-
-
Home » Mukhyaamshalu » Breaking News July 11 Today Latest Telugu News Live Updates, Siva
-
Breaking News: నేటి తాజా వార్తలు..
ABN , First Publish Date - Jul 11 , 2024 | 10:28 AM
Telugu Latest News Live Updates: ప్రపంచ నలుమూల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. మినిట్ టు మినిట్ తాజా వార్తలను ఇక సులభంగా తెలుసుకోవచ్చు. మీకోసమేు ప్రత్యేకంగా లైవ్ అప్‌డేట్స్ ప్లాట్‌ఫామ్.. సమస్త సమాచారం ఇక్కడే చూసేయండి.
Live News & Update
-
2024-07-11T21:40:34+05:30
రేపే తీర్పు..!!
ఢిల్లీ: లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్, కస్టడీ విధించడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సీఎం కేజ్రీవాల్.
పిటిషన్ పై రేపు తీర్పు వెల్లడించనున్న సుప్రీంకోర్టు.
మే 17 వ తేదీన తీర్పును రిజర్వ్ చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం.
-
2024-07-11T21:36:30+05:30
ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిది మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
ఏపీ రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అంజనా సిన్హా బదిలీ
ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగా అంజనా సిన్హాకు పూర్తి అదనపు బాధ్యతలు
ఏపీ రాష్ట్ర విపత్తుల నివారణ, ఫైర్ సర్వీసెస్‌లో మాదిరెడ్డి ప్రతాప్ నియామకం
సీ హెచ్ శ్రీకాంత్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, అక్టోపస్ నుంచి బదిలీ
డీజీపీ ఆఫీసులో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ లా అండ్ ఆర్డర్‌గా నియామకం
-
2024-07-11T21:16:50+05:30
సంపద సృష్టించాలి: సీఎం చంద్రబాబు
విశాఖపట్టణం: ఎయిర్ పోర్ట్ వీఐపీ లాంజ్‌లో అధికారులతో ముగిసిన సీఎం చంద్రబాబు సమీక్ష
సమీక్షకు ముందు ఎమ్మెల్యేలు, మంత్రులతో భేటీ
విశాఖ జిల్లాలో పలు అభివృద్ధి అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు: మంత్రి అనిత
విశాఖ క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చాలని సీఎం చంద్రబాబు సూచించారు
ఇసుక సరఫరా సక్రమంగా జరగాలి, సంపద సృష్టించాలి, ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు.
ఉత్తరాంధ్ర సస్యశ్యామలం చేయాలన్నదే మా ధ్యేయం
గిరిజన యూనివర్సిటీ కొత్తవలసలో ప్రారంభిస్తాం.
ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి పాటు పడతామని కేంద్రమంత్రి కుమారస్వామి చెప్పారు: ఎంపీ టీజీ భరత్
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోంది.
-
2024-07-11T20:54:51+05:30
వెనక్కి తగ్గని ప్రభుత్వం
హైదరాబాద్: డీఎస్సీ పరీక్ష పై వెనక్కి తగ్గని ప్రభుత్వం
వెబ్ సైట్‌లో హాల్ టికెట్లు, 18 నుంచి డీఎస్సీ పరీక్ష
-
2024-07-11T20:41:16+05:30
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
అమరావతి: రూ.4,976 కోట్ల నిధులతో 7,213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రణాళిక
250 మించి జనాభా కలిగిన ప్రతి గ్రామానికి రహదారి అనుసంధానం
మ్యాచింగ్ గ్రాంట్ 10 శాతానికి తగ్గించేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతాం
ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు అధికారులు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంతో సమీక్ష
-
2024-07-11T20:36:19+05:30
ఏపీ సీఎం చంద్రబాబుపై మెడ్ టెక్ సీఈఓ జితేందర్ శర్మ
విశాఖపట్టణం: దేశంలో విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు
బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ మాదిరిగా మీరు ఉన్నారు
నితిన్ గడ్కరీ మిమ్మల్ని అభినందించారు. మీ విజన్‌ని కొనియాడారు
-
2024-07-11T20:09:16+05:30
స్వర్ణయుగంలో అభివృద్ధి తథ్యం: సీఎం చంద్రబాబు
విశాఖపట్టణం: ట్రిపుల్ ఐటీతో మంచి ఫలితాలు
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యం
275 ఎకరాలు విస్తీర్ణంలో అభివృద్ధి
స్టీల్ సిటీ, మెడికల్ సిటీ, భోగాపురం విమానాశ్రయం
నా హార్ట్ టచింగ్ సిటీ విశాఖ: ఏపీ సీఎం చంద్రబాబు
హుద్ హుద్ సమయంలో ఇక్కడే వారం రోజులు ఉన్నాం
మాకు ఇక్కడి ప్రజలు మంచి మెజారిటీ ఇచ్చారు
ఇక్కడ మూడు పార్టీల నాయకులు ఉన్నారు. స్వర్ణయుగంలో అభివృద్ధి తథ్యం
-
2024-07-11T19:56:43+05:30
ఇంచార్జీ వీసీగా నరసింహం
అమరావతి: ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇంఛార్జీ వీసీగా డీఎంఈ డాక్టర్ నరసింహం
రెగ్యులర్ వీసీ నియమించే వరకు ఇంఛార్జీ వీసీగా నరసింహం
-
2024-07-11T19:53:37+05:30
ప్రణీత్ హనుమంతుకు రిమాండ్
హైదరాబాద్: ప్రణీత్ హనుమంతుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు. నాంపల్లి కోర్టు నుంచి చంచల్ గూడ జైలుకు తరలింపు
-
2024-07-11T19:50:21+05:30
అనర్హత పిటిషన్‌పై విచారణ
హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టు విచారణ.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావుపై అనర్హత వేటు వేయాలని పిటిషన్.
వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా.
-
2024-07-11T19:42:31+05:30
స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్
హైదరాబాద్: మందుబాబుల మత్తు వదలిస్తోన్న పోలీసులు
గత పదిరోజుల నుంచి హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్
మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడిన 1,614 మందిపై కేసు, 992 మందిపై ఛార్జీ షీట్.
55 మందికి ఒక రోజు నుంచి 15 రోజుల జైలు శిక్ష. 8 మంది డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్.
-
2024-07-11T19:36:48+05:30
ఇంటర్ స్టేట్ డ్రగ్ పెడ్లర్ అరెస్ట్
హైదరాబాద్: సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ వద్ద హాష్ ఆయిల్ విక్రయం
825 గ్రాముల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్న టాస్క్‌ఫోర్క్ పోలీసులు
అదుపులోకి నిజామాబాద్‌కు చెందిన నవీన్ గౌడ్
నవీన్‌కు జైలులో పరిచయం అయిన ఆంధ్రప్రదేశ్‌లో గల అరకు చెందిన వ్యక్తితో పరిచయం.
ఎండు గాంజా, హాష్ ఆయిల్ తెప్పించిన నిందితుడు, అశోక్ నగర్, ఆర్టీసీ ఎక్స్ రోడ్డు కాలేజీ విద్యార్థులకు విక్రయం
-
2024-07-11T19:29:59+05:30
క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం.
జీవో 317 పై క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం .
రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం
సమావేశంలో పాల్గొన్న క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రఘునందన్ రావు, రిటైర్డ్ ఐఏఎస్ శివశంకర్, జీఏడి అధికారులు.
స్పౌజ్, మెడికల్, మ్యూచువల్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్య/భర్త చేసుకున్న దరఖాస్తులపై సానుకూల నిర్ణయం
దరఖాస్తులు సంబంధిత శాఖాధిపతులకు పంపించాల్సిందిగా జీఏడీ అధికారులకు ఆదేశం
-
2024-07-11T19:21:27+05:30
సీఎం చంద్రబాబు సమీక్ష
విశాఖపట్టణం: విశాఖ ఎయిర్ పోర్ట్ వీఐపీ లాంజ్‌లో అధికారులతో సమీక్ష
విశాఖపట్టణం, జిల్లాలో ప్రాజెక్టుల పరిస్థితులపై డిస్కషన్
-
2024-07-11T19:18:56+05:30
చర్యలు తీసుకోండి
గుంటూరు జిల్లా: వైసీపీ నేత నాగార్జున యాదవ్ పై ఎస్పీకి ఫిర్యాదు
సీఎం చంద్రబాబు పై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన నాగార్జున యాదవ్
నాగార్జునపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి తెలుగు విద్యార్థి నేత మన్నవ వంశీ కృష్ణ వినతి
-
2024-07-11T19:15:11+05:30
ఎంక్వైరీ స్పీడప్
విజయవాడ: పీసీబీ ఫైల్స్ దహనం కేసులో పోలీసుల దూకుడు.
కేసులో కీలకంగా వ్యవహరించిన పీసీబీ ఓఎస్డీ రామారావు ఇంట్లో సోదాలు.
పీసీబీ చైర్మన్ సమీర్ శర్మ ఓఎస్డీగా పనిచేసిన రామరావు.
ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు
నిన్న పీసీబీ కార్యాలయం లో సోదాలు చేసి, పలు పత్రాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
-
2024-07-11T19:10:19+05:30
తిరుమల క్యూలైన్‌లో ఫ్రాంక్ వీడియో
తిరుమల: శ్రీవారి దర్శనానికి వెళ్లే క్యూ లైన్‌లో ఫ్రాంక్ వీడియోలు.
స్నేహితులతో కలిసి ఫ్రాంక్ వీడియో చేసిన తమిళనాడుకు చెందిన టీటీఎఫ్ వాసన్
క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులకు తాళాలు తీస్తున్నట్టు ఫ్రాంక్, వీడియోలు ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్
నారాయణగిరి ఉద్యానవనం దర్శన క్యూలైన్ వద్ద ఘటన
దర్శన క్యూలైన్లలో మొబైల్ ఫోన్ తీసుకెళ్లడం నిషేధం, భద్రతా సిబ్బంది కళ్ళు గప్పి మొబైల్ ఫోన్ తీసుకెళ్లిన ఆకతాయి.
భక్తులతో ఫ్రాంక్ వీడియో చిత్రీకరణపై తమిళనాడులో పెద్ద ఎత్తున విమర్శలు.
-
2024-07-11T19:00:50+05:30
పురాతన ఆలయాలను కాపాడుకోవాలి: చిన జీయర్ స్వామి
వరంగల్: ప్రాచీన దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే: చినజీయర్ స్వామి
ప్రాధాన్యత కలిగిన ప్రాచీన దేవాలయాలు దేశంలో చాలా ఉన్నాయి
గత ప్రభుత్వంలో ఎర్రబెల్లి దయాకర్ ఆలయాల అభివృద్ధి కోసం కృషి చేశారు
ప్రస్తుతం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దేవాలయ ప్రాముఖ్యత కాపాడేందుకు పాటు పడతున్నారు.
ప్రపంచ దేశాలు ప్రాచీన చరిత్ర కోసం ప్రచారం చేస్తాయి. మనకు ఆ అవసరం లేదు.
-
2024-07-11T18:55:58+05:30
రెయిన్ అలర్ట్
హైదరాబాద్‌లో వర్షం
సిటీలో పలు చోట్ల వాన జల్లులు
నాంపల్లి, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం, సికింద్రాబాద్, బేగంపేట్, ప్యాట్ని, రసూల్‌పుర, సోమాజిగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్ పరిసర ప్రాంతాల్లో పడిన వర్షం
రోడ్లపైకి చేరిన వర్షపు నీరు, ఇబ్బంది పడ్డ వాహన యజమానులు
-
2024-07-11T18:50:46+05:30
కేటీఆర్ బహిరంగ లేఖకు కేంద్రమంత్రి బండి సంజయ్ కౌంటర్
కరీంనగర్: కేటీఆర్ @ అజయ్ రావు.. నేతన్నలు ఇన్నాళ్లకు గుర్తొచ్చారా?
పదేళ్లు రాష్ట్రాన్ని పాలించింది మీరే కదా?... సిరిసిల్లకు 15 ఏళ్లుగా మీరే ప్రాతినిధ్యం వహించారు కదా
మీ హయాంలో నేతన్నల ఆకలి చావులు కొనసాగాయి.. మీరెందుకు వారిని సంక్షోభం నుంచి గట్టెక్కించలేకపోయారు?
‘బతుకమ్మ’ బకాయిలు చెల్లించకుండా పవర్ లూమ్ సంస్థలు మూతపడేలా చేసింది మీరే కదా?
ప్రధాని మోదీ తెలంగాణకు మెగా టెక్స్ టైల్ పార్క్ ప్రకటించిన సమయంలో సిరిసిల్ల గుర్తుకు రాలేదా?
సిరిసిల్ల నేతన్నలను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తా, కరీంనగర్ ఎంపీగా అది నా బాధ్యత కూడా: కేంద్రమంత్రి బండి సంజయ్
-
2024-07-11T18:44:49+05:30
తెర మీదకు చమన్ ఫ్యామిలీ
అమరావతి: అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్‌గా చమన్ కుమారుడి పేరు పరిశీలన
పరిటాల రవి ముఖ్య అనుచరుడు చమన్, చమన్ మృతితో రాజకీయాలకు దూరంగా కుటుంబం
పాదయాత్ర సమయంలో చమన్ కుమారుడు ఉమర్‌తో మాట్లాడిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
చమన్ ఆశయ సాధనలో ఉమర్ చేస్తున్న సేవలు తెలుసుకున్న నారా లోకేశ్
రాజకీయాల్లోకి రావాలని పాదయాత్ర సమయంలో కోరిన లోకేశ్
గత అసెంబ్లీ ఎన్నికల్లో 22 నియోజకవర్గాల్లో పర్యటించిన ఉమర్
ఉమర్‌కి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్న చమన్ అభిమానులు
-
2024-07-11T18:37:31+05:30
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
హైదరాబాద్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలకు స్పందించిన జీహెచ్ఎంసీ, ఫుడ్ సేప్టీ అధికారులు
ఇందిరా పార్క్ వద్ద గల ఎమ్రాల్డ్ స్వీట్ షాపులో ఎలుకలు, పందికొక్కులు
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరస కథనాలు
స్వీట్ హౌస్ నిర్వాహకులపై కేసు నమోదు
షాపు లైసెన్స్ రద్దు చేసిన జీహెచ్ఎంసీ, ఫుడ్ సేప్టీ అధికారులు
-
2024-07-11T18:31:07+05:30
అబ్దుల్లా కుటుంబ సభ్యులకు మంత్రి భరోసా
అమరావతి: సచివాలయంలో మంత్రి ఎన్ఎండీ ఫారుక్‌ను కలిసిన అబ్దుల్లా కుటుంబ సభ్యులు
అనంతపురం పోలీసుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్లా
దోషులను శిక్ష పడేలా చూస్తామని అబ్దుల్లా భార్య నసీమా, కుమారుడు అయాన్, కుతూరు సమీనాకు మంత్రి హామీ
ఉద్యోగం, పిల్లల చదువుకు సాయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన అబ్దుల్లా కుటుంబం
-
2024-07-11T18:24:22+05:30
సీఎం రేవంత్ సమీక్ష
హైదరాబాద్: సచివాలయంలో రెవెన్యూ జనరేషన్ విభాగాలతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.
హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.
ఫైనాన్స్, వాణిజ్య పన్నులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, మైన్స్ అండ్ జియాలజీ విభాగాల్లో ఆదాయంపై చర్చ.
-
2024-07-11T18:16:16+05:30
హస్తం గూటికి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోన్న చేరికలు
ఇప్పటికే చేరిన పలువురు ఎమ్మెల్యేలు
రేపు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.
ప్రకాష్ గౌడ్‌తోపాటు మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్లు, ఇతర నేతల చేరిక
-
2024-07-11T18:07:00+05:30
నీటి కలుషితంపై త్వరలో క్లారిటీ: మంత్రి నారాయణ
పల్నాడు జిల్లా: పిడుగురాళ్లలో గల లెనిన్ నగర్, మారుతి నగర్‌లో 60 డయేరియా కేసులు
వివిధ ఆస్పత్రుల్లో 39 మందికి చికిత్స, నిలకడగా ఆరోగ్యం
కృష్ణా నది నుంచి మంచి నీరు అందించేందుకు 16 కిలోమీటర్ల పైప్ లైన్
పట్టణంలో 7 పవర్ బోర్స్, 36 హాండ్ బోర్స్, ఒక పవర్ బోర్‌లో నైట్రేట్ ఉన్నట్టు గుర్తింపు
కృష్ణా వాటర్ పైప్ లైన్ లీకేజీ ఉండటంతో ఐదు రోజులు నీటి సరఫరా నిలిపి వేత, 5 రోజులు బోరు నీటి వాడకం.
పరీక్ష కోసం నీరు విజయవాడ ల్యాబ్‌కు పంపాం.
5,6 రోజుల్లో నీరు ఎక్కడ కలుషితం అయ్యిందో క్లారిటీ వస్తుంది.
-
2024-07-11T17:36:48+05:30
ఎమరాల్డ్ స్వీట్స్ షాప్ కిచెన్‌లో ఎలుకలు, పందికొక్కులు..
హైదరాబాద్ : సిటీలో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.
ఇందిరా పార్క్ సమీపంలో గల ఎమ్రాల్డ్ స్వీట్స్‌లో జిహెచ్ఎంసి ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.
స్వీట్ల తయారీలో పేరుగాంచిన ఎమరాల్డ్ స్వీట్స్ షాప్ కిచెన్‌లో దారుణమైన పరిస్థితులు.
కంపు కొడుతూ దుర్గంధ భరితమైన వాతావరణంలో స్వీట్ల తయారీ.
రోజుల తరబడి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన పాలు, పెరుగు, పన్నీర్ సీజ్.
స్వీట్ల తయారీలో మోతాదుకు మించి ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు గుర్తింపు.
కిచెన్‌లో తిరుగుతున్న ఎలుకలు, పందికొక్కులు.
ఎమరాల్డ్ స్వీట్స్ తయారీ నిర్వాకులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు సీరియస్.
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ ఆగ్రహం.
