UFO: గ్రహాంతరవాసులు ఉన్నారా.. మరోసారి చర్చకు దారి తీసిన వీడియో..
ABN , Publish Date - Nov 29 , 2024 | 02:12 PM
అమెరికా క్యాపిటల్ భవనంపై గత వారం అన్‌ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జక్ట్స్ (UFO)లు కనిపించాయన్న వార్త తీవ్ర కలకలం రేపింది. ప్రకాశవంతమైన లైట్లతో యూఎఫ్‌వోలు కనిపించాయంటూ జరిగిన ప్రచారం వైరల్ అయ్యింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా క్యాపిటల్ భవనంపై గత వారం అన్‌ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జక్ట్స్ (UFO)లు కనిపించాయన్న వార్త తీవ్ర కలకలం రేపింది. ప్రకాశవంతమైన లైట్లతో యూఎఫ్‌వోలు కనిపించాయంటూ జరిగిన ప్రచారం వైరల్ అయ్యింది. వైమానిక దళ అనుభవజ్ఞుడు, లైసెన్స్ టూర్ గైడ్ డెన్నిస్ డిగ్గిన్స్.. స్టాచ్యూ ఆఫ్ ప్రీడమ్ వద్ద ఫొటోలు, వీడియోలు తీశారు. అయితే అక్కడ నాలుగు యూఎఫ్‌వోలు ఎగురుతున్నట్లు ఆయన గుర్తించారు. ఆ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేయగా గ్రహాంతవాసులు ఉన్నారనే వార్త నిజమే అంటూ జోరుగా ప్రచారం జరిగింది.
గుర్తించబడని వ్యోమనౌక, మానవేతర మేధస్సుతో కూడిన రహస్య ప్రభుత్వ కార్యక్రమాలపై కాంగ్రెస్ విచారణ జరిపిన కొద్ది వారాలకే యూఎఫ్‌వోల ప్రచారం ఊహాగానాలను మరింత తీవ్రతరం చేసింది. అయితే గ్రహాంతరవాసుల ప్రచారాన్ని UFOల ప్రముఖ పరిశోధకుడు జాన్ గ్రీన్‌వాల్డ్ జూనియర్ ఖండించారు. వీడియోలు, ఫొటొల్లో ఉన్న వాటిని సాధారణ ఆప్టికల్ భ్రమగా ఆయన కొట్టిపారేశారు. యూఎస్ క్యాపిటల్‌లోని లైట్లను ప్రజలు UFOలని దశాబ్దాలుగా తప్పుగా భావిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ మేరకు వాటికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. జాన్ గ్రీన్ వాల్డ్ వివరణ ఇచ్చినప్పటికీ UFOలపై ప్రజల్లో ఆసక్తి రేకెత్తింది. నిజంగా గ్రహంతవాసులు ఉండే ఉంటారని చర్చించుకుంటున్నారు.