Share News

Breaking News: నేటి తాజా వార్తలు..

ABN , First Publish Date - Jul 17 , 2024 | 10:56 AM

Telugu Latest News Live Updates: ప్రపంచ నలుమూల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. మినిట్ టు మినిట్ తాజా వార్తలను ఇక సులభంగా తెలుసుకోవచ్చు. మీకోసమేు ప్రత్యేకంగా లైవ్ అప్‌డేట్స్ ప్లాట్‌ఫామ్.. సమస్త సమాచారం ఇక్కడే చూసేయండి.

Breaking News: నేటి తాజా వార్తలు..
Breaking News

Live News & Update

  • 2024-07-17T21:07:33+05:30

    మంత్రి నారా లోకేష్ ఓపెన్ ఆఫర్

    • అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడులపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్

    • కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన స్థానికులకు ఉద్యోగాల చట్టాన్ని ఉద్దేశించి ట్వీట్

    • ఆ చట్టంపై ఇన్వెస్టర్లు, వ్యాపారులు, నాస్కాం తదితర సంస్థల నుంచి అభ్యంతరాలు

    • నాస్కాం ట్వీట్ రీ ట్వీట్ చేస్తూ ఏపీలో పెట్టుబడులపై లోకేష్ ట్వీట్

    • ఇన్వెస్టర్ల ఆవేదన, అభ్యంతరాలు అర్థం చేసుకున్నా, ఏపీలో ఎలాంటి ఆంక్షలు, ఇబ్బందులు ఉండవని ఓపెన్ ఆఫర్

    • ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, డాటా సెంటర్స్, ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానం

    • ఏపీ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని ప్రకటన

    • ఉత్తమ పాలసీలు, మౌలిక సదుపాయాలు, నిరంతర విద్యుత్‌తో పెట్టుబడులకు అనుకూలం వాతావరణం కల్పిస్తాం

    • నిపుణులైన యువత, మానవ వనరులు ఏపీలో ఉన్నాయి.

  • 2024-07-17T17:08:42+05:30

    నరసాపురం ఎంపీడీవో ఆత్మహత్య?

    • నరసాపురం ఎంపీడీవో అదృశ్యం కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం.

    • ఏలూరు కాల్వలోకి వెంకటరమణ దూకినట్లు భావిస్తున్న పోలీసులు.

    • ఎంపీడీవో వెంకటరమణ మొబైల్ సిగ్నల్ ట్రాక్ చేసిన పోలీసులు.

    • విజయవాడ మధురానగర్ ఏలూరు కాల్వ వద్ద సిగ్నల్ కట్ అయినట్టు ఇప్పటికే గుర్తింపు.

    • సూసైడ్ చేసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులకు వాట్సాప్‍‌లో నోట్ పంపిన వెంకటరమణ.

    • మాజీ విప్ ప్రసాదరాజు ఇబ్బంది పెడుతున్నారని వాట్సాప్ నోట్‍‌లో వెంకటరమణ వెల్లడి.

    • బోటింగ్ కాంట్రాక్టర్‍‌ను బకాయి చెల్లించాలని అడిగితే బెదిరిస్తున్నారని సూసైడ్ నోట్.

    • విజయవాడలోని ఏలూరు కాల్వలో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.

    • కుటుంబ సభ్యుల ద్వారా బయటకు వచ్చిన లేఖ.

    • నిందితులు రూ.55 లక్షలు ఫెర్రీ లీజు బకాయిలు ఉన్నారు.

    • గత చీఫ్ విప్ ప్రసాదరాజు అండదండలతోనే నిందితులు డబ్బులు చెల్లించలేదు.

    • గత మూడున్నర నెలల నుంచి నిందితులు ఇబ్బంది పెడుతున్నారు.

    • నేను ఏ తప్పు చేయకపోయినా మానసిక క్షోభ అనుభవిస్తున్నా.

    • బకాయిలు రికవరీ చేయకపోవడం వల్ల నన్ను బాధ్యుడిని చేసే అవకాశం ఉంది.