-
2024-07-11T17:33:55+05:30
రన్నింగ్ స్టాఫ్‌కి విశ్రాంతి గదులు: సౌత్ సెంట్రల్ రైల్వే డీఆర్ఎం
లోకోపైలట్లు, ట్రైన్ గార్డులు, గార్డులు కలిపి రన్నింగ్ స్టాఫ్‌కి విశ్రాంతి గదులు ఏర్పాటు చేశామని సౌత్ సెంట్రల్ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ తెలిపారు.
రూ. 6 కోట్ల ఖర్చుతో ఈ విశ్రాంతి గదులు ఏర్పాటు చేశాము.
రన్నింగ్ స్టాఫ్‌కు అద్భుతమైన సదుపాయాలు ఉంటాయి.
రైల్వేలలో ట్రైన్ లోకో పైలట్, డ్రైవర్ చాలా ముఖ్యమైన వాళ్ళు. వారికి విశ్రాంతి చాలా అవసరం.
రన్నింగ్ స్టాఫ్‌కు కచ్చితమైన విశ్రాంతి కావాల్సి ఉంటుంది.
జోనల్‌లో అత్యంత పెద్ద రన్నింగ్ రూం విజయవాడలో ఉంది.
285 మంది రన్నింగ్ స్టాఫ్ ఇక్కడ విశ్రాంతి తీసుకునే విధంగా ఏర్పాట్లు చేసాము.
సమార్లకోట యాక్సిడెంట్‌లో జారిపడిన గార్డు కోలుకుంటున్నారు.
సామర్లకోట యాక్సిడెంట్ లో డోర్ హ్యాండిల్ ఊడిపోవడం రైల్వే లోనే మొదటిది.
పూర్తి పరిశీలన చేస్తున్నాం.
రైలు మెయింటెనెన్స్ లోపాలపై విచారణ జరుగుతోంది
సిగ్నలింగ్ సిస్టం మార్చడం.. అలాగే నాన్ ఇంటర్లాకింగ్ సిస్టం తీసుకురావడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
-
2024-07-11T17:20:04+05:30
కేంద్రమంత్రి బండి సంజయ్‌కి కేటీఆర్ బహిరంగ లేఖ..
ఈసారి కేంద్ర బడ్జెట్‌లో సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను తీసుకురండి.
పదేళ్లుగా ప్రతి బడ్జెట్‌లో కేంద్రం తెలంగాణకు మొండిచెయ్యి చూపింది.
ఈసారి అయినా సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను తెప్పించండి.
కేంద్ర మంత్రిగా మీకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి.
సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తే ఇక్కడి నేతన్నల కష్టాలు కొంత మేరకు తీరుతాయి.
నేతన్నలను ఆదుకోవడంలో రాష్ట్ర సర్కారు ఫెయిల్.
-
2024-07-11T17:18:25+05:30
ఏపీలో ఇద్దరు ఏపీఎస్‌ల బదిలీలు..
హోం సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తాను విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీగా బదిలీ.
కుమార్ విశ్వజిత్ ను హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేసిన ప్రభుత్వం.
ఈమేరకు ఉత్తర్వులు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.
-
2024-07-11T17:11:42+05:30
బురద చల్లడం ఆపి.. ఓటమిని సమీక్షించుకోండి: మంత్రి శ్రీధర్ బాబు
అధికారం కోల్పోయి ఏడు నెలలైనా బీఆర్ ఎస్ పార్టీ పెద్దలు ఇప్పటికీ భ్రమల లోకం నుంచి బయటకు రాలేకపోతున్నారు.
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల భంగపాటు తర్వాత లోపం ఎక్కడుందో సమీక్షించుకోవాల్సింది పోయి ప్రభుత్వంపై బురద చల్లడంపైనే దృష్టి పెట్టారు.
ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రభుత్వ లోటుపాట్లను ఎత్తిచూపితే స్వాగతిస్తాం.
నిస్సృహతో కూడిన ప్రకటనలతో గందరగోళాన్ని కప్పిపుచ్చుకోవడం వల్ల ప్రజయోజనం ఉండదు.
రాజకీయ పార్టీల గెలుపు ఓటములను ప్రజలే నిర్ణయిస్తారు.
వారి అభిమానం ఉన్నంతకాలమే ఏ రాజకీయ పక్షమైనా కొనసాగుతుంది.
ఇంత జరిగినా పార్టీ అధినేత కేసీఆర్ తీరులో ఏమాత్రం మార్పు రాలేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు.
అధికారంలో ఉన్నన్నాళ్లు సచివాలయానికి రాకుండా నివాసం నుంచే పాలన సాగించారు.
కనీసం ప్రతిపక్ష నేతగానైనా ఆయన జనం మధ్యకు వెళ్తారనుకున్నాం.
కాని ఇంట్లోనే కూర్చుని కార్యకర్తలను తనవద్దకు రప్పించుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ యాదృచ్ఛికంగా అధికారంలోకి వచ్చిందని ఇప్పటికీ ప్రచారం చేస్తుండటం వాళ్ల ఆలోచనలో ఏమాత్రం మార్పు రాలేదని తెలిసిపోతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాలు గెల్చుకుంది. బీఆర్ ఎస్ కు దక్కింది 39 మాత్రమే. 25 సీట్ల ఆధిక్యతను మర్చిపోతున్నారు.
లోక్ సభ ఎన్నికల్లో 2019 లో 9 స్థానాలు గెల్చిన ఆ పార్టీ సున్నాకే పరిమితమైంది.
ఇది ప్రజలిచ్చిన తీర్పు కాదా? అయినా ఓటమితో దిష్టి తొలగిందని సమర్థించుకోవడం ఏంటి?.
మళ్లీ అధికారంలోకి వచ్చి 15 ఏళ్లు అధికారంలో ఉంటామని గాంభీర్యాలకు పోవడం కలల్లో జీవించడం కాదా.
అధికారంలో ఉన్న పార్టీ ప్రజలకు ఏలోటూ రాకుండా చూసుకుని మళ్లీ మళ్లీ గెలుస్తాం అనడంలో హేతుబద్దత ఉంది.
నేలమట్టమైన పార్టీని నాలుగున్నరేళ్ల తర్వాత అధికారంలోకి తీసుకొచ్చి 15 ఏళ్లు నిరాటంకంగా పరిపాలిస్తారట.
కేసీఆర్‌ది తార్కికతకు దగ్గరగా లేని అందమైన ఊహ అనుకోవాలి.
-
2024-07-11T17:09:14+05:30
డీఎస్సీ పరీక్ష యధాతథం: ప్రభుత్వ విప్
ఉద్యమ సమయంలో విద్యార్థులు ఉసిగొల్పి కేసీఆర్ కుటుంబం అధికారాన్ని సంపాదించింది.
తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ రూ. 7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు.
చేసిన అవినీతి ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో కేటీఆర్, కేసీఆర్ రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారు.
విద్యార్థులను రెచ్చగొట్టి పబ్బం గడిపే ప్రయత్నం చేస్తున్నారు.
నిజమైన విద్యార్థులు లైబ్రరీలో చదువుతున్నారు.
బీఆర్ఎస్ విద్యార్థి సంఘం నాయకులు అమాయక విద్యార్థులను రెచ్చగొడుతున్నారు.
కవితను జైలు నుంచి విడిపించుకోవడం కోసం బీజేపీ నాయకులు ఇచ్చిన స్క్రిప్ట్ ను బీఆర్ఎస్ నేతలు రాష్ట్రంలో అమలు చేస్తున్నారు.
ప్రజాపాలన ను జీర్ణించుకోలేక కడుపు మంటతో రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం విద్యార్థులను కేసుల పాలు చేస్తోంది.
కేసీఆర్ ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేసి ఆంధ్రా కాంట్రాక్టర్లను పెంచి పోషించారు.
గ్రూప్ 1 పరీక్ష పైన గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌నే ఈ ప్రభుత్వం కొనసాగించింది.
డీఎస్సీ పరీక్ష జరిగితే తమ పార్టీ మనుగడ కష్టమౌతుందనే రాద్దాంతం చేయిస్తున్నారు.
నిరుద్యోగ యువత బీఆర్ఎస్ స్వార్థ రాజకీయాలకు బలి కావద్దు.
నిరుద్యోగులు కేసుల్లో ఇరికితే భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలను కోల్పోతారు.
కోర్టు కేసులు, ఇతర అడ్డంకులను తొలగిస్తు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తోంది.
కేసీఆర్ ఫామ్ హౌస్‌లో కూర్చొని విద్యార్థి ఉద్యమాల పేరుతో కుట్రలు చేస్తున్నారు.
గద పదేళ్లు కేసీఆర్ సెక్రటేరియట్‌లోకి సామాన్యులను, మీడియాను రానివ్వలేదు.
మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాన్యులను కూడా సచివాలయంలోకి అనుమతిస్తున్నారు.
ప్రజా భవన్‌లో ప్రజలను కలవడంపై కేసీఆర్ కన్ను కుట్టింది.
మా ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలు చేస్తుంటే కేసీఆర్ కడుపు మండుతోంది.
దేశం లోనే మంచి ఫాలోయింగ్ ఉన్న నేతగా రేవంత్ రెడ్డి పేరు వస్తుందన్న అసూయతోనే కేసీఆర్ తన తాబేదార్లతో నిందలు వేయిస్తున్నారు.
