Share News

Wales Princess: క్యాన్సర్‌తో పోరాడుతున్న యువరాణి కేట్ మిడిల్టన్.. పీఎం స్పందన

ABN , Publish Date - Mar 23 , 2024 | 08:03 AM

బ్రిటన్‌లోని వేల్స్ యువరాణి(wales princess) కేట్ మిడిల్టన్(42)(Kate Middleton) సంచలన ప్రకటన చేశారు. ఆమె క్యాన్సర్‌(cancer)తో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసి వెల్లడించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Wales Princess: క్యాన్సర్‌తో పోరాడుతున్న యువరాణి కేట్ మిడిల్టన్.. పీఎం స్పందన

బ్రిటన్‌(britain)లోని వేల్స్ యువరాణి(wales princess) కేట్ మిడిల్టన్(42)(Kate Middleton) సంచలన ప్రకటన చేశారు. ఆమె క్యాన్సర్‌(cancer)తో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా(social media)లో ఓ వీడియో పోస్ట్ చేసి వెల్లడించారు. వీడియోలో ఈ విధంగా పేర్కొన్నారు. 'నేను బాగానే ఉన్నాను, రోజురోజుకు బలపడుతున్నాను'. ఇది మా కుటుంబం మొత్తానికి రెండు నెలలు చాలా కష్టంగా ఉంటుంది. కానీ నా దగ్గర అద్భుతమైన వైద్య బృందం ఉంది, వారు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. దానికి నేను చాలా కృతజ్ఞుడను.

కడుపులో సర్జరీ చేయించుకున్నప్పుడు అప్పుడు క్యాన్సర్‌ని గుర్తించలేదు. ఆపరేషన్ తర్వాత నిర్వహించిన వైద్య పరీక్షల్లో క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. కాబట్టి నేను కీమోథెరపీ చేయించుకోవాలని నా వైద్య బృందం సలహా ఇచ్చింది. నేను ఇప్పుడు ఆ చికిత్స ప్రారంభ దశలో ఉన్నాను. నేను శస్త్రచికిత్స నుంచి కోలుకునే సమయంలో మీ మద్దతు, అద్భుతమైన శుభాకాంక్షలకు వ్యక్తిగతంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను.' ఈ క్రమంలో తన చికిత్స పూర్తయ్యే వరకు మా గోప్యతకు సహకరించాలని కోరారు.


ఈ ఏడాది జనవరిలో శస్త్రచికిత్స చేయించుకున్నప్పటి నుంచి ఆమె బహిరంగంగా కనిపించకపోవడంతో ఆమె ఆరోగ్యం(health)పై ఊహాగానాలు వచ్చాయి. జనవరిలో కేట్ మిడిల్టన్‌కు లండన్‌లో పెద్ద కడుపు శస్త్రచికిత్స జరిగింది. కానీ మొదట్లో క్యాన్సర్ లేదని భావించారు. శస్త్రచికిత్స అనంతర వైద్య పరీక్షల్లో క్యాన్సర్‌ను గుర్తించారు.

అయితే ఈ అంశంపై బ్రిటిష్ ప్రధాని రిషి సునక్(rishi sunak) యువరాణి వ్యాధి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో దేశం మొత్తం మీ వెంట ఉందని, త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. దేశప్రజలందరూ మిమ్మల్ని ప్రేమిస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతోపాటు ఇది తెలిసిన అనేక మంది వేల్స్ యువరాణి త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్లు(comments) చేస్తున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Attack Video: కాన్సర్ట్ హాల్‌పై కాల్పులు.. 60 మంది మృతి, 115 మందికి గాయాలు

Updated Date - Mar 23 , 2024 | 12:33 PM