Share News

Breaking News : నేటి తాజావార్తలు..

ABN , First Publish Date - Nov 11 , 2024 | 08:00 AM

Andhra Pradesh Assembly Budget Session Live Updates: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Breaking News : నేటి తాజావార్తలు..
Breaking News

Live News & Update

  • 2024-11-11T12:20:27+05:30

    ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కేటాయింపులివే..

    • రూ.43,402 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్‌

    • రాయితీ విత్తనాలకు రూ.240 కోట్లు

    • భూసార పరీక్షలకు రూ.38.88 కోట్లు

    • విత్తనాల పంపిణీకి రూ.240 కోట్లు

    • ఎరువుల సరఫరాకు రూ.40 కోట్లు

    • పొలం పిలుస్తోంది రూ.11.31 కోట్లు

    • PACSల ద్వారా ఎరువుల పంపిణీ

    • డిజిటల్‌ వ్యవసాయం - రూ.44.77 కోట్లు

    • వ్యవసాయ యాంత్రీకరణ - 187.68 కోట్లు

    • వడ్డీ లేని రుణాలు - రూ.628 కోట్లు

    • అన్నదాత సుఖీభవ - రూ.4,500 కోట్లు

    • రైతు సేవా కేంద్రాలు - రూ.26.92 కోట్లు

    • ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్స్‌ - రూ.44.03 కోట్లు

    • పంటల బీమా - రూ.1,023 కోట్లు

    • వ్యవసాయ శాఖ - రూ.8,564.37 కోట్లు

    • ఉద్యానశాఖ - రూ.3,469.47 కోట్లు

    • పట్టు పరిశ్రమ - రూ.108.44 కోట్లు

    • వ్యవసాయ మార్కెటింగ్‌ - రూ.314.8 కోట్లు

    • సహకార శాఖ - రూ.308.26 కోట్లు

    • ప్రకృతి వ్యవసాయం - రూ.422.96 కోట్లు

    • ఎన్జీ రంగా యూనివర్సిటీ - రూ.507.3 కోట్లు

    • ఉద్యాన యూనివర్సిటీ - రూ.102.22 కోట్లు

    • వ్యవసాయ పశు విశ్వవిద్యాలయం - రూ.171.72 కోట్లు

    • ఫిషరీస్‌ యూనివర్సిటీ - రూ.38 కోట్లు

    • పశు సంవర్థక శాఖ - రూ.1,095.71 కోట్లు

    • మత్స్యరంగం అభివృద్ధి - రూ.521.34 కోట్లు

    • ఉచిత వ్యవసాయ విద్యుత్‌ - రూ.7,241.3 కోట్లు

    • ఉపాధి హామీ అనుసంధానం - రూ.5,150 కోట్లు

    • ఎన్టీఆర్‌ జలసిరి - రూ.50 కోట్లు

    • నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ - రూ.14,637.03 కోట్లు

  • 2024-11-11T12:15:30+05:30

    వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్న

    • అమరావతి: రూ.43,402 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్న

    • ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్న కీలక ప్రసంగం చేశారు.

    • ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం వెన్నెముక.

    • రైతు అభ్యున్నతే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.

    • కౌలు రైతులకు గుర్తింపు కార్డులు పంపిణీ.

    • వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తాం.

    • రైతులకు పనిముట్లు, రాయితీపై విత్తన సరఫరా.

    • భూసార పరీక్షలు నిర్వహిస్తున్నాం.

    • గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం.. వ్యవసాయ రంగానికి నిర్ధిష్ట ప్రణాళిక అవసరం.

    • 2047 టార్గెట్‌తో మా ప్రభుత్వం ముందుకెళ్తోంది.

  • 2024-11-11T11:19:11+05:30

    బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు..

    • అమరావతి: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

    • ఏపీ అసెంబ్లీలో పూర్తిస్ధాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి పయ్యవుల కేశవ్.

    • రూ. 2.94. లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్.

    • రూ. 43,402.33 కోట్లు వ్యవసాయ బడ్జెట్.

    • రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34 లక్షల కోట్లు.

    • మూలధన వ్యయం అంచనా రూ.32,712 కోట్లు.

    • రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు.

    • ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు.

    • జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు అంచనా 4.19 శాతం

    • జీఎస్‌డీపీలో ద్రవ్య లోటు అంచనా 2.12 శాతం

    • గతంలో ఆర్ధిక మంత్రిగా చంద్రబాబు నాయుడు కోట్ చేసిన పాయింట్లను సభలో ప్రస్తావించిన మంత్రి పయ్యవుల కేశవ్.

    • రేపటి రోజున దేశం చేసే ఆలోచన ఏపీ నేడే చేస్తుంది అని చంద్రబాబు నాయుడు వల్లే వచ్చింది.

    • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను శాశ్వత రాజధాని లేకుండా అన్యాయంగా విభజించారు. ప్రజలపై విభజనను రుద్దారు.

    • 2019-24 మధ్య రాష్ట్రంలో చీకటి రోజులు మొదలయ్యాయి.

    • అన్ని రకాలుగా నాటి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్దిని దెబ్బతీసింది.

    • సంపదకు మూలం ఆర్ధక కార్యకలాపాలే.. అది లేకపోతే వనరులు సమీకరణ కష్టం అవుతుందని కౌటిల్యుని మాటలను ప్రస్తావించిన మంత్రి కేశవ్.

  • 2024-11-11T10:21:10+05:30

    సుప్రీంకోర్టు సీజేగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం..

    • ఢిల్లీ: సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకం.

    • సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా.

    • జస్టిస్ సంజీవ్ ఖన్నాతో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

    • సంజీవ్ ఖన్నా ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్కొన్న ప్రధాని మోదీ, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, మాజీ సీజేఐ NV రమణ తదితరులు.

    • వచ్చే ఏడాది మే 13 వరకు సీజేఐగా కొనసాగనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా.

    • ఎన్నికల బాండ్లు, ఈవీఎంలు, ఆర్టికల్ 370 తదితర కేసుల్లో కీలక తీర్పులిచ్చిన జస్టిస్ సంజీవ్ ఖన్నా.

  • 2024-11-11T10:14:46+05:30

    ఏపీ బడ్జెట్ 2.90 లక్షల కోట్లు.. కేబినెట్ ఆమోదం..

    • అమరావతి: అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో కేబినెట్ భేటీ ముగిసింది.

    • రాష్ట్ర బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

    • రాష్ట్ర బడ్జెట్‌ను రూ. 2.90 లక్షల కోట్లు ప్రతిపాదించగా.. కేబినెట్ ఆమోదించింది.

    • నీటి పారుదల, సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్‌ను రూపొందించిన ఆర్థిక శాఖ.

  • 2024-11-11T10:11:22+05:30

    సీఎం ఛాంబర్‌లో కేబినేట్ కీలక భేటీ..

    • అమరావతి: అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో మంత్రివర్గ సమావేశం.

    • మరి కొద్దిసేపట్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కి ఆమోదం తలుపనున్న కేబినెట్.

    CM-Chandrababu.jpg

  • 2024-11-11T08:00:36+05:30

    Hyderabad: హైదరాబాద్ నగర వాసులకు ముఖ్యగమనిక. సోమవారం నాడు నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగనుంది. వాటర్ పైప్‌లైన్ మరమ్మతుల కారణంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు వాటర్ సరఫరాను నిలిపివేస్తున్నారు. అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, మూసాపేట, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, ఆర్‌సీపురం, లింగంపల్లి, మియాపూర్, మదీనాగూడ, అమీన్‌పూర్, జగద్‌గిరి గుట్ట ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగనుంది. ఈ ప్రాంతాల్లోని ప్రజలు నీటిని నిలువ చేసుకోవాలని, పరిస్థితులకు అనుగుణంగా వినియోగించాలని అధికారులు సూచించారు.