బాల్క సుమన్, గాదరి కిషోర్ భాష చూసే జనం ఛీ కొట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారు.
మహిళలకు 500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం.
ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం.
త్వరలోనే మహిళలకు రూ. 2500 ఇస్తాం.
రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయబోతున్నాం.
రాజీనామాతో హరీష్ రావు సిద్ధంగా ఉండాలి.
మీడియాతో సహా అందరినీ మోసం కేసీఆర్ మోసం చేశాడు.
పొలిమేరలు దాటేలా బీఆర్ఎస్ ను తరిమి కొట్టేలా చూడాలి.
డీఎస్సీ వాయిదా అవకాశం లేదు.
వీలైనంత త్వరగా మరో డీఎస్సీ నిర్వహిస్తాం.
విద్యార్థులు ఆందోళనలకు దిగొద్దు.
-
2024-07-11T17:06:03+05:30
జనగామ బీఆర్ఎస్ కార్యాలయానికి నోటీసులు
ఎకరం ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి కార్యాలయం నిర్మించినట్టు గుర్తించిన అధికారులు
జిల్లా అధ్యక్ష పదవి ఖాళీగా ఉండటంతో జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కార్యాలయ సిబ్బందికి నోటీసులు అందించిన అధికారులు
నిర్ణీత గడువులోగా సమాధానం ఇవ్వాలని లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
-
2024-07-11T17:05:12+05:30
ఆర్డీవో కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్
జయశంకర్ భూపాలపల్లి: ఆర్డీవో కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్, కీలక ఫైళ్లు దగ్దం.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ భూసేకరణ ఫైల్స్‌తో పాటు.. సింగరేణి, కేటీపీపీలో భూములకు చెందిన విలువైన ఫైల్స్ ఉన్నట్లు సమాచారం.
బీరువాలో భద్రపరిచిన విలువైన ఫైల్స్ భూసేకరణ పత్రాలు దగ్ధం.
400 పట్టాదారు పాసుపుస్తకాలు దగ్దం.
అర్థరాత్రి జరిగిన ప్రమాదంపై అనుమానాలు.
వివరాలు సేకరిస్తున్న క్లూస్ టీం.
-
2024-07-11T16:52:48+05:30
హైదరాబాద్: యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్..
రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో అదుపులో యూట్యూబ్ ప్రణిత్ హనుమంతు.
నిన్న బెంగళూరు నుంచి పిటి వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకొచ్చిన పోలీసులు.
హనుమంతును విచారించిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో.
నాంపల్లి కోర్టు ముందు హాజరు పరిచిన పోలీసులు.
ప్రణీత్‌పై 67B it యాక్ట్, ఫోక్సో యాక్ట్, 79, 294 BNSసెక్షన్స్ కింద కేసులు నమోదు.
మరో ముగ్గురు నిందితులపై కేసులు.
A2, డల్లాస్ నాగేశ్వర్ రావు.
A3, బుర్రా యువరాజ్.
A4, సాయి ఆధినారాయణ.
-
2024-07-11T16:49:42+05:30
అర్హులైన రైతులందరికీ రైతు భరోసా
ఆదిలాబాద్: ఉట్నూర్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియా సమావేశం.
అర్హులైన రైతులందరికీ రైతు భరోసా అందుతుంది.
మేం హైదరాబాద్‌లో కూర్చుని నిర్ణయాలు తీసుకోము.
అందరి అభిప్రాయాలను సేకరించి విధాన పరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం.
పెండింగ్ ప్రాజెక్టులన్నింటిని ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తాం.
అన్ని శాఖల సమన్వయంతో పోడు భూముల సమస్యను పరిష్కరిస్తాం.
ఎన్ని ఇబ్బందులు ఉన్నా రూ. 2లక్షల రుణమాఫీ చేస్తాం.
ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకుంటాం.
-
2024-07-11T16:47:42+05:30
నంద్యాల: ఇంకా దొరకని చిన్నారి వాసంతి ఆచూకీ
ఇంకా దొరకని చిన్నారి వాసంతి ఆచూకీ
ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ ను ముట్టడించిన వాసంతి కుటుంబ సభ్యులు స్థానికులు
పాప అదృశ్యమై నేటికి ఐదు రోజులు అయింది.
నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగిన బాధితులు.
పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత.
బాధితులకు సర్ది చెబుతున్న పోలీసులు.
-
2024-07-11T16:46:12+05:30
ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఎలాంటి రికవరీ లేదు: ఎంపీ సందీప్ పాఠక్
ఢిల్లీ : ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఎలాంటి రికవరీ లేదు. ఈడీ పెట్టిన కేసులన్నీ రాజకీయపరమైన కుట్ర కేసులే. నేరం జరగలేదు కాబట్టి ఒకరిపై ఆరోపణలు చేసి ప్రయోజనం లేదు. బీజేపీ రాజకీయ క్రీడలో ఈ కేసు ఒక భాగం. ఈ కేసులో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా బీజేపీ కార్యాలయం నుంచే జరుగుతోంది.
-
2024-07-11T16:40:36+05:30
పల్నాడు: పిడుగురాళ్ల లెనిన్ నగర్, మారుతి నగర్‌లో మంత్రి నారాయణ పర్యటన
పిడుగురాళ్ల లెనిన్ నగర్, మారుతి నగర్‌లో మంత్రి నారాయణ పర్యటించారు.
డయేరియా ప్రభావిత ప్రాంతంలో అధికారులతో కలిసి మంత్రి పర్యటించారు.
పారిశుధ్య నిర్వహణ, తాగు నీటి బోర్లను పరిశీలించిన నారాయణ.
స్వయంగా కొంతమంది ఇళ్లకు వెళ్లి నీటి సరఫరా, వాడకంపై వివరాలు అడిగిన మంత్రి.
లెనిన్ నగర్ పీహెచ్‌సిలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను పరామర్శించిన మంత్రి నారాయణ.
బాధితులకు అందుతున్న వైద్యంపై ఆరా తీసిన మంత్రి.
డయేరియా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో అధికారులతో సమీక్ష.
-
2024-07-11T16:21:05+05:30
అతనిపై చర్యలు తీసుకోండి..
కర్నూలు: గుంటూరుకి చెందిన బోరు గడ్డ అనీల్‌పై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, వారి కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు చేస్తున్న బొరుగడ్డ అనీల్.
అనీల్ పై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన ఐ టీడీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు గట్టుతిలక్.
-
2024-07-11T16:02:48+05:30
మేడ్చల్ జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పు..
2017లో 8 ఏళ్లబాలికపై పొరుగింటి యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు
దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు.
కొన్నేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న కేసు.
తాజా ఇరు పక్షాల వాదనలు విన్న మేడ్చల్ జిల్లా పోక్సోకోర్టు జడ్జి.
నేడు తుది తీర్పు వెల్లడించిన న్యాయమూర్తి.
బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్ష, రూ.3 లక్షల జరిమానాను విధిస్తూ జడ్జి సంచలన తీర్పు వెల్లడి.
-
2024-07-11T15:42:20+05:30
విజయనగరంలో సీఎం చంద్రబాబు
విజయనగరం: ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం కేంద్ర బిందువు కాబోతుంది: సీఎం చంద్రబాబు
విశాఖ - విజయనగరం, శ్రీకాకుళం మూడు నగరాలుగా వృద్ధి చెందుతూ కలసిపోతాయి
విమానాశ్రయ ప్రాజెక్టు గత ఐదేళ్లు వెనక్కి వెళ్లింది, ఇప్పటికే 38.8 శాతం పనులు పూర్తయ్యాయి
45 మిలియన్ల ప్రయాణీకుల రాకపోకలు లక్ష్యం
4,700 కోట్లతో తొలి దశ పనులు పూర్తవుతాయి
2026 జూన్ నాటికి ప్రారంభిస్తాం, పివిజి రాజు పేరు పెట్టాలనే ప్రతిపాదన వచ్చింది.
-
2024-07-11T14:47:27+05:30
బిగ్ బ్రేకింగ్: మంత్రి నారా లోకేష్ వాట్సప్ బ్లాక్..
మంత్రి నారా లోకేష్ వాట్సాప్ బ్లాక్ అయ్యింది.
ప్రజలు తమ సమస్యలు తన పర్సనల్ మెయిల్ ఐడీ hello.lokesh@ap.gov.in కి పంపాలని విజ్ఞప్తి.
తానే స్వయంగా ఆ మెయిల్ చూసి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించిన మంత్రి.
సమస్య ఏదైనా, సహాయం కావాలన్నా ఇకనుంచి తనకు hello.lokesh@ap.gov.in ఈ మెయిల్ ఐడీకి పంపాలని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి.
రాష్ట్రం నలుమూలల నుంచి తమ సమస్యలు పరిష్కరించాలంటూ పంపుతున్న మెసేజ్‌లు పోటెత్తడంతో మంత్రి నారా లోకేష్ వాట్సప్‌ను మెటా బ్లాక్ చేసింది.
