Share News

Gaza: గాజాకు మానవతా సహాయం.. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటన..

ABN , Publish Date - Mar 02 , 2024 | 08:52 AM

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా గాజాలో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారుతున్నాయి. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ( Joe Biden ) కీలక నిర్ణయం తీసుకున్నారు.

Gaza: గాజాకు మానవతా సహాయం.. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటన..

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా గాజాలో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారుతున్నాయి. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ( Joe Biden ) కీలక నిర్ణయం తీసుకున్నారు. గాజాకు మానవతా సహాయాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. సహాయంతో భాగంగా ముందు ఆహార పదార్థాలు అందించే అవకాశం ఉందని సమాచారం. కరవు, ఆహారం కొరత వంటి పరిస్థితులలో ఉత్తర గాజాలో సహాయం చేస్తున్న సమయంలో అలజడి రేగింది. తోపులాటలో కనీసం 115 మంది పాలస్తీనియన్లు మరణించారు. మరో 750 మందికి గాయాలయ్యాయి. ఈ పరిస్థితుల నడుమ తమకు సహాయం చేసేందుకు బైడెన్ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్ దళాలు కాల్పులు జరిపాయని, ఆ సమయంలో అక్కడున్న వారు భయంతో పరుగులు తీయడం వల్ల తొక్కిసలాట జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

గాజాలో నెలకొన్న భయంకర పరిస్థితులను పరిష్కరించేందుకు ఎయిర్‌డ్రాప్‌లు సహాయపడతాయని అమెరికా విశ్వసిస్తోంది. అవి ట్రక్కులకు ప్రత్యామ్నాయం కాదు. ఎయిర్ డ్రాప్ ల కంటే ట్రక్కుల ద్వారా సహాయాన్ని వేగవంతం చేయవచ్చు. అమెరికా, మిత్రదేశాలు హమాస్-ఇజ్రాయెల్ మధ్య కొత్త తాత్కాలిక కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నించాయి. గాజాలోని మిలిటెంట్ గ్రూప్ చేతిలో ఉన్న బందీలను విడుదల చేయడం, ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న లస్తీనా ఖైదీలను విడిపించడం వంటి అంశాలపై జరిగిన ఒప్పందం ఆరు వారాల వరకు అమలులో ఉంటాయి.


యుద్ధంలో విరామం ఇచ్చినప్పటికీ కాల్పుల విరమణ జరిగితే ప్రపంచ దేశాలన్నీ చర్యలు తీసుకునేందుకు సమాయత్తమయ్యాయి. కాబట్టి ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా ఎక్కువ మొత్తంలో సహాయం చేయాలని అమెరికా భావిస్తోంది. సముద్రమార్గం ద్వారా గాజా వాసులకు సహాయం చేసేందుకు మెరిటైమ్ కారిడార్ ఏర్పాటుపై అమెరికా మిత్రదేశాలతో కలిసి పనిచేస్తోందని బైడెన్ వివరించారు.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 02 , 2024 | 08:52 AM