ నగరంలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
ABN , Publish Date - Jan 15 , 2024 | 11:16 AM
సంక్రాంతి పండగ వచ్చిందంటే ఆ సరదా వేరు. ఇంట్లో పిల్ల, పెద్దలతో సందడిగా ఉంటుంది. విదేశాల్లో సంక్రాంతి పండగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ఏబీఎన్ ఇంటర్నెట్ డెస్క్: సంక్రాంతి (Sankranthi) పండగ వచ్చిందంటే ఆ సరదా వేరు. ఇంట్లో పిల్ల, పెద్దలతో సందడిగా ఉంటుంది. విదేశాల్లో సంక్రాంతి (Sankranthi) పండగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పోలండ్‌లో (Poland) గల క్రాకోవ్ (Kraków) నగరంలో పోలండ్ తెలుగు అసోసియేషన్ (Pota) సంక్రాంతి సంబరాలను నిర్వహించింది. అక్కడి వందలాది మంది తెలుగు వారి వచ్చి పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. గత ఏడాది ఉగాది (Ugadi) వేడుకల్లో పోలండ్ రాజధాని వార్సాలో పొటా (Pota) ఏర్పడిన సంగతి తెలిసిందే.
క్రాకోవ్ నగరంలో భోగి పండగతో సంక్రాంతి పండగ సంబరాలు ప్రారంభం అయ్యాయి. సంస్కృతి, సాంప్రదాయాల గురించి పిల్లలకు తెలిపారు. ఇతర నగరాల నుంచి కూడా తెలుగు వారు వచ్చారు. పొటా చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి పలువురు ప్రసంసించారు. ఇతరులకు అందజేస్తున్న సహాయ సహకరాలను అభినందించారు. క్రాకోవ్‌లో సంక్రాంతి సంబరాలు కోర్ కమిటీ సభ్యులు చంద్రభాను అక్కల, చంద్రశేఖర్ అల్లూరి, సుమన్ కుమార్ జనగామ, దీక్షిత్ బసాని, అజిత్, మధుసూధన్ రెడ్డి, మౌనిక, అజయ్ ఆధ్వర్యంలో జరిగాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.