Donald Trump: ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జిన్‌పింగ్!
ABN , Publish Date - Dec 13 , 2024 | 06:08 AM
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న బాధ్యతలు స్వీకరించనున్నారు.

వాషింగ్టన్, డిసెంబరు 12: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ కార్యక్రమానికి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు ఆహ్వానం పంపినట్లు అంతర్జాతీయ మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. ఈ ఆహ్వానంపై వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం స్పందించలేదు. ఇక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే దాదాపు 25 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను జారీ చేసేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నారు.