Share News

Breaking News: నేటి తాజా వార్తలు..

ABN , First Publish Date - Sep 09 , 2024 | 10:47 AM

Breaking News Live Updates: ప్రపంచ నలుమూల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Breaking News: నేటి తాజా వార్తలు..
Breaking News

Live News & Update

  • 2024-09-09T21:45:19+05:30

    జీఎస్టీ కౌన్సిల్‌లో ఏపీ 8 కీలక ప్రతిపాదనలు

    • జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఏపీ తరపున ..

    • కీలక ప్రతిపాదనలు చేసిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్

    • మొత్తం 8 అంశాలపై జీఎస్టీ కౌన్సిల్ ఎదుట ప్రతిపాదనలు

    • పేదలకు ఊరటనిచ్చేలా, కొన్ని కీలక రంగాలకు ప్రొత్సహం ఇచ్చేలా..

    • వివిధ అంశాల్లో జీఎస్టీ వెసులుబాట్లు కోరుతూ పయ్యావుల ప్రతిపాదనలు

    • ఏపీకి లబ్ది చేకూరేలా కొన్ని అంశాలపై జీఎస్టీ మినహాయింపులను కోరిన పయ్యావుల

    • వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని ఏపీలో నిర్వహించాలని..

    • జీఎస్టీ కౌన్సిల్ నిర్వాహాకులకు ఏపీ ఆర్థిక మంత్రి ఆహ్వానం

    GST-Counsil-Payyavula-Kesha.jpg

    ఆ 8 ప్రతిపాదనలు ఇవే..

    • ఏపీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కార్పోరేషన్ సేవలపై ఉన్న జీఎస్టీని మినహాయించాలి

    • మద్యం తయారీలో వినియోగించే ఎక్సట్రా న్యూట్రల్ ఆల్కహాల్‌ను జీఎస్టీ నుంచి మినహాయించి వ్యాట్ పరిధిలోకి తేవాలి

    • జీవిత, ఆరోగ్య బీమాలపై 15 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలి

    • వృద్ధులు, మానసిక వికలాంగులకు జీవిత, ఆరోగ్య బీమాలపై ఉన్న జీఎస్టీ పన్నును మినహాయించాలి

    • ఆరోగ్య, జీవిత బీమాలపై జీఎస్టీలో వెసులుబాటు కల్పిస్తే సామాన్య ప్రజలకు భారం తగ్గుతుంది

    • ఎలక్ట్రిక్ వాహానాల విడి భాగాలపై ప్రస్తుతం 18 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి కుదించాలి.

    • ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల పైనా జీఎస్టీని తగ్గించాలి

    • ఈవీ రంగానికి జీఎస్టీ నుంచి వెసులుబాట్లు కల్పిస్తే పర్యావరణహిత సమాజం ఏర్పడడానికి మరింత ఊతమిచ్చినట్టు అవుతుంది

    • జీఎస్టీ చట్టం సెక్షన్ 16(4) ఉన్న ఇబ్బందులను తొలగించి.. ట్యాక్స్ పేయర్స్ ప్రయోజనాలను కాపాడాలి

    • విద్యా సంస్థలు, యూనివర్శిటీల్లో శాస్త్ర సాంకేతికతను ప్రొత్సహించేందుకు వచ్చే గ్రాంట్లపై జీఎస్టీ నుంచి మినహాయించాలి : పయ్యావుల

    gst-rate-cut.jpg

  • 2024-09-09T20:15:39+05:30

    గుడ్ న్యూస్.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రెడీ..

    • సికింద్రాబాద్ నుంచి పరుగులు పెట్టనున్న మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్

    • సికింద్రాబాద్-నాగ్ పూర్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించనున్న ప్రధాని మోదీ

    • ఈ నెల 15 న వర్చువల్‌గా సికింద్రాబాద్- నాగ్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు జెండా ఊపనున్న మోదీ

    • తెలుగు రాష్ట్రాల నుంచి నడుస్తున్న నాలుగు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు

    • సికింద్రాబాద్ - విశాఖ పట్నం మధ్య రెండు..

