-
-
Home » Mukhyaamshalu » Breaking News October 24th Thursday Today Latest Telugu News Live Updates Shiva
-
Breaking News: నేటి తాజా వార్తలు..
ABN , First Publish Date - Oct 24 , 2024 | 01:37 PM
Breaking News Live Updates: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
2024-10-24T16:51:06+05:30
ఢిల్లీ: పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ పై ప్రభావం పడకుండా కొత్త లైన్ అలైన్‌మెంట్
పరిటాల వద్ద మల్టీ మోడల్ కార్గో హబ్ ఏర్పాటు చేస్తాం
రాజమండ్రి స్టేషన్‌తోపాటు మొత్తం 73 రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణం జరుగుతుంది
అమరావతి కనెక్టివిటీ లైన్ సెమీ హైస్పీడ్ లైన్ నిర్మిస్తాం
ఇది సింగిల్ లైన్.. ట్రాఫిక్‌ను బట్టి భవిష్యత్తులో మరో లైన్ నిర్మిస్తాం: కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్
-
2024-10-24T16:48:50+05:30
ఐటీ మ్యాన్ చంద్రబాబు
ఢిల్లీ: రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఐటీ మంత్రిగా నిరూపించుకున్నారు..
అందుకే వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.
ఒరిజినల్ ఐటీ మ్యాన్ చంద్రబాబు నాయుడు: కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్
-
2024-10-24T16:33:50+05:30
అమరావతికి రైల్వే లైన్
ఢిల్లీ: చారిత్రాత్మక రోజు, ఏపీ ప్రజల కల నిజమవుతున్న రోజు: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఏపీ ప్రజలు ముగ్గురిపై నమ్మకం పెట్టుకున్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ ఈ రోజు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది
అభివృద్ధికి కనెక్టివిటీ అత్యంత కీలకమైన అంశం
ఇది ఏపీలో ప్రయాణ, రవాణా సదుపాయాలను మరింత పెరుగుపరుస్తుంది
10 రోజుల్లోగా ఈ ప్రాజెక్టును క్యాబినెట్ ముందుకు తీసుకొచ్చిన అశ్విని వైష్ణవ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు
గత ఐదేళ్లలో రాష్ట్రం ఎదుర్కొన్న సంక్షోభానికి ఈ తరహా నిర్ణయాలు అవసరం
ప్రాజెక్టు నిర్ణీత సమయంలో పూర్తవుతుందని భావిస్తున్నా
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్‌లో ఏపీకి 15 వేలు కోట్లు కేటాయించారు
-
2024-10-24T16:29:42+05:30
అమరావతి రైల్వే లైన్ రాష్ట్రానికి బూస్టింగ్: పవన్ కల్యాణ్
ఢిల్లీ: అమరావతి రైల్వే లైన్‌కు కేంద్రం ఆమోదం
ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి బిగ్ బూస్ట్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
అమరావతి అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది
ప్రధాని మోదీ అమరావతి శంకుస్థాపనకు వచ్చారు
50 ఏళ్ల విలువైన సమయం వృధా అయింది
వీలైనంత త్వరగా ఈ రైల్వే ప్రాజెక్టు పూర్తి చేయాలి
ఈ ప్రాజెక్టు వల్ల కర్బన ఉద్గారాలను తగ్గించడం అభినందించదగిన విషయం
అమరావతి కనెక్టివిటీ ద్వారా ఉత్తర, దక్షిణ భారత దేశాల మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది
-
2024-10-24T16:21:49+05:30
ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు
అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం
కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసిన ఏపీ సీఎం చంద్రబాబు
రైల్వే లైన్ నిర్మాణంతో ఇతర మెట్రో నగరాలతో అమరావతి అనుసంధానం అవుతుంది: ఏపీ సీఎం చంద్రబాబు
-
2024-10-24T16:18:06+05:30
అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
57 కిలోమీటర్ల పొడవు గల కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి అంగీకారం
రూ.2,245 కోట్లతో రైల్వే లైన్ నిర్మాణం
-
2024-10-24T15:20:27+05:30
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం
అమరావతి: అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
57 కిలోమీటర్ల పొడవున కొత్త రైల్వే లైన్ నిర్మాణం
రూ.2,245 కోట్లతో రైల్వే లైన్
ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు కొత్త లైన్
-
2024-10-24T13:39:39+05:30
బాబోయ్ దొంగలు.. 80 తులాల బంగారం, వజ్రాల నగలు చోరీ..
కడప : నగరంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో భారీ చోరి..
80 తులాలు బంగారు, వజ్రాల నగలు, నగదు చోరి.
సిసి కెమెరాతో పాటు డీవిఆర్ కూడా ఎత్తున దొంగలు.
ఇంటికి తాళంవేసి హైదరాబాద్‌కు వెళ్లిన ఇంటి యజమాని.
ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చిన బాధితుల బంధువులు.
చోరి జరిగిన ఇంటిని పరిశీలించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.
-
2024-10-24T13:37:25+05:30
పార్టీ ఫిరాయింపుల కేసుపై హైకోర్టులో కీలక పరిణామం..
పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసు విచారణ నవంబర్ 4వ తేదీకి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు.
సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన అసెంబ్లీ సెక్రెటరీ.
నెల రోజుల్లో షెడ్యూల్ ఖరారు చేయాలని సింగిల్ బెంచ్ తీర్పు.
వాదనలు వినిపించేందుకు గడువు కోరిన అడ్వకేట్ జనరల్.