Corona Virus: మళ్లీ కరోనా కలకలం.. మాస్కులు ధరించాల్సిందేనని ఆదేశం
ABN , Publish Date - May 19 , 2024 | 02:16 PM
ప్రపంచవ్యాప్తంగా రెండు, మూడుసార్లు లాక్డౌన్స్ నిర్వహించిన తర్వాత.. కరోనా ప్రభావమైతే గణనీయంగానే తగ్గింది. కొన్ని దేశాల్లో వివిధ వేరియెంట్లు పంజా విసిరినా, కొవిడ్ కేసులు నమోదైనా..
ప్రపంచవ్యాప్తంగా రెండు, మూడుసార్లు లాక్డౌన్స్ (Corona Lockdown) నిర్వహించిన తర్వాత.. కరోనా ప్రభావమైతే గణనీయంగానే తగ్గింది. కొన్ని దేశాల్లో వివిధ వేరియెంట్లు (Corona Varients) పంజా విసిరినా, కొవిడ్ కేసులు నమోదైనా.. మునుపటిలా ఎక్కువ స్థాయిలో నమోదవ్వలేదు. క్రమంగా దాని ప్రభావం తగ్గుతూ వచ్చింది. దీంతో.. ఈ వైరస్ కథ ఇక కంచికి చేరినట్లేనని అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ.. ఇంతలోనే ఇది ఊహించని షాక్ ఇచ్చింది. తన కథ ఇంకా ముగిసిపోలేదంటూ.. మళ్లీ కోరకలు చాచడం మొదలుపెట్టింది. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం.
సీఎం యోగి సంచలన ప్రకటన.. మరో ఆరు నెలల్లోనే..
సింగపూర్లో కరోనా మరోసారి విజృంభించింది. కేవలం వారం రోజుల్లోనే (మే 5 నుంచి 11వ తేదీ వరకు) అక్కడ 25,900 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. దీంతో.. అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇది మరింత ఉధృతమైతే పరిస్థితులు భయంకరంగా మారొచ్చన్న ఉద్దేశంతో.. ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే.. ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సింగపూర్ ఆరోగ్యశాఖ మంత్రి ఆంగ్ యె కుంగ్ మాట్లాడుతూ.. ‘‘కొత్తగా కొవిడ్ ఉద్ధృతి మొదలవుతోంది. అది క్రమంగా పెరుగుతోంది. నాలుగు వారాల్లో ఇది గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉంది’’ అని తెలిపారు.
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ఐపీఎల్లో సరికొత్త రికార్డు
మరోవైపు.. సింగపూర్ ఆసుపత్రుల్లో చేరే కరోనా రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. గత వారం రోజులుగా ప్రతిరోజూ 250 మంది కొవిడ్ బాధితులు హాస్పిటల్స్లో చేరుతున్నట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ తరుణంలోనే.. ఆసుపత్రులు సంసిద్ధం కావాలని ఆదేశాలు జారీ చేసింది. రోగులకు పడకలను అందుబాటులో ఉంచాలని, అత్యవసరం కాని శస్త్రచికిత్సలను వాయిదా వేయాలని సూచించింది. అలాగే.. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారు, 60 కంటే ఎక్కువ వయస్సుగల వారు కరోనా వ్యాక్సిన్ను తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి ప్రజలను విజ్ఞప్తి చేశారు.
Read Latest International News and Telugu News