Share News

Starbucks: ఇంటి నుంచి ఆఫీసుకి రోజూ 1,600 కి.మీల ప్రయాణం

ABN , Publish Date - Aug 22 , 2024 | 05:01 AM

ప్రముఖ కాఫీ బ్రాండ్‌ స్టార్‌బక్స్‌ నూతన సీఈవో బ్రియాన్‌ నికోల్‌ ఇంటి నుంచి ఆఫీసుకి ప్రతి రోజు 1600 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు.

Starbucks: ఇంటి నుంచి ఆఫీసుకి రోజూ 1,600 కి.మీల ప్రయాణం

  • ప్రైవేటు జెట్‌లో చక్కర్లు కొట్టనున్న స్టార్‌బక్స్‌ కొత్త సీఈవో

కాలిఫోర్నియా, ఆగస్టు 21: ప్రముఖ కాఫీ బ్రాండ్‌ స్టార్‌బక్స్‌ నూతన సీఈవో బ్రియాన్‌ నికోల్‌ ఇంటి నుంచి ఆఫీసుకి ప్రతి రోజు 1600 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు. నికోల్‌ నివాసం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉండగా స్టార్‌బక్స్‌ ప్రధాన కార్యాలయం సియాటెల్‌లో ఉంది. స్టార్‌బక్స్‌కు చెందిన ప్రైవేట్‌ జెట్‌లో ఆయన రోజూ ఇంటి నుంచి ఆఫీసుకు చేరుకోనున్నారు. బ్రియాన్‌ నికోల్‌ను సీఈవోగా నియమిస్తూ స్టార్‌బక్స్‌ జారీ చేసిన ఆఫర్‌ లెటర్‌లో ఈ వివరాలు ఉన్నాయి.


స్టార్‌బక్స్‌ హైబ్రిడ్‌ వర్క్‌ నిబంధనల ప్రకారం వారంలో కనీసం 3రోజులు ఆయన సంస్థ ప్రధాన కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. మిగిలిన రోజులు ఇంటి నుంచి పని చేయవచ్చు. ఇంతకీ బ్రియాన్‌ నికోల్‌ జీతం ఎంతో తెలుసా.. ఏడాదికి సుమారు రూ.13.50 కోట్లు. ప్రస్తుతం చిపోటెల్‌ అనే ఫాస్ట్‌ఫుడ్‌ వ్యాపార సంస్థ సీఈవోగా పని చేస్తున్న బ్రియాన్‌ నికోల్‌ సెప్టెంబరు 9న స్టార్‌బక్స్‌ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. నికోల్‌ హయాంలో చిపోటెల్‌ గతంలో ఆ సంస్థ ఎన్నడూ చూడనంతగా లాభాల బాట పట్టింది.

Updated Date - Aug 22 , 2024 | 05:01 AM