Share News

ఇరాన్‌ రాయబారితో ఎలాన్‌ మస్క్‌ భేటీ!

ABN , Publish Date - Nov 16 , 2024 | 05:06 AM

అమెరికా, ఇరాన్‌ అంతర్యుద్ధం వేళ కీలక పరిణామం జరిగింది. ఐక్యరాజ్యసమితికి ఇరాన్‌ రాయబారి అమీర్‌ సయీద్‌ ఇరవానితో అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ భేటీ అయ్యారు.

ఇరాన్‌ రాయబారితో ఎలాన్‌ మస్క్‌ భేటీ!

న్యూయార్క్‌, నవంబరు 15: అమెరికా, ఇరాన్‌ అంతర్యుద్ధం వేళ కీలక పరిణామం జరిగింది. ఐక్యరాజ్యసమితికి ఇరాన్‌ రాయబారి అమీర్‌ సయీద్‌ ఇరవానితో అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ భేటీ అయ్యారు. ఓ రహస్య ప్రదేశంలో వీరిద్దరు సమావేశమైనట్లు శుక్రవారం న్యూయార్క్‌ టైమ్స్‌ ఒక కథనంలో పేర్కొంది. కనీసం గంట పాటు జరిగిన చర్చల్లో రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు దృష్టి సారించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలను తొలగించాలని, రెండు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలను పునరుద్ధరించాలని ఆ దేశ రాయబారి కోరినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశానికి సంబంధించి అమెరికా, ఇరాన్‌ అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Updated Date - Nov 16 , 2024 | 05:06 AM