    • నాకు ఉద్యోగమే జీవనాధారం.

    • నిందితులు బకాయి డబ్బు చెల్లించేలా చూసి నాకు న్యాయం చేయండి అంటూ లెటర్‌లో కోరిన నరసాపురం ఎంపీడీవో.

  • 2024-07-17T16:21:43+05:30

    రెచ్చిపోయిన వైసీపీ గుండాలు..

    • కృష్ణాజిల్లా మోపిదేవి మండలంలో రెచ్చిపోయిన వైసీపీ గుండాలు.

    • మోపిదేవి మండల తెలుగుదేశం పార్టీ నేత, కో ఆప్షన్ సభ్యుడు చందన రంగారావుపై హత్యాయత్నం.

    • అవనిగడ్డ నుంచి స్వగ్రామానికి వెళుతున్న క్రమంలో కరకట్టపై దారి కాసి గొడ్డలితో దాడికి పాల్పడిన దుండగులు.

    • వైసీపీకి చెందిన మత్తి రాంప్రసాద్, అతని కుమారుడు శ్రీనివాసరావులు దాడికి పాల్పడ్డాడు అంటున్న చందన రంగారావు.

    • కరకట్టపై పడి ఉన్న రంగారావును అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు.

    • శ్రీనివాసరావు తలకు, కాలిపై తీవ్ర గాయాలు.

    • పోలీసుల వైఫల్యం కారణంగానే వైసీపీ గుండాలు రెచ్చిపోతున్నారని ఆరోపిస్తున్న తెలుగుదేశం నేతలు కొల్లూరి వెంకటేశ్వరరావు, రావి రత్నగిరి.

  • 2024-07-17T14:58:29+05:30

    రాజకీయ ప్రతీకార, కక్ష సాధింపులకు ఓ పరిమితి ఉంటుంది: కేటీఆర్

    ktr-twitter.jpg

    • రాజకీయ ప్రతీకార, కక్ష సాధింపులకు ఓ పరిమితి ఉంటుంది.

    • కేసీఆర్‌ని బద్నాం చేయాలన్న ప్రయత్నాలకు సుప్రీంకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చింది.

    • దుష్ర్పచారాలు చేస్తున్న కాంగ్రెస్‌కు ప్రజాక్షేత్రంలోనూ సరైన గుణపాఠం ఖాయం

    • కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాలన గాలికి వదిలేసి రాజకీయ కక్షలపైనే ఎక్కువ దృష్టి పెట్టింది.

    • పరిమితులను దాటి కాంగ్రెస్ కేసీఆర్ మీద దుష్ప్రచారాలకు పూనుకుంది.

    • ఇలాంటి ప్రయత్నాలు ఎక్కువ కాలం నిలబడవని సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు స్పష్టం చేసింది.

    • విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి కేసీఆర్‌ని బద్నాం చేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని సుప్రీం తప్పు బట్టింది.

    • కాంగ్రెస్ అధికార దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చింది.

    • ఇప్పటికైనా బుద్ది తెచ్చుకొని ఇలాంటి ప్రతీకార రాజకీయాలకు స్వస్తి పలికి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి.

  • 2024-07-17T14:55:20+05:30

    ఎంపీడీఓ అదృశ్యం.. ఎమ్మెల్యే ఆందోళన..

    • ప.గో. జిల్లా: నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు అదృశ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్.

    • నరసాపురం మాదవాయిపాలెం రేవుపాట వ్యవహారమే కారణం.

    • ఎంపీడీఓ క్షేమంగా ఉండాలని కోరుకుంతున్నాం.

    • అవాంచనీయ సంఘటనలు జరిగితే రేవు పాటదారుడు చినరెడ్డప్ప ధవేజీ, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, జేఏసి సభ్యులు పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

    • ఎంపీడీఓ కుటుంబానికి అండగా ఉంటాం.

    • సమస్య ను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్తాను.

    • జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్.

