-
-
Home » Mukhyaamshalu » Breaking News November 18th Saturday Latest Telugu News Live Updates Siva
-
Breaking News: లగచర్ల ఘటనలో డిఎస్పీపై చర్యలు
ABN , First Publish Date - Nov 18 , 2024 | 10:36 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
Live News & Update
-
2024-11-18T20:24:25+05:30
వైభవంగా ఉరుసు ఉత్సవాలు
దేశంలోనే ప్రసిద్ధి సూఫీ ఆధ్యాత్మిక కేంద్రమైన కడప పెద్దదర్గాలో వై భవంగా ఉరుసు ఉత్సవాలు..
పెద్దదర్గా ముషాయిరాగజల్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నసినీ నటుడు రామ్ చరణ్
కడప ఎయిర్ ఫోర్ట్ నుంచి ర్యాలీ గా వచ్చిపెద్దదర్గా చేరుకున్న హీరో రామ్ చరణ్
దర్గా సాంప్రదాయాల ప్రకారం స్వాగతం పలికిన పీఠాధిపతి ఆరీఫ్ హుస్సేన్, ఇతర మత పెద్దలు
-
2024-11-18T19:06:08+05:30
రైతులను కలిసిన జాతీయ ఎస్టీ కమిషన్ బృందం
లగచర్ల ఘటనలో అరెస్టై సంగారెడ్డి సెంట్రల్ జైలులో ఉన్న రైతులను కలిసిన జాతీయ ఎస్టీ కమిషన్ బృందం
కేసు పూర్వపరాలు అడిగి తెలుసుకున్న కమిషన్ సభ్యులు
-
2024-11-18T18:24:03+05:30
డిఎస్పీపై చర్యలు..
లగచర్ల ఘటనలో డిఎస్పీపై చర్యలు
కలెక్టర్ పై దాడి ఘటన నేపథ్యంలో డిఎస్పీపై బదిలీ వేటు
పరిగి డిఎస్పీ కరుణసాగర్ రెడ్డిని డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
ఆయన స్థానంలో అదనపు డీఎస్పీగా విధుల్లో ఉన్న శ్రీనివాస్‌కు పూర్తి బాధ్యతలు
-
2024-11-18T17:18:47+05:30
పాడి రైతులకు గుడ్ న్యూస్
కృష్ణా మిల్క్ యూనియన్ పాలకమండలి సమావేశం
నాలుగు నెలలకు సంబంధించి రెండో విడత బోనస్ రూ.12కోట్లు మంగళవారం విడుదల చేస్తామని ప్రకటన
రైతు నుంచి ప్రతిరోజూ పాలు తీసుకుంటుండటంతో రూ.820 ఇవ్వాలని నిర్ణయం
ఆవు పాల ధర లీటర్‌కు రూ. 1.55 పైసలు పెంపు
ఎటువంటి సంక్షోభాలు వచ్చినా కృష్ణా మిల్క్ యూనియన్ రైతులకు సాయం చేయడంలో ముందే ఉంటుందన్న పాలకమండలి
అందరూ కలిసి పని చేస్తే ఆర్ధిక పురోగతి సాధిస్తారనేది సీఎం చంద్రబాబు ఆలోచనగా పేర్కొన్న పాలకమండలి
గ్రామాల్లోని యువతకు డైరీ ఫాంలపై ఆసక్తి పెంచేలా ప్రోత్సహకాలు
భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు లేకుండా రైతుకు అన్ని విధాలా అండగా ఉంటామని ప్రకటన
కుట్రదారులపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్న పాలకమండలి
-
2024-11-18T16:33:10+05:30
ఆశా వర్కర్ల ధర్నా
తమ సమస్యలను పరిష్కరించాలంటూ విజయవాడలో ఆశా వర్కర్ల ధర్నా..
ధర్నాలో పాల్గొన్న కార్మిక, వామపక్ష సంఘాల నేతలు
ఆశావర్కర్ల వేతనాలు పెంచుతామని, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారంటున్న కార్మికులు
ఐదు నెలలు దాటినా ఒక్క హామీ అమలు చేయలేదని ధర్నా
ఆర్ధిక ఇబ్బందుల పేరుతో తమను ఇబ్బంది పెట్టడం సరికాదన్న కార్మికులు
-
2024-11-18T16:21:32+05:30
తిరుమల భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు
సామాన్య భక్తులకు రెండు, మూడు గంటల్లో దర్శనం కల్పించేందుకు నిర్ణయం
టీటీడీలో పని చేస్తున్న అన్యమతస్థ ఉద్యోగుస్థలను విఆర్ఎస్ లేదా ప్రభుత్వ శాఖల్లోకి బదిలీ చెయ్యాలని నిర్ణయం
డంపింగ్ యార్డ్‌లోని చెత్తను మూడు నెలల్లో క్లియర్ చెయ్యాలని నిర్ణయం
శ్రీనివాససేతు పేరు గరుడ వారధిగా మార్పు
అలిపిరిలో దేవలోక్‌కు కేటాయించిన 20ఎకరాల భూమిని టీటీడీకి అప్పగించే విధంగా ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయం
తిరుమలలో రాజకీయాలు మాట్లాడటం పై నిషేధం.. నిబంధనలను అతిక్రమిస్తే కేసులు
స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం
శ్రీవాణి ట్రస్టు రద్దు చేసి టికెట్ల విక్రయం ద్వారా వచ్చే సొమ్ముని టీటీడీ అకౌంట్‌లోనే జమ చెయ్యాలని నిర్ణయం
ప్రైవేట్ బ్యాంకులోని డిపాజిట్‌లు ప్రభుత్వ బ్యాంకుల్లో జమ చెయ్యాలని నిర్ణయం
అన్నదానంలో నూతనంగా మరో ఐటమ్‌ని వడ్డించాలని నిర్ణయం
శ్రీవారి ప్రసాదాల్లో నాణ్యమైన నెయ్యి వినియోగించేందుకు కమిటీ ఏర్పాటు
టీటీడీ ఉద్యోగులకు ఇస్తున్న బ్రహ్మోత్సవ బహుమానం రూ. 14వేల నుంచి రూ.15,400కు పెంపు
శారద పీఠానికి కేటాయించిన భూములు రద్దు
బిల్డింగ్ కూల్చి వెయ్యాలని నిర్ణయం..