సాయం కోసం వచ్చే ప్రజలకు తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఎన్నికలకు ముందే నారా లోకేష్ ప్రకటించారు.
ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచి మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ప్రతిరోజు ప్రజల్ని కలిసి వారి సమస్యలు తెలుసుకునే ప్రజా దర్బార్ ఉండవల్లి నివాసంలో నిర్వహిస్తున్నారు.
వేలాది మంది తమ సమస్యలను ఒకేసారి మంత్రి నారా లోకేష్‌కి వాట్సప్ చెయ్యడం వలన టెక్నికల్ సమస్యతో బ్లాక్ అయింది.
తనకు సమాచారం పంపే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తానే హ్యాండిల్ చేసే పర్సనల్ మెయిల్ ఐడి hello.lokesh@ap.gov.in కి సమస్యలన్నీ పంపించాలని మంత్రి విజ్ఞప్తి.
పాదయాత్రలో యువతకు తనను దగ్గరగా చేర్చిన ‘హలో లోకేష్’ కార్యక్రమం పేరుతోనే ఈ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్న మంత్రి.
పేరు, ఊరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, సమస్య-సహాయంకు సంబంధించిన పూర్తి వివరాలు వినతులలో పొందుపరచాలని సూచించారు.
వాట్సప్ తరచూ బ్లాక్ కావడంతో ప్రజలు పంపే మెసేజ్‌లు చూసే అవకాశం ఉండటం లేదని, దయచేసి అందరూ మెయిల్ ఐడీకే వినతులు పంపించాలని మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి.
-
2024-07-11T14:37:00+05:30
అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం: ఎమ్మెల్యే దగ్గుపాటి
నగర సమీపంలోని ఆలమూరు లేఅవుట్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే
ఎమ్మెల్యే వెంట హౌసింగ్, ఇతర విభాగాల అధికారులు.
7వేల ఇళ్లలో 12వందల ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి.
మిగిలిన వాటి నిర్మాణాలు వెంటనే చేపడుతాం.
నాణ్యతాలోపం స్పష్టంగా కనిపిస్తోంది.. ఇకపై అలా ఉండదు.
హౌసింగ్ అక్రమాలపై కచ్చితంగా చర్యలు ఉంటాయి.
-
2024-07-11T14:36:06+05:30
ట్రిపుల్ ఐటీల్లో ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల..
ఏలూరు: రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఎంపికైన విద్యార్థుల జాబితాను విడుదల చేసిన రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అధికారులు.
ఈ ఏడాది ట్రిపుల్ ఐటీ ప్రవేశాలలో బాలికలదే పైచేయి,67.15 శాతం ఎంపిక.
నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం, ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీల్లో 2024-25 అడ్మిషన్స్‌కు 4,400 సీట్ల భర్తీకి అన్ లైన్‌లో నమోదు చేసుకున్న 53,863 మంది విద్యార్థులు.
ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి అధిక స్థాయిలో ఉత్సాహం కనబరచిన విద్యార్థులు.
ట్రిపుల్ ఐటీ విద్యాభ్యాసంకు 93శాతం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎంపికవ్వగా, 7శాతం ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులకు దక్కింది.
రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా 498 సీట్లు సాధించిన శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా 286 సీట్లు.
జులై 22 నుండి 27 వరకు ఎంపికైన విద్యార్థులకు కౌన్సిలింగ్, ఆగస్టు నెలలో తరగతులు ప్రారంభం.
ఎంపికైన విద్యార్థుల జాబితాను ఆర్జియుకేటి వెబ్‌సైట్‌లో పెట్టి, కౌన్సిలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులకు కాల్ లెటర్స్, మెసేజ్స్ పంపనున్న యూనివర్సిటీ అధికారులు.
-
2024-07-11T14:21:15+05:30
కేసీఆర్ కుటుంబంపై కడియం శ్రీహరి సంచలన కామెంట్స్..
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాట్ కామెంట్స్.
గత 10 ఏళ్లలో కల్వకుంట్ల కుటుంబ అవినీతి పెరిగింది.
2014కు ముందు వారి ఆస్తులు ఎంత, 2024 తర్వాత ఎంతో ప్రజల ముందు చెప్పాలి.
BRS నాయకత్వం మీద నమ్మకం లేకనే రాజకీయ వలసలు.
రాజకీయ వలసలు మీరు చేస్తే సంసారం.. వేరేవారు చేస్తే వ్యభిచారమా..?
-
2024-07-11T14:18:47+05:30
మనీష్ సిసోడియాకు షాక్..
ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఈడీ, సీబీఐ కేసుల్లో మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. మనీష్ సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణ నుంచి న్యాయమూర్తి సంజయ్ కుమార్ తప్పుకోవడంతో విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణ జూలై 15వ తేదీకి వాయిదా వేశారు. మనీష్ సిసోడియా ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 2023 ఫిబ్రవరి 26 వ తేదీన అరెస్ట్ అయ్యారు మనీష్ సిసోడియా.
-
2024-07-11T14:01:22+05:30
ఈనెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది.
ఈనెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.
సమావేశాల నిర్వహాణపై మండలి ఛైర్మన్, అసెంబ్లీ స్పీకర్ రివ్యూ.
హాజరైన ప్రభుత్వ విప్ లు, సీఏస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు.
-
2024-07-11T13:59:56+05:30
కిషన్ రెడ్డి, కేటీఆర్‌పై మంత్రి పొన్నం ఆగ్రహం..
హైదరాబాద్ ఈమేజ్‌ని డ్యామేజ్ చేసేలా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడడాన్ని ఖండిస్తున్నా.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‌కి ఏం తెచ్చాడు?
హైదారాబాద్ నగరాన్ని నిర్లక్ష్యం చేసింది బీజేపీ, బీఆర్ఎస్.
తెలంగాణకి నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం.
కిషన్ రెడ్డి కేంద్రమంత్రి కాగానే హైదరాబాద్ ఇంచార్జీ మంత్రిగా కలిశాను.
కేటీఆర్ కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయాడు.
కేటీఆర్ పెద్ద అసమర్థుడు.
హైదరాబాద్ అస్తవ్యస్తం కావడానికి కారణం కేటీఆర్.
ఉద్యోగ క్యాలెండర్ తప్పకుండా ఇస్తాం.
ఉద్యోగ నియామకాలు జాప్యం అవుతున్నాయని మొన్నటి వరకు ప్రశ్నించి, ఇప్పుడు పరీక్షలు వాయిదా వేయండి అంటున్నారు.
రాజకీయ నాయకుల ఉచ్చులో విద్యార్థులు పడకండి.
విద్యార్థుల న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరిస్తాం.
-
2024-07-11T13:57:16+05:30
దొంగల బీభత్సం.. భారీగా చోరీ..
నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారం గ్రామంలో దొంగల బీభత్సం.
వైఎస్ఆర్ నగర్ కాలనీలో రెండు ఇళ్లలో చోరీ.
సుదర్శన్ అనే వ్యక్తి ఇంట్లో 3 లక్షల నగదు 6 తులాల బంగారు ఆభరణాలు చోరీ.
రాజ్ మహ్మద్ అనే వ్యక్తి ఇంట్లో 4 తులాల బంగారు ఆభరణాలు ఒక మొబైల్ చోరీ.
చోరీకి వచ్చిన దుండగులు రాజ్ మహ్మద్ ఇంట్లో చోరీ చేసిన మొబైల్‌ని సుదర్శన్ ఇంట్లో వేసి పోలీసులను డైవర్ట్.
-
2024-07-11T13:53:55+05:30
విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ చేస్తాం: కేంద్రమంత్రి
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కేంద్ర ఉక్కు శాఖా మంత్రి కుమారస్వామి పర్యటన ముగిసింది.
మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి కీలక కామెంట్స్ చేశారు.
స్టీల్ ప్లాంట్ మీద ఇక్కడ ప్రజలు, ఉద్యోగుల సెంటిమెంటును నేను గుర్తించాను.
ప్రధాని మోడీ దృష్టికి ఇక్కడి వాస్తవ పరిస్థితులను తీసుకుని వెళతాను.
ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులతో విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్దరణ చేస్తాం.
-
2024-07-11T13:48:43+05:30
స్టీల్ ప్లాంట్‌పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
మళ్ళీ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద విషం కక్కుతున్నారు.
వాజపేయి ప్రభుత్వంలో నేను స్టీల్ ప్లాంట్ కాపాడాను.
మళ్ళీ నేను స్టీల్ ప్లాంట్ కాపాడతాను.
వైసిపి అబ్దదాలు వింటే నష్టం జరుగుతుంది.
కరుడ గట్టిన దొంగలు ఈ వైసిపి వాళ్ళు.
విశాఖను దోచుకున్నారు.
వాళ్ళని వదిలి పెట్టే ప్రసక్తి లేదు.
రోడ్లు ఆద్వాన్నంగా ఉన్నాయి.
ఆ గొయ్యిలు పెట్టిన వారిని ఆ గోతులో ఉంచాలి.
జగన్‌పై విమర్శలు..
నార్త్ కొరియా కిమ్ ఉంటే, ఇక్కడ జిమ్ ఉన్నాడు.
