Share News

Ukraine: రష్యాలోని బహుళ అంతస్తుల భవనాలపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి

ABN , Publish Date - Dec 21 , 2024 | 02:35 PM

సుమారు 8 డ్రోన్‌లు కజన్‌లోని ఆకాశహర్మ్యాలను ఢీకొట్టినట్టు చెబుతున్నారు. ఎమర్జెన్సీ సర్వీసులు వెంటనే రంగప్రవేశం చేసినట్టు రష్యా న్యూస్ ఎజెన్సీ 'టాస్' తెలిపింది.

Ukraine: రష్యాలోని బహుళ అంతస్తుల భవనాలపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి

కీవ్: రష్యా (Russia)పై ఉక్రెయిన్ (Ukraine) ప్రతిదాడులకు దిగింది. శనివారం ఉదయం పేలుడు పదార్ధాలతో కూడిన యూఏవీ‌(UAV)లతో దాడులకు దిగింది. పలు డ్రోన్‌లు రష్యా నగరమైన కజన్‌లోని బహుళ అంతస్తుల భవనాలను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. దాడులు, అనంతర పరిస్థితిపై పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. ఉక్రెయిన్ దాడుల అనంతరం కజన్ విమానాశ్రయంలో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్టు రష్యా ఏవియోషన్ వాచ్‌డాగ్ రోసావియాత్సియా తెలిపింది.


కాగా, సుమారు 8 డ్రోన్‌లు కజన్‌లోని ఆకాశహర్మ్యాలను ఢీకొట్టినట్టు చెబుతున్నారు. ఎమర్జెన్సీ సర్వీసులు వెంటనే రంగప్రవేశం చేసినట్టు రష్యా న్యూస్ ఎజెన్సీ 'టాస్' తెలిపింది. దాడుల అనతంరం భవంతుల్లోని వారిని వెంటనే ఖాళీ చేయించారని, ఇంతవరకూ ఎవరూ మరణించినట్టు సమాచారం లేదని పేర్కొంది. శనివారం ఉదంయ రష్యా రక్షణ శాఖ మంత్రి టెలిగ్రామ్ ఛానెల్‌లో మాట్లాడుతూ, ఉక్రెయిన్ డ్రోన్ ఒకటి రష్యన్ రిపబ్లిక్ టాటర్ స్టాన్ మీదుగు వెళ్తుండగా ఎయిర్ డిఫెన్స్ బలగాలు కూల్చివేసినట్టు తెలిపారు.


రష్యా ప్రయోజనాలను గుర్తించి నాటోలో చేరేలనే ప్రయత్నాన్ని ఉక్రెయిన్ విరమించుకోవాలని పుతిన్ ఇంతకుముందు డిమాండ్ చేశారు. అయితే కివ్ ఆ డిమాండ్‌ను తోసిపుచ్చింది. 2022 ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా రాజధాని మాస్కోతో పాటు పలు ప్రాంతాలపై ఉక్రెయిన్ పలుమార్లు జరిపిన డ్రోన్ దాడులను రష్యా మధ్యలోనే అడ్డుకుంది. అయినప్పటికీ కొన్ని డ్రోన్లు లక్ష్యాన్ని ఢీకొట్టాయి. కాగా, యుద్ధ విరమణపై తనకు, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్‌కు మధ్య చర్చలు చోటుచేసుకుంటే ఉక్రెయిన్ విషయంలో రాజీ పడేందుకు సిద్ధమేనని పుతిన్ గత గురువారంనాడు పేర్కొన్నారు. ఉక్రెయిన్ అధికారులతో చర్చలు ప్రారంభించేందుకు తనకు ఎలాంటి షరతులు లేవన్నారు.


ఇవి కూాడ చదవండి..

Donald Trump: 18 వేల మంది భారతీయుల మెడపై.. ట్రంప్‌ సర్కారు బహిష్కరణ కత్తి!

Sunitha Williams: సునీతా విలియమ్స్ తిరిగొచ్చేనా.. మళ్లీ తేదీ మార్చిన నాసా

Read Latest and International News

Updated Date - Dec 21 , 2024 | 02:43 PM