    • సికింద్రాబాద్-తిరుపతి, కాచి గూడ-యశ్వంత్ పూర్ మధ్య నడుస్తున్న ఒక్కో రైలు

    • సికింద్రాబాద్ - నాగ్ పూర్ వందే భారత్‌తో 578 కిలోమీటర్ల దూరాన్ని 7 గంటల్లో 15 నిమిషాల్లో చేరిక

    • ప్రతి రోజూ ఉదయం 5గంటలకు.. మధ్యాహ్నం 12:15 గంటలకు నాగ్ పూర్- సికింద్రాబాద్

    • మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8:20 కి నాగ్‌పూర్ చేరుకోనున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్

    • కాజీ పేట , రామగుండం , బలహర్షా, చంద్రాపూర్ , సేవ గ్రామ్ స్టేషన్ మీదుగా నాగ్ పూర్ చేరుకోనున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్

    • మరో వందే భారత్‌తో తెలంగాణ-మహారాష్ట్ర మధ్య మెరుగుపడనున్న రవాణా

    Vande-Bharath.jpg

  • 2024-09-09T19:50:39+05:30

    పడవలు ఎందుకొచ్చాయ్..?

    • ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొట్టిన ఘటనపై సీఎం ఆగ్రహం

    • బ్యారేజ్‌ దగ్గరకు పడవలు ఎలా వచ్చాయి..

    • ఎందుకొచ్చాయి అంటూ సీఎం చంద్రబాబు కన్నెర్ర

    • ప్రమాద సమయంలో 11 లక్షల క్యూసెక్కుల వరద ఉంది

    • ఒకవేళ పిల్లర్‌ను ఢీకొంటే పరిస్థితి వేరేలా ఉండేది

    • కౌంటర్‌ వెయిట్ విరిగిపోయే పరిస్థితి వచ్చింది

    • తప్పులు చేసిన వైసీపీ ఎదురుదాడి చేయడమేంటి

    • మూడు పడవలకు వైసీపీ రంగులున్నాయి : చంద్రబాబు

    • ఇప్పటికే ఈ ఘటనలో ఇద్దరు అరెస్ట్

    • ఉషాద్రి, సూరాయపాలెం వాసి కోమటి రెడ్డి రామ్మోహన్‌ అరెస్ట్

    • రిమాండ్‌కు పంపిన విజయవాడ కోర్టు

    Chandrababu-Varadalu.jpg

  • 2024-09-09T19:45:48+05:30

    ఒక్కో ఇంట్లో.. ఒక్కో విషాద ఘటన!

    • వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు

    • వరద బాధితులను పరామర్శించిన ముఖ్యమంత్రి

    • అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్

    • ప్రజల ముఖాల్లో నవ్వు చూద్దామనుకుంటుంటే..

    • ఒక్కో ఇంట్లో ఒక్కో విషాద ఘటన ఉంది

    • అర్బన్ కంపెనీ సాయంతో పాడైన అన్ని వస్తువులు బాగు చేయిస్తున్నాం

    • ఈ యాప్ వినియోగంపై ప్రజల్లో చైతన్యం పెంచుతాం

    • ప్రజలు నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సాయం అందిస్తుంది

    • జఠిలమైన సమస్యను సమన్వయం తో ప్రణాళికతో జాగ్రత్తగా పరీష్కరిస్తూ వచ్చాం

    • ఆప్కో, ఇతరత్రా దగ్గర ఎన్ని బట్టలు ఉంటే అన్నీ తెప్పించి ఇస్తా : చంద్రబాబు

    Chandrababu-Emotional-Final.jpg

  • 2024-09-09T19:10:34+05:30

    NIA చార్జిషీట్ దాఖలు..

    • బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడుపై NIA చార్జిషీట్ దాఖలు

    • బెంగళూరులోని బీజేపీ ప్రధాన కార్యాలయం పేల్చివేతకు కుట్ర జరిగినట్లు పేర్కొన్న NIA

    • మల్లేశ్వరంలోని బీజేపీ కార్యాలయాన్ని పేల్చివేయడానికి విఫలమయ్యారు

    • జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణ పతిష్ట జరిగిన రోజే బీజేపీ కార్యాలయం కూల్చివేతకు యత్నం