జగన్ వస్తే చెట్లు కొట్టే వారు, రోడ్డుకు పరదాలు కట్టారు.. కానీ ఇప్పుడు ఆ రోజులు లేవు.
కార్పేట్లు వద్దు.. నేను మట్టిలోనే తిరుగుతాను.
ప్రతి పైసా పొదుపుగా ఖర్చు చేస్తాను.. ప్రజల కోసం వాడుతాను.
పూర్తి సమాచారం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
-
2024-07-11T13:46:39+05:30
పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులను వేధిస్తున్నారు: పుట్టా మధు
మంథని ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులను వేధిస్తున్నారు.
ఓ మహిళ.. మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిపై ఫిర్యాదు చేస్తే 45 రోజులుగా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు.
ప్రత్యర్థుల మీద రౌడీ షీట్‌లు తెరవడానికే మంత్రి తన సమయాన్ని వెచ్చిస్తున్నారు.
పైకి సౌమ్యంగా కనిపించే మా ఎమ్మెల్యే చాలా ప్రమాదకరమైన వ్యక్తి.
ఐస్ గడ్డతో చంపే రకం మంథని ఎమ్మెల్యే.
నా మీద నా కుటుంబ సభ్యు పై గతంలోనే రౌడీ షీట్ తెరిపించారు.
ఎమ్మెల్యే తమ్ముడికి భారీ పొలిసు రక్షణ ఉంటుంది.
మా కార్యకర్త సత్యనారాయణ ఇల్లును ఇటీవలే మా ఎమ్మెల్యే కూలగొట్టించారు.
పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల ఫిర్యాదులు తీసుకోవడం లేదు.
-
2024-07-11T13:44:20+05:30
నేడు నోట్లకే విలువ.. సేవకు కాదు..: మోత్కుపల్లి
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు.
అనంతరం అభిమానులతో తన జన్మదినం సందర్భంగా సన్నిధి హోటల్‌లో కేక్ కట్ చేసిన మోత్కుపల్లి.
గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బిక్షమయ్యగౌడ్, బీర్ల ఐలయ్యలకు సపోర్ట్ చేసి గెలిపించాను.
లంచాలు, ఫైరవీలు డబ్బుపై ఆశ లేకుండా నా హయాంలో పాలన చేశా.
గత ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో నాకు పోటీ చేసే అవకాశం రాలేదు.
తెలంగాణలో నేను ఎక్కడ పోటీ చేసినా నాకు పది వేల ఓట్ల మేజారీటీ వస్తుంది.
నాకు యాదగిరిగుట్టలో అర్ధ గజం భూమి లేదు.
ఎలాంటి ఆస్తులు సంపాదించలేదు.
ఇప్పుడున్న ఎన్నికల్లో కోట్లకు విలువ ఉంది, ప్రజలకు సేవ చేసిన వాడికి విలువ లేదు.
బడుగు బలహీన వర్గాల వారి తరఫున నేను ఎల్లప్పుడూ పోరాడుతానే ఉంటా.
బీసీలలో ముదిరాజులు, గౌడ్స్, పద్మాశాలిలు ఉన్నా వారందరిని ప్రక్కన పెట్టి రెడ్లకే ప్రాధాన్యత ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో సీఎంతో సమానంగా పవన్ కళ్యాణ్ ఫోటోలు అన్ని ఆఫీసులలో ఉండాలని అక్కడి సీఎం జీవో రిలీజ్ చేసారు.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో పాటు సమానంగా, దళిత ఉపముఖ్యమంత్రి అయిన భట్టి వికమార్క ఫోటోను అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.
నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పించాలి.
నా భవిష్యత్తు కార్యచరణ ఇగ పోరాటమే తప్ప ఏమీలేదు.
-
2024-07-11T13:41:36+05:30
నీట పరీక్ష కేసు విచారణ 18వ తేదీకి వాయిదా..
నీట్ పరీక్ష కేసు విచారణను జులై 18వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం.
వచ్చే గురువారానికి కేసు విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు.
అఫిడవిట్ నిన్న రాత్రి దాఖలు చేసిన కేంద్రం.
-
2024-07-11T13:39:56+05:30
రంగారెడ్డి: నార్సింగీలో ఎమ్మార్పీఎస్ నాయకుడు నరేందర్ అదృశ్యం.
నార్సింగీలో ఎమ్మార్పీఎస్ నాయకుడు నరేందర్ అదృశ్యం.
నిన్న మధ్యాహ్నం ఇంటి నుండి బయటకు వెళ్లిన నరేందర్, అతని స్నేహితుడు.
అర్ధరాత్రి దాటినా ఇంటికి తిరిగి రాకపోవడంతో నార్సింగీ పోలీసులను ఆశ్రయించిన కుటుంబ సభ్యులు.
బృందావన్ కాలనీకి వెళ్లిన నరేందర్, అతని స్నేహితుడు.
నరేందర్‌ను కిడ్నాప్ చేసారంటూ కుటుంబ సభ్యుల ఆరోపణ.
నార్సింగీ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంటున్న MRPS నాయకులు.
ఇప్పటికే నలుగురుని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్న నార్సింగీ పోలీసులు.
-
2024-07-11T13:37:09+05:30
అనకాపల్లి: అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటాం: చంద్రబాబు
ఎన్నికల్లో కళ్ళు తిరిగే మెజార్టీలు మాకు అందించారు.
అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటాం.
ఇప్పటికే మూడు శ్వేత పత్రాలు విడుదల చేశాం.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వచ్చు.
ఐదేళ్ళ క్రితం ఎలా ఉందో పోలవరం ఎడమ కాలువ ఇప్పుడు కూడా అలాగే ఉంది.
పోలవరం ఈ రాష్ట్రానికి ఒక వరం. డయ ఫ్రమ్ వాల్‌ను గోదావరిలో కలిపేశారు.
పోలవరం ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసుకుంటే ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవచ్చు.
ప్రాజెక్టు పూర్తయ్యే లోపు పుష్కర లిఫ్ట్ ద్వారా నీళ్ళు ఇవ్వవచ్చు.
ఈ రోజు టెండర్లు పిలిచి పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చాం.
రూ. 800 కోట్లు ఖర్చు అవుతుంది. 93 కిలోమీటర్లు పూర్తి చేసుకోవచ్చు.
2.20 లక్షల ఎకరాలకు మొదటి విడతలో నీళ్ళు ఇవచ్చు.
అనకాపల్లికి ఇంటింటికీ నీరు ఇవ్వచ్చు.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంశధార వరకు వెళ్తుంది.
ఏటి కొప్పాక షుగర్ ఫ్యాక్టరీ సమస్య నా దృష్టికి వచ్చింది.
ఎంపీ సీఎం రమేష్‌కు, మంత్రి అనితకు ఈ సమస్యపై దృష్టి పెట్టమని చెప్పాను.
శాశ్వతంగా ఈ పరిష్కారం చేయాలని కోరుతున్నాను.
ముందు పోలవరం, తరవాత అమరావతి వెళ్ళాను.. ఢిల్లీ వెళ్ళాను, మా నియోజక వర్గం కుప్పం వెళ్ళాను.. రాష్ట్రం కోసం తిరుగుతా.
దేశంలో ఎవ్వరికీ ఇవ్వని విజయం మాకు ఉత్తరాంధ్రలో ఇచ్చారు.. రుణపడి ఉంటాం.
-
2024-07-11T13:33:18+05:30
అమరావతి: ఆర్థిక మంత్రిగా పయ్యావుల తొలి సంతకం దేనిపై అంటే..
ఆర్థిక మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన పయ్యావుల కేశవ్.
15 వ ఆర్థిక సంఘం నిధులు 250 కోట్ల రూపాయాలు స్థానిక సంస్థలకు విడుదల.
ఆర్థిక మంత్రిగా మొదటి ఫైల్ పై సంతకం చేసిన పయ్యావుల కేశవ్.
గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను ను గాడి లో పెట్టడం నా మొదటి బాధ్యత.
కేంద్ర ప్రభుత్వం పథకాలు 16 ఆపేశారు.
60 శాతం రాష్ట్రం 40 శాతం కేంద్రం నిధులు పెట్టే పథకాలు ఇవి.
వీటి మొత్తాన్ని ఆపేశారు.
కేంద్రం నిధులు కూడా వాడుకోని పరిస్థితి వైసిపి హయాంలో ఉంది.
వ్యవస్థలు అన్ని గాడి తప్పాయి.
ఎవరు జగన్ కి సలహా ఇచ్చారో కూడా తెలియదు.
-
2024-07-11T13:31:45+05:30
విజయవాడ: ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు పెద్ద పండుగ: నాదెండ్ల మనోహర్
రైతులను కలిసిన సమయంలో వారి బాధలు చెప్పారు.
ధాన్యం కొనుగోలు లో కూడా రైతుకు అన్యాయం జరుగుతుంది.
గత ప్రభుత్వం 36 వేల కోట్లు మా కార్పొరేషన్ ద్వారా అప్పు తీసుకుంది.
రైతులకు 1600 కోట్లు బకాయి పెట్టి వెళ్లారు.
సీఎం, డిప్యూటీ సిఎం సహకారంతో వెయ్యి కోట్లు రైతులకు ఇచ్చాం.
