Home » Pongal
కుటుంబ కార్డులకు జనవరి మొదటి వారం నుంచి రేషన్ దుకాణాల ద్వారా పొంగల్(Pongal) గిఫ్ట్‌తో చీర, ధోవతి పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి గాంధీ(Minister Gandhi) పేర్కొన్నారు. ఈ అంశంపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.
భోగితో మొదలై సంక్రాంతితో సందడిగా మారుతుంది. మూడో రోజు కనుమతో సంక్రాంతి సంబరాలు ముగుస్తాయి. ప్రాంతాన్ని బట్టి కనుమకు ప్రత్యేకత ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కనుమ రోజున నోరూరించే నాన్ వెజ్ వంటకాలు చేసుకుంటారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే జల్లికట్టు క్రీడలో తాజాగా అపశృతి చోటుచేసుకుంది. అవనియాపురం జల్లికట్టు కార్యక్రమంలో ఇద్దరు పోలీసులతో సహా 45 మంది గాయపడ్డారు. మరికొంత మందిని ఆసుపత్రికి తరలించారు.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ జరుపుకోవడానికి ప్రజలు సిద్ధమవుతుండగా.. ఏపీలో రాజకీయ నాయకులు పండగను అందివచ్చిన అవకాశంగా భావిస్తున్నారు. ఎందుకనుకుంటున్నారా....
కోడి పందాలే కాదు గుండాట వల్ల కూడా డబ్బులు పోగొట్టుకుంటారు. కొంచెం డబ్బు వస్తే చాలు మరికొంత కావాలని ఆశతో ఉంటారు. ఒకవేళ డబ్బులు పోతే తిరిగి తెచ్చుకోవాలని ఆడతారు. పోయిన మనీ కోసం ఆడుతుంటే తిరిగి రావు. దీంతో జేబులు ఖాళీ అవుతుంటాయి.
సంక్రాంతి వచ్చిందంటే ఒక్కటే హడావిడి ఉంటుంది. స్కూళ్లకు సెలవులు ఇచ్చారో లేదో అంతే అలా పతంగులతో ఆడతారు. నగరాలు, పట్టణాల్లో ఎత్తైన బిల్డింగుల నుంచి గాలి పటం ఎగరేయడంతో ప్రమాదాలకు కారణం అవుతాయి.
సంక్రాంతి పండగ వచ్చిందంటే ఆ సరదా వేరు. ఇంట్లో పిల్ల, పెద్దలతో సందడిగా ఉంటుంది. విదేశాల్లో సంక్రాంతి పండగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
హైదరాబాద్‌లో ఆదివారం తెల్లవారుజామునుంచే వీధివీధినా.. ఇళ్లు, అపార్ట్మెంట్ల ముందు పెద్ద ఎత్తున భోగిమంటలు వేసి పిన్నాపెద్దా అందరూ కలిసి అక్కడ గుమిగూడి సరదాగా ముచ్చట్లు చెప్పుకోవడం కనిపించింది. అలాగే రాత్రుళ్లు మహిళలంతా కలిసి కబుర్లు చెప్పుకొంటూ.. వీధి గుమ్మాల్లో అందమైన రంగవల్లులను ఆవిష్కరిస్తున్నారు. ఆనవాయితీ ఉన్నవారు బొమ్మల కొలువులు తీర్చిదిద్దుతున్నారు. పిల్లలేమో అపార్ట్మెంట్లు, ఇళ్ల మేడలపైకెక్కి పతంగులు ఎగరేస్తూ రచ్చరచ్చ చేస్తున్నారు. మొత్తమ్మీద.. పండుగ ఉత్సాహం ఎల్లెడలా తొణికిసలాడుతోంది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని మంత్రి మురుగన్ అధికారిక నివాసంలో పొంగల్ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. ఈ వేడుకలో భాగంగా ఓ చిన్నారి పాటను ఆలపించగా అది విన్న ప్రధాని చిన్నారికి బహుమానం అందించారు.
భోగ భాగ్యాల పండుగ భోగి. సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజు భోగి. ఆ రోజు చలి ఎక్కువగా ఉండటంతో భోగి మంటలు వేసుకుంటారు.