    • బీజేపి కార్యాలయం పేల్చివేత విఫలమవడంతో రామేశ్వరంకేఫ్‌లో బాంబు పేల్చిన నిందితులు

    • మార్చి-01న రామేశ్వరం కేఫ్‌లో జరిగిన బాంబు పేలుడు

    • బాంబు పేలుడులో గాయపడిన తొమ్మిది మంది

    • రామేశ్వరం కేఫ్ పేలుడులో IED బాంబును ఉపయోగించిన దుండగులు

    • పేలుడు జరిగిన 42 రోజుల తరువాత బాంబు అమర్చిన వ్యక్తిని అరెస్టు చేసిన NIA

    • బాంబు పేలుడుకు సంబంధించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసిన NIA

    Rameshwaram-Cafe-Blast-case.jpg

  • 2024-09-09T19:04:48+05:30

    వరద బాధితులకు సాయం.. పొంగులేటి కీలక ప్రకటన

    • రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

    • భారీ వర్షాలతో తెలంగాణకు తీవ్ర నష్టం

    • కూలిపోయిన, దెబ్బతిన్న వారికి ఇందిరమ్మ ఇండ్లు

    • ప్రతి కుటుంబానికి రూ.16,500 ఆర్థిక సహాయం

    • మృతుల కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లుతో పాటు రూ. 5 లక్షల సహాయం

    • వరద ముప్పుకు గురైన ప్రతి ఎకరానికి రూ. 10 వేల ఆర్థిక సహాయం

    • తడిచిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం

    • యుద్ధప్రతిపాదికన తాత్కాలికంగా రహదారుల మరమత్తులు

    • డాక్యుమెంట్స్ కొట్టుకుపోయాయని ఆందోళన చెందొద్దు

    • ప్రతి పోలీసు స్టేషన్లో ఫిర్యాదుల కోసం ప్రత్యేక కౌంటర్

    • భారీ వర్షాలు, వరదలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం

    • చివరి బాధితుని వరకు సహాయం అందిస్తాం : పొంగులేటి

    ponguleti-srinivas-reddy.jpg

  • 2024-09-09T19:00:26+05:30

    అరెస్ట్‌పై చంద్రబాబు ఎమోషనల్

    • గతేడాది ఇదే రోజు చంద్రబాబుపై అక్రమ కేసు బనాయించి అరెస్ట్

    • అరెస్ట్‌ను గుర్తు తెచ్చుకుని చంద్రబాబు ఇవాళ ఎమోషనల్

    • గత ఏడాది ఇదే రోజు ఏ ఆధారం లేకుండా అక్రమ కేసులో నన్ను అరెస్టు చేశారు

    • ఆ రోజు ప్రజలంతా నా వెంట నిలిచారు

    • నా పట్ల అంత ఆదరణ చూపిన ప్రజల కోసం జీవితం అంకితం చేసి పని చేస్తా

    • నన్ను ఏ పేరుతో పిలిచినా పలుకుతూ.. ప్రజల మధ్యే ఉండి పనిచేస్తా

    • ఈ రోజు ప్రజలకు కష్టం వస్తే నేనూ వారి మధ్య ఉన్నా

    • ఆ రోజూ బస్ లోనే ఉన్నా, ఈ రోజూ బస్ లోనే ఉన్నా : చంద్రబాబు

    Chandrababu-Emotional-Final.jpg

  • 2024-09-09T18:35:47+05:30

    షాకింగ్.. భారత్‌లో తొలి మంకీ పాక్స్ కేసు

    • భారత్‌లోకి వచ్చేసిన మహమ్మారి మంకీ పాక్స్

    • ఇండియాలో తొలి మంకీ పాక్స్‌ కేసు నమోదు

    • ఢిల్లీలో ఇద్దరికి మంకీ పాక్స్ లక్షణాలు

    • అధికారికంగా ప్రకటించిన కేంద్ర ఆరోగ్యశాఖ

    • ఇప్పటికే ఎంపాక్స్ వ్యాధి వ్యాప్తిపై కేంద్రం అలర్ట్

    • స్క్రీనింగ్, టెస్టింగ్‌ల సంఖ్య పెంచాలని ఆదేశం

    monkey-pox.jpg

  • 2024-09-09T18:30:53+05:30

    చివరి దశకు వరదలపై యుద్ధం..

    • విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన

    • బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా

    • అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు

    • వరదలపై యుద్ధం చివరి దశకు వచ్చింది

    • ఈ యుద్ధం రేపటితో ముగిస్తే..