  • 2024-07-17T14:51:56+05:30

    సుప్రీంకోర్టు తీర్పుతో నరసింహారెడ్డి ఫ్రస్టేషన్‌లో ఉన్నారు..

    • విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్‌గా నరసింహారెడ్డిని సుప్రీంకోర్టు తప్పించడాన్ని స్వాగతిస్తున్నాం: బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్

    • సుప్రీంకోర్టు తీర్పుతో నరసింహారెడ్డి ఫ్రస్టేషన్‌లో ఉన్నారు.

    • విచారణ కమిషన్లు రాజకీయ బూటకపు కమిషన్లు.

    • అసదుద్దీన్ ఓవైసీకి కేసీఆర్ జవాబుదారీ కాదు.

    • అసదుద్దీన్ వ్యాఖ్యలను సీరియన్‌గా తీసుకోవద్దు.

    • మేం బీజేపీతో ములాఖత్ అయితే కవిత జైలుకు ఎందుకు వెళ్తారు?

    • కవిత అరెస్టును ఇండియా కూటమిలో ప్రాంతీయ పార్టీలు ఖండించాయి.

  • 2024-07-17T13:43:15+05:30

    ముగిసిన ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన.

    • నిన్న రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చ.

    • ఈ ఉదయం సీఎం అధికారిక నివాసం(1, జన్‌పథ్)లో పూజలు.

    • అనంతరం విజయవాడ తిరుగుప్రయాణమైన బాబు.

    • ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి అమిత్ షాకు వివరించిన సీఎం.

    • గత ఐదేళ్లలో రాష్ట్రం ఆర్థిక విధ్వంసానికి గురైందని వెల్లడి.

    • అస్తవ్యస్థ నిర్వహణ, అవినీతి కారణంగా ఆర్థిక వ్యవస్థ గాడితప్పిందన్న బాబు.

    • ప్రజలు ఏపీలో ఎన్డీఏకు అనుకూలంగా తీర్పునిచ్చారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్రాన్ని గాడిలో పెడతామని ట్వీట్.

    • పర్యటనలో సీఎంతో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్ర మంత్రులు కే. రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, కేశినేని చిన్ని తదితరులు.

    • 1, జన్‌పథ్ నివాసంలో చంద్రబాబును కలిసిన బీజేపీ ఎంపీ సీఎం రమేశ్.

    • పర్యటన ముగించుకుని విజయవాడ బయల్దేరిన సీఎం.

  • 2024-07-17T13:18:15+05:30

    షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి: నిరంజన్ రెడ్డి

    • షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.

    • రైతుల సంఖ్యను కుదించేందుకే రుణమాఫీ మార్గదర్శకాలు.

    • లోపభూయిష్టంగా రుణమాఫీపై ప్రభుత్వ ఉత్తర్వులు.

    • 11 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తాం అంటున్నారు.

    • మిగిలిన 49 లక్షల మంది రైతుల పరిస్థితి ఏంటి..?

    • రైతుల గుర్తింపునకే రేషన్ కార్డు అంటున్నారు.

    • మరి రేషన్ కార్డులేని రైతుల పరిస్థితి ఏంటి..?

    • కనీసం ఐదెకరాల వరకు ఉన్న రైతులకన్నా రైతుభరోసా ఇవ్వండి.

    • రుణమాఫీకి పట్టదారు పాస్ బుక్కును ప్రామాణికంగా తీసుకుంటే రైతుభరోసాకు కూడా దానినే ప్రామాణికంగా తీసుకుని ఇవ్వాలి.

    • రైతుభరోసా ఎగ్గొట్టి రుణమాఫీకి నిధులు మళ్లిస్తున్నారు.

  • 2024-07-17T13:02:38+05:30

    అమరావతి, పోలవరం పూర్తి చేయాలి: సీపీఐ రామకృష్ణ

    • గుంటూరు: భూ హక్కు చట్టం రద్దును స్వాగతిస్తున్నాం: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ

    • గత ప్రభుత్వం మొండి వైఖరితో చట్టాన్ని తెచ్చింది.