టూరిజం శాఖకు కేటాయిస్తున్న 4వేల ఎస్ఈడి టిక్కెట్లు రద్దు
-
2024-11-18T14:56:26+05:30
ఏపీ శాసన మండలి రేపటికి వాయిదా..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మంగళవారానికి వాయిదా పడింది.
సోమవారం జరిగిన సమావేశాల్లో పలు అంశాలపై వాడి వేడిగా చర్చ జరిగింది.
శాసనమండలిలో వైసీపీ సభ్యులు రెండుసార్లు వాకౌట్ చేశారు.
-
2024-11-18T11:59:22+05:30
శాసనమండలిలో రచ్చ.. వైసీపీ వాకౌట్..
అమరావతి: శాసన మండలిలో వైసిపి మరొకసారి వాకౌట్
విద్యుత్ ఛార్జీల సవరణ బిల్లును ప్రవేశ పెట్టిన మంత్రి గొట్టిపాటి రవికుమార్.
బిల్లు వ్యతిరేకించిన పిడిఎఫ్.
విద్యుత్ ఛార్జీలు పెంచమని అధికారంలోకి వచ్చి ట్రూ అప్ ఛార్జీల విధించడాన్ని వ్యతిరేకంగా వాకౌట్ చేసిన వైసిపి.
-
2024-11-18T11:26:59+05:30
రాంగోపాల్ వర్మకు హైకోర్టు షాక్..
అమరావతి: సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు హైకోర్టులో చుక్కెదురు.
రాంగోపాల్ వర్మ తనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయలని హైకోర్టులో పిటిషన్.
హైకోర్ట్‌లో పిటిషన్‌పై విచారణ.
ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ.
అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ వర్మ తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను తోసిపుచ్చిన న్యాయస్థానం.
అరెస్టుపై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని స్పష్టీకరణ.
రేపు విచారణ హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారన్న పిటిషన్ తరపు న్యాయవాది.
హాజరు అయ్యేందుకు మరికొంత సమయాన్ని ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని వర్మ తరపు న్యాయవాది అభ్యర్థన.
సమయం పొడిగించాలనే అభ్యర్థనను పోలీసులు ముందు చేసుకోవాలని సూచించిన హైకోర్టు.
ఇటువంటి అభ్యర్థన కోర్ట్ ముందు కాదని న్యాయ మూర్తి స్పష్టీకరణ.
సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరి చేలా పోస్టులు పెట్టిన రాంగోపాల్ వర్మ.
అభ్యంతరకర పోస్ట్‌లు వర్మ పెట్టారని తెదేపా మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం పిర్యాదు ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు.
-
2024-11-18T10:57:23+05:30
ఏపీ శాసనమండలిలో హైఓల్టేజ్ డిస్కషన్..
అమరావతి: శాసన మండలిలో మహిళలపై అత్యాచారాలపై వాడివేడి చర్చ.
ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల మధ్య మొదలైన వాగ్వివాదం.
రాష్ట్రంలో గత ప్రభుత్వం కంటే ఈ ఐదు నెలల్లో క్రైమ్ రేటు తగ్గిందన్న మంత్రి అనిత.
మహిళలపై దాడులు, హత్యలు, అత్యారాలు పెరిగిపోయాయన్న వరుదు కల్యాణి.
దిశ చట్టం తీసుకొస్తారా, దిశ యాప్ కొనసాగిస్తారా లేదా అని ప్రశ్నించిన కల్పలతా రెడ్డి.
సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ గత ప్రభుత్వ పాలనలో అనేక లోపాలున్నాయన్న మంత్రి.
దిశ చట్టం లేదు. నిర్భయ చట్టం ఉంది. నిర్భయ కింద కేసులు నమోదు చేయలేదు.
కేంద్రం నిధులిచ్చనా అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్మించలేదు.
గంజాయి వినియోగం పెరిగే నేరాలు పెరిగాయన్న మంత్రి అనిత.
హోం మంత్రి అనిత వ్యాఖ్యలను అడ్డుకున్న వైసిపి సభ్యులు.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందంటూ వైసిపి వినాదాలు.
లా అండ్ ఆర్డర్ ఫెయిల్ కారణంతోనే నీలాంటి వాళ్ళు సభకు వస్తున్నారని దువ్వాడను ఉద్దేశించి అన్న మంత్రి.
సమాధానం వినటానికి దమ్ము ధైర్యం కావాలన్న మంత్రి.
మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా వాకౌట్ చేసిన వైసిపి సభ్యులు.
తర్వాత ప్రశ్నకు సభలోకి వచ్చిన వైసిపి సభ్యులు.
-
2024-11-18T10:36:05+05:30
అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ షాక్..
ఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) వీడిన కైలాష్ గెహ్లాట్ బీజేపీలో చేరే అవకాశం.
మధ్యాహ్నం గం. 12.30కు బీజేపీలో చేరనున్నట్టు సమాచారం.
ఆదివారం నాడు మంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేసిన కైలాష్ గెహ్లాట్.
పంద్రాగస్ట్ వేడుకల విషయంలో గెహ్లాట్-కేజ్రీవాల్ మధ్య పెరిగిన స్పర్థలు, విబేధాలు.