ఆరు వందల కోట్లు త్వరలో ఇస్తాం.
ఇటీవల ధరల గురించి సిఎం సమక్షంలో సమీక్ష జరిగింది.
ధరల స్థిరీకరణపై సీఎం సానుకూలంగా స్పందించారు.
ఈరోజు నుంచి 784 అవుట్ లెట్ల ద్వారా కందిపప్పు, బియ్యం తక్కువ ధరకు అందిస్తున్నాం.
రైతు బజారే కాదు.. అన్ని పెద్ద మాల్స్‌లో కూడా కందిపప్పు అందుబాటులో ఉంచాం.
రాబోయే రోజుల్లో కందిపప్పు, మిల్లెట్స్, పంచదార, రాగి పిండి, తక్కువకు ఇస్తాం.
బియ్యం కూడా బయటి మార్కెట్ కన్నా తక్కువకే ఇస్తున్నాం.
ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
రైతుకు, వినియోగదారులకి మేలు జరగాలనేది మా ఆకాంక్ష.
రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా దాడులు చేస్తూ నియంత్రణ చేస్తున్నాం.
రైస్ మిల్లర్లు కూడా ప్రభుత్వానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు.
కాకినాడలోనే 249 మెట్రిక్ టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్నాం.
ఈ బియ్యం కుంభకోణం లో ఐదుగురు ఐపియస్ అధికారులు పాత్ర కూడా ఉంది.
విచారణ పూర్తి అయ్యాక తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
క్షేత్ర స్థాయిలో అన్యాయం జరగకూడదు.. పిడియస్ బియ్యం పేదలకే అందాలి.
-
2024-07-11T13:28:52+05:30
అమరావతి: ఆకాశాన్నంటుతున్న నిత్యావసర ధరలు..
బహిరంగ మార్కెట్‌లో ఆకాశాన్నంటుతున్న నిత్యావసర ధరలు
ప్రజలకు తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
నేటి నుంచి రైతు బజార్లలో బియ్యం, కందిపప్పు తక్కువ ధరకు అందించేలా ఏర్పాట్లు
విజయవాడ ఏపిఐఐసి కాలనీలోని రైతు బజార్‌లో స్టాల్‌ను ప్రారంభించిన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
రైతు బజార్‌లో నేటి నుంచి..
దేశావళి కందిపప్పు కిలో రూ.. 160
స్టీమ్డ్ బిపిటి రైస్.. రూ..49
సోనామసూరి.. రూ.. 48
-
2024-07-11T13:25:21+05:30
ఈ మహా నగరానికి ఏమైంది?.. కేటీఆర్ సంచలన పోస్ట్..
ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి ప్రముఖ పత్రికలు కూడా “ఈ నగరానికి ఏమైంది?" అని ఫ్రంట్ పేజిలో వార్తలు రాస్తోంది అంటే నగరంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని అర్థం!
పరిపాలనా అనుభవం లేని నాయకత్వం ఎలా ఉంటుందో హైదరాబాదు నుండి తెలంగాణ పల్లెటూరు వరకూ అంతటా కనిపిస్తోంది!
"బ్రాండ్ హైదరాబాద్"
ఎందుకు మసకబారుతోంది ??
విశ్వనగరంగా ఎదుగుతున్న వేళ..
ఎందుకింత కళ కోల్పోతోంది ???
సగటు హైదరాబాదీకి
కలుగుతున్న భావన ఇది..!
హైదరాబాద్ ను ప్రేమించే
ప్రతిఒక్కరిలో ఉన్న ఆవేదన ఇది..!!
పదేళ్ళు ప్రశాంతంగా ఉన్న నగరంలో
పెరిగిపోతున్న వరుస హత్యలు..
పేట్రేగిపోతున్న అంతరాష్ట్ర ముఠాలు..
రాజధాని హైదరాబాద్ లో శాంతి లేదు..
నగర ప్రజల జీవితాలకు భద్రత లేదు..
సీఎం గారు స్వయంగా...
పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వస్తున్నా..
పోలీసింగ్ పై కమాండ్ ఏది..?
క్షీణిస్తున్న శాంతిభద్రతలపై కంట్రోల్ ఏది..??
ఓవైపు..
కుప్పకూలిన రియల్ ఎస్టేట్ రంగం..
పరిపాలనా వైఫల్యాన్ని వేలెత్తి చూపుతోంది.
మరోవైపు..
పడగవిప్పిన హత్యల సంస్కృతి..
ప్రతి కుటుంబంలో వణుకు పుట్టిస్తోంది.
ఇంకోవైపు..
తరలిపోతున్న పెట్టుబడుల పర్వం..
యువత ఉపాధి అవకాశాల్ని దెబ్బతీస్తోంది.
కాంగ్రెస్ పవర్ లోకి రాగానే
గడియ గడియకు ఏమిటీ.. పవర్ కట్ ?
సేఫ్ సిటీ గా ఉన్న మహానగరంలో..
ఎందుకు పెరుగుతోంది.. క్రైం రేట్ ??
ఇదేనా మీరు తెస్తానన్న మార్పు ?
విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి..
పదేళ్లు కష్టపడి పునాదులు వేస్తే..
అధికారంలోకి రాగానే ఆగం చేస్తే ఎలా ?
ప్రపంచంతో పోటీపడే నగరంగా
ఎదుగుతున్న హైదరాబాద్ ప్రగతికి
అర్ధాంతరంగా బ్రేకులు వేస్తే ఎలా ??
దేశ రాజధాని చుట్టూ..
రాజకీయ చక్కర్లు కొట్టడంపై ఉన్న శ్రద్ధ..
చిక్కుల్లో కొట్టుమిట్టాడుతున్న
రాష్ట్ర రాజధానిపై లేకపోతే ఎలా ???
హైదరాబాద్ అంటే..
కేవలం రాజధాని కాదు..
"తెలంగాణ ఎకనమిక్ ఇంజన్ "
ఇకనైనా..
కాంగ్రెస్ సర్కారు మేల్కొనకపోతే..
మన హైదరాబాద్ దెబ్బతింటే..
రాష్ట్రానికి కష్టమే కాదు..
యావత్ దేశానికి కూడా నష్టం..
-
2024-07-11T13:16:41+05:30
బ్యాడ్మింటన్ ఆడిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఉన్న బ్యాడ్మింటన్ కోర్టులో ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్తో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బ్యాడ్మింటన్ ఆడారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.
-
2024-07-11T13:14:06+05:30
ఢిల్లీ: హర్యానాలో INLD - BSP మధ్య కుదిరిన పొత్తు..
హర్యానాలో INLD - BSP మధ్య కుదిరిన పొత్తు.
ప్రకటించిన INLD నేత అబా చౌతాలా.
ఈ పొత్తు స్వార్థం కోసం కాదని, ప్రజల అభీష్టం మేరకే కుదిరిందని వెల్లడి.
బీజేపీ, కాంగ్రెస్ దేశాన్ని దోచుకున్నాయన్న చౌతాలా.
బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమిని ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా.
జూలై 6వ తేదీన మాయావతి, అబా చౌతాలా మధ్య సమావేశం.
హర్యానాలోని 90 స్థానాల్లో బీఎస్పీ 37 స్థానాల్లో పోటీ చేసేలా కుదిరిన ఒప్పందం.
-
2024-07-11T12:24:18+05:30
కోళ్లు దొంగతనం చేసిన డిజిపి ఆఫీస్ ఉద్యోగి..
కోళ్లు దొంగతనం చేసిన డిజిపి ఆఫీస్ ఉద్యోగి రోశయ్య.
ఆటోలో నాటు కోళ్లు తీసుకెళ్తున్న వినుకొండ రైతు.
రాష్ట్ర డిజిపి ఆఫీస్ ఎదుట కోళ్లను చూసిన ఉద్యోగి రోశయ్య.
టోల్ గేట్ దాకా వెంటపడి ఆటోను అడ్డగించిన రోశయ్య.
రైతును బెదిరించి 7 నాటు కోళ్లు ఎత్తుకెళ్లిన ఉద్యోగి రోశయ్య.
7 నాటు కోళ్ల ఖరీదు లక్ష పైమాటే.
అట్టుకోబోయిన స్దానికులపై బెదిరింపులు.
డిజిపి ఆఫీస్ లో పని చేసే రోశయ్య గా గుర్తింపు.
వీడియో తీస్తుండగా మీకు చేతనైంది చేసుకోండని హెచ్చరించిన ఉద్యోగి రోశయ్య.
-
2024-07-11T12:04:32+05:30
బిగ్ షాక్.. వారు రైతుబంధు నిధులు తిరిగివ్వాల్సిందే..!
గురువారం నాడు రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం.
ఈనెల చివరి వారంలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.
బడ్జెట్ ప్రతిపాదనలపై సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహించనున్న సీఎం.
రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణే లక్ష్యంగా సిఎం రేవంత్ రెడ్డి కసరత్తు.
వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రవాణా, రిజిస్ట్రేషన్, శాఖల ముఖ్య కార్యదర్శులతో సమీక్షలు.
భూముల విలువ పెంపు తదితర అంశాలపై చర్చ.