    • ఉచిత ఇసుక వల్ల స్థానిక నాయకులు, మంత్రులు జ్యోక్యం చేసుకుని చెడ్డ పేరు తెచుకోవద్దు.

    • వైజాగ్ భీమిలిలో ఎర్రమట్టి దిబ్బల కాపాడేందుకు చర్యలు తీసుకోవాలి.

    • వైసీపీ పాలనలో 1.75 లక్షల భూములు అన్యాక్రాంతం అయ్యాయి.

    • కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఢిల్లీ ప్రయాణం మంచిదే.

    • జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది.

    • రాష్ట్రాన్ని ఆర్థిక అధోగతిని నుంచి బయటపడేయాలి.

    • రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం సీఎం కేంద్రంపై ఒత్తిడి చెయ్యాలి.

    • బీహార్ సీఎం ప్రత్యేక హోదా కోరుతున్నారు.

    • విభజన హామీ అమలు, ప్రత్యేక హోదా అమలు కావాల్సిన అవసరం ఉంది.

    • నిధులు లేకుంటే రాష్ట్రంలో ప్రాజెక్ట్‌లు, రోడ్లు ఎలా కడతారు.

    • పోలవరంలో అవకతవకలు జరిగితే సరిదిద్ధి ప్రాజెక్ట్ పూర్తి చేయండి.

    • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి నిర్వాసితులకు న్యాయం జరిగేలా చేస్తాం.

    • అమరావతితో పాటు పోలవరం కూడా పూర్తి చెయ్యాలి.

  • 2024-07-17T12:53:55+05:30

    సర్దార్ 2 సీక్వెల్ షూటింగ్‌లో ప్రమాదం

    చెన్నై: సర్దార్ సినిమాలో ఓ యాక్షన్ సీన్ చిత్రీకరణ సమయంలో స్టంట్ మ్యాన్ ఎళుమలై 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. విరుగంబాక్కం పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. స్టంట్ సమయంలో భద్రతా లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

  • 2024-07-17T12:29:26+05:30

    నాగార్జున సాగర్ కుడికాలువకు నీటి విడుదల

    Nagarjuna-Sagar.jpg

    • పల్నాడు: నాగార్జున సాగర్ కుడికాలువకు నీటి విడుదల.

    • త్రాగునీటి అవసరాల కోసం 2 వేల క్యూసెక్కుల నీరు విడుదల.

    • 5,7 గేట్లు ద్వారా కుడి కాలువ కు నీటి విడుదల చేసిన ఇరిగేషన్ ఈఈ శ్రీహరి.

    • రోజుకు 5,500 క్యూసెక్కుల చొప్పున 9 రోజుల పాటు 4.5 టీఎంసీల నీటిని కుడి కాలువ ద్వారా విడుదల.

    • పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలకు ఈ నీటిని వాడుకోవాలని విజ్ఞప్తి.

  • 2024-07-17T12:13:38+05:30

    జగన్‌పై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు

    • విశాఖ: మళ్లీ అధికారంలోకి రావాలనే జగన్ కల కలగానే ఉండిపోతుంది.

    • వచ్చే ఆరు నెలల్లో జగన్ ఎక్కడ ఉంటారో.. ఆయనకే తెలియదు.

    • జగన్ తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు.

    • ఒక్క స్కూలు కూడా కట్టలేదు.

    • ప్రజలకి జగన్‌కి మధ్య గ్యాప్ ఎక్కువ ఉండటం వల్ల వైసీపీ ఘోరంగా ఓడిపోయింది.

    • ఒక్క ఛాన్స్ అనడంతోనే 2019లో గెలిపించారు.

    • ఇక జగన్‌కి మళ్లీ చాన్స్ ఇవ్వకూడదు అనుకున్నారు.

    • కర్ణాటకలో ఆస్తులు ఉన్నాయి కాబట్టే.. అక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలతో జగన్ సమావేశం అయ్యారేమో?

    • కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అవసరం లేదు.

