Share News

Top Model: 20 ఏళ్లకే ప్రముఖ మోడల్ ఆత్మహత్య..అసలేం జరిగింది?

ABN , Publish Date - Jan 06 , 2024 | 04:41 PM

ప్రముఖ మోడల్ 20 ఏళ్ల వయస్సులోనే ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె మృతికి గల కారణాల గురించి ఇటివల కోర్టు కీలక విషయాలను తెలిపింది. ఓ ప్రముఖ వ్యక్తితో ఐలాండ్‌కు వెళ్లి వచ్చిన రెండేళ్ల తర్వాత ఆమె మరణించడం చర్చనీయాంశంగా మారింది.

Top Model: 20 ఏళ్లకే ప్రముఖ మోడల్ ఆత్మహత్య..అసలేం జరిగింది?

అగ్రరాజ్యం అమెరికాలోని సెక్స్ ట్రాఫికింగ్ కేసు గురించి ఇటివల సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో ఇదే కేసులో కీలక వ్యక్తి, ప్రముఖ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్ ప్రైవేట్ జెట్‌లో అతనితోపాటు ఓ ప్రముఖ మోడల్ కూడా ద్వీపానికి వెళ్లినట్లు ఇటీవల విడుదల చేసిన కోర్టు పత్రాల్లో తెలిపింది. అయితే అతనితో వెళ్లిన రష్యాకు చెందిన మోడల్ రుస్లానా కోర్షునోవా(ruslana korshunova) 2008లో తన వాల్ స్ట్రీట్ అపార్ట్‌మెంట్‌లోని 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు రెండేళ్ల ముందు ఆమె అమెరికా వర్జిన్ ఐలాండ్స్‌లోని ఎప్‌స్టీన్ ప్రైవేట్ ఐలాండ్‌కు వెళ్లింది. అంతేకాదు జెఫ్రీ ఎప్‌స్టీన్ అనేక మంది తక్కువ వయస్సు బాలికలకు డబ్బు ఆశ చూపించి వారిని ఐలాండ్‌కు తీసుకొచ్చి వారిపై లైంగిక దాడి చేసేవాడని వెలుగులోకి వచ్చింది.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Ayodhya Divine Walk: తండ్రి కోరిక.. బంగారుపూత పాదుకలతో అయోధ్యకు హైదరాబాదీ పాదయాత్ర

ఇక రుస్లానా కోర్షునోవా(ruslana korshunova) ఆ సమయంలో ప్రముఖ మోడల్‌(top model)గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతోపాటు పలు బ్రాండ్‌ల ఉత్పత్తులకు యాడ్స్ కూడా చేసి మంచి ఫేమ్ దక్కించుకుంది. ఆ క్రమంలోనే ఆమె అతనితో వెళ్లిన సమయంలో రుస్లానా కోర్షునోవా వయస్సు 18 ఏళ్లే కావడం విశేషం. జెఫ్రీ ఎప్‌స్టీన్ అతని అంగరక్షకుడు ఇగోర్ జినోవివ్, వ్యక్తిగత చెఫ్ లాన్స్ కాలోవే సహాయకుడు సారా కెల్లెన్‌తో సహా ముగ్గురు సిబ్బందితో కలిసి ప్రయాణించారు. అయితే లిటిల్ సెయింట్ జేమ్స్‌లోని ఓ ద్వీపానికి వారు వెళ్లిన తర్వాత ఏం జరిగిందనే విషయం మాత్రం తెలియలేదు.

కానీ ఆమె మరణించడానికి ముందు చాలా బరువు తగ్గిందని ఆమె మాజీ ప్రియుడు పేర్కొన్నాడు. మరోవైపు ఆమె జీవితం(life)లో అనేక సమస్యలు ఉన్నాయని మరికొన్ని కథనాలు వచ్చాయి. అయితే ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులైతే లేవని రుస్లానా తల్లి 2008లో అన్నారు. కానీ 20 ఏళ్లకే ఆమె మరణించడం అనేక మంది అభిమానులను కలిచివేసింది. ఈ కేసులో ఇంకా అనేక మంది నటీనటులు చిక్కుకున్నారు. వారిలో లియోనార్డో డికాప్రియో, కేట్ బ్లాంచెట్, మైఖేల్ జాక్సన్, నవోమి కాంప్‌బెల్, బ్రూస్ విల్లిస్, కెమెరాన్ డియాజ్, కెవిన్ స్పేసీ, జార్జ్ లూకాస్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. అయితే వీరి గురించి ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - Jan 06 , 2024 | 04:41 PM