గత ప్రభుత్వంలో వ్యవసాయేతర భూములకు ఇచ్చిన రైతు బంధును రికవరీ చేసే యోచనలో ప్రభుత్వం.
ఇప్పటికే ఆ దిశగా కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.
-
2024-07-11T11:59:10+05:30
పిన్నెల్లి నోట పచ్చి అబద్దాలు.. అవాక్కైన పోలీసులు..
నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణరెడ్డి.
గుంటూరు జిల్లా కోర్టు బెయిల్‌పై విచారణనని ఈ నెల 18కి వాయిదా.
పిన్నెల్లి బెయిల్‌పై తీవ్ర ఉత్కంఠ.
పోలీసుల విచారణలో పిన్నెల్లి పచ్చి అబద్దాలు.
సీసీ ఫూటేజీ ఉన్నప్పటికీ, ఈవీఎం పగులగొట్టలేదన్న పిన్నెల్లి.
కారంపూడిలో హింసాత్మక ఘటనలు జరిగిన రోజున ఇంట్లోనే ఉన్నానంటూ బుకాయింపు.
ఇటీవల పిన్నెల్లి ఈవీఎంని పగులగొట్టాడని మీడియా ముందు ఒప్పుకున్న మాజీ సీఎం జగన్.
పిన్నెల్లి పచ్చి అబద్దాలతో అవాక్కైన పోలీసు అధికారులు.
-
2024-07-11T11:56:55+05:30
అనకాపల్లి: దార్లపూడికి చేరుకున్న సీఎం చంద్రబాబు..
దార్లపూడికి హెలి కాఫ్టర్‌లో చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
సీఎంకి ఘన స్వాగతం పలికిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కూటమి నేతలు.
దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాలువను పరిశీలించనున్న చంద్రబాబు.
-
2024-07-11T11:39:16+05:30
అమరావతి: ఆర్థిక మంత్రి బాధ్యతలు స్వీకరించిన పయ్యావుల
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ గురువారం నాడు బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో 2వ బ్లాక్‌లో నూతన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు.
-
2024-07-11T11:32:15+05:30
ఓటమిపై సమీక్ష చేస్తున్న కురియన్ కమిటీ..
గాంధీ భవన్ చేరుకున్న కురియన్ కమిటీ
పోటీ చేసిన అభ్యర్థులతో విడివిడిగా మాట్లాడనున్న కమిటీ.
ఒక్కో అభ్యర్థికి ముప్పై నిమిషాలు కేటాయించిన కమిటీ.
గాంధీ భవన్‌కి ఒక్కొక్కరుగా చేరుకుంటున్న పోటీ చేసిన అభ్యర్థులు.
కమిటీ రిపోర్ట్‌ను సీల్డ్ కవర్‌లో ఏఐసీసీకి అందిస్తామన్న కురియన్ కమిటీ.
గాంధీ భవన్‌లో సికింద్రాబాద్ పార్లమెంట్ ఓటమిపై కురియన్ కమిటీ సమీక్ష.
హాజరైన సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్.
-
2024-07-11T11:12:50+05:30
బిగ్ బ్రేకింగ్.. రాజ్ తరుణ్‌పై కేసు నమోదు..
నార్సింగ్ పోలీస్ స్టేషన్లో రాజ్ తరుణ్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు
ఏ 1 గా రాజ్ తరుణ్,
ఎ2 గా మాల్వి మల్హోత్రా
ఏ3 గా మయాంక్ మల్హోత్రాన్ని చేర్చిన నార్సింగ్ పోలీసులు
2008 నుండి రాజ్ తరుణ్ కు లావణ్య పరిచయం
2010 లో లావణ్యకు ప్రపోజ్ చేసిన రాజ్ తరుణ్
2014లో రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకున్నాడు: లావణ్య
రాజ్ తరుణ్‌ను మా కుటుంబం అన్ని విధాలుగా ఆదుకుంది
రాజ్ తరుణ్‌కు ఉన్న ఆర్థిక సమస్యలు మొత్తాన్ని మా కుటుంబం భరించింది.
రాజ్ తరుణ్‌కు ఇప్పటివరకు 70 లక్షల రూపాయలు ఇచ్చాము.
రాజ్ తరుణ్ కుక్కల కారణంగా 6 సంవత్సరాల్లో 6 ఇల్లులు మారాల్సి వచ్చింది.
2016లో నేను గర్భవతి అయ్యాను.
రెండవ నెలలో నాకు సర్జరీ చేశారు.
నా హాస్పిటల్ బిల్స్ అన్ని రాజ్ తరుణ్ చెల్లించాడు.
జనవరిలో నేను యుఎస్ నుండి తిరిగి వచ్చాను.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నన్ను పోలీసులు అరెస్టు చేశారు.
నాపై డ్రగ్స్ కేస్ ఉందంటూ తప్పుడు ఆరోపణలతో పోలీసులు నన్ను రిమాండ్ చేశారు.
45 రోజులు నేను జైల్లో ఉన్నాను.
రాజ్ తరుణ్‌తో పాటు మాల్వి మలహోత్రా ఇద్దరు కలిసి నన్ను ఇరికించారు.
ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసినందుకు రాజ్ తరుణ్‌పై చర్యలు తీసుకోవాలనీ ఫిర్యాదులో పేర్కొన్న లావణ్య.
తనను చంపేస్తామని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసిన మాల్వితోపాటు ఆమె సోదరుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు.
ఎఫ్ఐఆర్లో ముగ్గురీ పేర్లను చేర్చిన నార్సింగ్ పోలీసులు.
ఐపీసీ 420,493,506 సెక్షన్ల కింద కేసు నమోదు.
-
2024-07-11T10:44:36+05:30
బిగ్ షాక్.. వల్లభనేని వంశీపై కేసు నమోదు..
గన్నవరం తెదేపా కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బిగ్ షాక్.
ఈ కేసులో నిందితుడిగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.
వంశీని 71 వ నిందితుడిగా పేర్కొంటూ న్యాయస్థానానికి నివేదిక ఇచ్చిన పోలీసులు.
అరెస్టుల భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన వైసీపీ నాయకులు.
-
2024-07-11T10:38:19+05:30
పాక్‌కు ఝలక్.. అక్కడికి వెళ్లబోమని తేల్చి చెప్పిన బీసీసీఐ..
2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్ వెళ్లే అవకాశం కనిపించడం లేదు. ఇందుకు బదులుగా.. దుబాయ్ లేదా శ్రీలంకలో మ్యాచ్‌లను నిర్వహించాలని ఐసీసీని బీసీసీఐ కోరుతోంది. ఈ మేరకు అధికార వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం అందుతోంది.
-
2024-07-11T10:33:42+05:30
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్
కేంద్ర మంత్రి బండి సంజయ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
స్వామి వారీ దయ, బిక్షతో కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగాను.
గత ఐదేళ్లలో స్వామి వారీపై భక్తి లేని వారు నామాలు పెట్టుకొని.. స్వామి వారీకీ, టీటీడీ ఆస్తులకు పంగనామాలు పెట్టారు.
టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారు.
ఇతర మతస్థులకు అధికారం అప్పగించి తిరుమలని అపవిత్రం చేశారు.
అక్రమ దందాలకు పాల్పడ్డారు.
ఎర్రచందనంని కొలగోట్టి.. వేల కోట్లను సంపాదించారు.
గత ఐదేళ్లు టీటీడీ పాలన వీరప్పన్ వారసుల చేతిలో సాగింది.
ఎర్రచందనం స్మగ్లర్ల పట్ల కఠినంగా వ్యవహారిస్తాం.
ఎర్రచందనంని కొల్లగొట్టిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం.
-
2024-07-11T10:27:55+05:30
Flash News: ‘విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయొద్దు’
కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని కలిసేందుకు స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బ్లాక్‌కి వచ్చిన బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు విష్ణుకుమార్ రాజు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవ్వకూడదు అని భావన అందరికీ ఉంది.
స్టీల్ ప్లాంట్ ఉద్యోగాలకు భద్రత కల్పించి ఎంతోమంది ప్రాణత్యోగాలు చేసి స్టీల్ ప్లాంట్ ను తీసుకొచ్చారు.
విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ బీజేపీ తరఫున ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ అవ్వకుండా మంచి భవిష్యత్తు స్టీల్ ప్లాంట్‌కి ఉండేటట్టు చూడవలసిందిగా మేము కూడా కోరాము.
ఎలక్షన్ ముందు కూడా కోరడం జరిగింది. ఎలక్షన్ తర్వాత మా పార్లమెంట్ సభ్యులు కేంద్ర అధిష్టానానికి చెప్పాము.
కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్, కేంద్రమంత్రి కుమారస్వామి ప్లాంట్ విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకుంటారని మా నమ్మకం.
స్టీల్ ప్లాంట్‌కి అనేక రకాల ఆప్షన్స్ ఉన్నాయి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని SAIL లో టేక్ ఓవర్ చేయడమా?
ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే.. మన భవిష్యత్తు బాగుంటుంది, ఉద్యోగస్తులకు ఇబ్బంది లేకుండా ఉండాలనేది అందరి అభిప్రాయం.