    • ఆ పార్టీ నేతలు మంచి వారు వస్తే స్వాగతిస్తాం.

    • వచ్చే ఎన్నికల్లో కేంద్రంలోని రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.

  • 2024-07-17T11:57:02+05:30

    రాయదుర్గం పోలీసులను ఆశ్రయించిన సంద్య శ్రీధర్ రావు

    • సంద్య కన్‌స్ట్రక్షన్‌లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న కొమ్మారెడ్డి ఠాగూర్, మలికిరెడ్డి విష్ణు వర్ధన్ రెడ్డి కలిసి తనను మోసం చేశారంటూ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంద్య శ్రీధర్ రావు.

    • రాయదుర్గంలో ఉన్న సంద్య టెక్నో 1 కమర్షియల్ భవనంలో 2021 లో ఒక అంతస్తు కొనుగోలు చేసిన మాలికి రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి.

    • ఇప్పుడు మొత్తం భవనం కొన్నట్టు తప్పుడు పత్రాలు సృష్టించారన్న సంద్య శ్రీధర్ రావు.

    • తన కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న కొమ్మారెడ్డి ఠాగూర్.. విష్ణు వర్ధన్ రెడ్డితో చేతులు కలిపి తనను మోసం చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్న సంద్య శ్రీధర్ రావు.

    • కొమ్మారెడ్డి ఠాగూర్, మాలికి రెడ్డి విష్ణు వర్ధన్ రెడ్డి, మాలికి రెడ్డి వీరభద్ర రెడ్డి, CA దాట్ల రామరాజు, హరీష్, గణేష్, ఈశ్వర్, వెంకట్‌లపై కేసులు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు.

    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రాయదుర్గం పోలీసులు.

  • 2024-07-17T11:53:26+05:30

    పొలాల్లో ఇరువర్గాలు ఘర్షణ

    • కడప: బద్వేల్ గోపవరం మండలం మడకలవారిపల్లి గ్రామ పొలాల్లో ఇరువర్గాలు ఘర్షణ.

    • రెండు వర్గాలు పరస్పరం రాళ్ల దాడులు.

    • సర్వేనెంబర్ 1622, 1623 నెంబర్లలో గతంలో గుడిసెల నిర్మా ణం చేపట్టిన రైతు సంఘనాయ కులు.

    • శ్రీనివాసపురం వాసులకు ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసిందని పట్టాదారుల వాదన.

    • నిన్న అర్ధరాత్రి గుడిసెలకు నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు.

    • ఈ రోజు శ్రీనివాసపురం గ్రామస్తులకు, రైతు సంఘం నాయకులకు మధ్య తీవ్రఘర్షణ.

    • రంగ ప్రవేశం చేసిన పోలీసులు.

    • ఇరువర్గాలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలింపు.

  • 2024-07-17T11:14:20+05:30

    జూబ్లీహిల్స్‌ పోలీసుల కస్టడీకి రాధాకిషన్‌రావు

    Radha-Kishan-Rao.jpg

    • హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ పోలీసుల కస్టడీకి రాధాకిషన్‌రావు.

    • రెండు రోజుల కస్టడీకి అనుమతించిన నాంపల్లికోర్టు.

    • ఫోన్ ట్యాపింగ్‌ కేసులో చంచల్‌గూడ జైల్లో ఉన్న రాధాకిషన్‌రావు.

    • టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుపై జూబ్లీహిల్స్​పీఎస్‌లో మరో కేసు.

    • నాంపల్లి కోర్టులో పీటీ వారెంట్‌పై రిమాండ్ చేసిన పోలీసులు.

    • యజమానిని కిడ్నాప్‌ చేసి క్రియా హెల్త్‌ కేర్‌ సంస్థలో కోట్ల విలువైన షేర్లను.

    • నలుగురు డైరెక్టర్ల మీదకు బలవంతంగా బదిలీ చేయించారని ఫిర్యాదు.

    • సంస్థ వ్యవస్థాపకుడు చెన్నుపాటి వేణుమాధవ్‌ ఫిర్యాదుతో కేసునమోదు.

    • రాధాకిషన్‌రావుతో పాటు మరో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు సహా.. చంద్రశేఖర్‌, కృష్ణ, గోపాల్, రాజ్, రవి, బాలాజీలపై కేసు నమోదు.

    • పరారీలో ఉన్న నిందితుల కోసం లుక్ అవుట్ నోటీస్ జారీ చేసిన పోలీసులు.

  • 2024-07-17T11:02:09+05:30

    ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ ఏర్పాట్లలో గందరగోళం

    Lord-Ganesh.jpg

    • హైదరాబాద్: ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ ఏర్పాట్లలో గందరగోళం.

    • 70 ఏళ్ల ఖైరతాబాద్ గణేశ్ చరిత్రలో తొలిసారిగా అవాంతరాలు.

    • ముందుకు సాగని ఖైరతాబాద్ గణేష్ విగ్రహ తయారీ పనులు.

    • ఏటా వందరోజుల ముందు నుంచే ఖైరతాబాద్ గణేష్ విగ్రహ తయారీ.

    • రెండు వర్గాలుగా విడిపోయిన ఉత్సవ కమిటీ.

    • వర్గపోరుతో పాత కమిటీ, కొత్త కమిటీ మధ్య కొరవడిన సమన్వయం.

    • 36రోజుల పాటు నిలిచిపోయిన విగ్రహ పనులు.

    • సమాచారం ఇవ్వకుండానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొత్త కమిటీపై ఉత్సవ ప్రెసిడెంట్ రాజ్‌కుమార్‌ ఆరోపణలు.

    • కమిటీ ఛైర్మన్‌ సుదర్శన్ తర్వాత గతేడాది ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు నిర్వహించిన సుదర్శన్ కుమారుడు రాజ్‌కుమార్‌.

    • ఈసారి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలను సింగారి కుటుంబం కాకుండా తామే నిర్వహిస్తామంటున్న స్థానికులు.

  • 2024-07-17T10:51:19+05:30

    ప్రారంభమైన రొట్టెల పండుగ..

    Rottela-Panduga.jpg

    • నెల్లూరు బారా షహీద్ దర్గా దగ్గర వద్ద ప్రారంభమైన రొట్టెల పండుగ.

    • దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో తరలివస్తున్న భక్తులు.

    • స్వర్ణాల చెరువు వద్ద రొట్టెలు ఇచ్చిపుచ్చుకుంటున్న భక్తులు.

    • రొట్టెల పండుగని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.

    • 2వేల మంది పోలీసులతో బందోబస్తు.

    • రొట్టెల పండుగకి భారీ ఏర్పాట్లు.

    • స్వయంగా పర్యవేక్షిస్తున్న మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

    • ఇవాళ రాత్రి గంధమహోత్సవానికి ఏర్పాట్లు.

  • 2024-07-17T09:54:10+05:30

    రేపు మరో శ్వేతపత్రం విడుదల

    • అమరావతి: రేపు మరో శ్వేతపత్రం విడుదల

    • రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై శ్వేతపత్రం

    • రేపు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు

  • 2024-07-17T08:13:40+05:30

    లోకేశ్ కేసులపై రీ ఇన్వెస్టిగేషన్..!

    • ప.గో: భీమవరంలో నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కేసులపై రీ ఇన్వెస్టిగేషన్..!

    • ఏ విధంగా కేసు ఇన్వెస్టిగేషన్ చేశారనే అంశం పరిశీలిస్తాం: జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి

    • రెండు రోజుల్లో అవసరమైన కేసులను పరిశీలిస్తాం..రౌడీ షీట్స్‌పై ప్రత్యేక దృష్టిసారిస్తాం.

    • గల్ఫ్ బాధితులు గురించి కలెక్టర్‌తో మాట్లాడాం, నకిలీ ఏజెంట్స్‌పై చర్యలు తీసుకుంటాం.

    • గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న వారికి సహకారం అందిస్తాం.