    • ఇక పునర్నిర్మాణం పై దృష్టి పెడతాం

    • సింగ్ నగర్‌లో వరద మొదటి రోజు పర్యటించినప్పుడు, ఇప్పటికి చాలా పురోగతి

    • మొదటి రోజు ప్రజల్లో బాధ చూశా.. 9వ రోజు ప్రభుత్వంపై నమ్మకం చూస్తున్నా

    • బుడమేరు పట్ల గత పాలకులు చేసిన పాపాల వల్ల 2.75 లక్షల మంది తీవ్ర బాధలు పడ్డారు

    • ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని సందర్భాల్లో చివరి వ్యక్తి కి సహాయం చేయలేకపోయాం

    • బోట్లు ద్వారా ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టించే కుట్ర పన్నారు

    • మొన్నటి వరకూ ఇసుక దొంగ వ్యాపారం చేసిన బోట్లను, ప్రజల్ని ముంచేందుకు పంపించారు : చంద్రబాబు

    Chandrababu-Varadalu.jpg

  • 2024-09-09T18:15:32+05:30

    అరెస్ట్.. రిమాండ్

    • ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొన్న బోట్లు

    • ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకొని కేసు నమోదు చేసిన ప్రభుత్వం

    • ఏ గా ఉషాద్రి, ఏ2గా రామమోహన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

    • విజయవాడ కోర్టులో హాజరు పరిచిన పోలీసులు

    • 14రోజులు రిమాండ్ విధించిన సీఎంఎం కోర్టు

    • అనంతరం విజయవాడ సబ్ జైలుకు తరలింపు

    Prakasam-Barrage-Works.jpg

  • 2024-09-09T18:15:30+05:30

    మూడు కమిటీలు ఏర్పాటు..

    • పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా అరికపూడి గాంధీ

    • మూడు కమిటీలు ఏర్పాటు చేసిన తెలంగాణ శాసనసభ

    • పబ్లిక్అకౌంట్స్, ఎస్టిమేషన్, పబ్లిక్ టేకింగ్ కమిటీలు

    • ఉత్తర్వులు జారీ చేసిన శాసనసభ కార్యదర్శి

    • ఎస్టిమేషన్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఎన్.పద్మావతిరెడ్డి

    • పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్‌గా కె.శంకరయ్య

    • ఒక్కో కమిటీలో 12 మంది చొప్పున సభ్యుల నియామకం

    • ఉత్వర్వులు జారీ చేసిన లెజిస్లేచర్ సెక్రెటరీ

    Congress-PAC-Committie.jpg

  • 2024-09-09T18:00:03+05:30

    వీఆర్వో ఓవరాక్షన్.. కలెక్టర్ షోకాజ్ నోటీసు

    • విజయవాడ వరద బాధితులపై వీఆర్వో ఓవరాక్షన్

    • వరద బాధితులపై చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ

    • వీఆర్వో తీరుపై కూటమి ప్రభుత్వం సీరియస్

    • వీఆర్వోను వరద సహాయక విధుల నుంచి..

    • తప్పించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన

    • వీఆర్వోకు షోకాజ్ నోటీసిచ్చిన కలెక్టర్ సృజన

    • బాధితులతో సంయమనంగా వ్యవహరించాలని..

    • ఇప్పటికే అధికారులకు సీఎం చంద్రబాబు సూచన, వార్నింగ్

    • బాధల్లో ఉన్న బాధితులు ఓ మాట అన్నా..

    • ఓపిగ్గా సమాధానం చెప్పాలని సీఎం ఆదేశాలు

    • సీఎం స్వయంగా ఆదేశిస్తున్నా మారని కొందరి ఉద్యోగుల తీరు

    • తీరు మారని ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరించనున్న ప్రభుత్వం

    VRO-Overa-Actions.jpg

  • 2024-09-09T16:45:59+05:30

    మరమ్మతులు పూర్తి

    • ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్ల మరమ్మతులు పూర్తి

    • 67, 69, 70 గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ల వద్ద పనులు పూర్తి

    • దెబ్బతిన్న వాటి స్థానంలో స్టీల్‌తో తయారు చేసిన..

    • భారీ కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేసిన ఇంజినీర్లు

    • కేవలం 5 రోజులలోపే మూడు గేట్ల వద్ద భారీ కౌంటర్ వెయిట్లు ఏర్పాటు

    • నిపుణుడు కన్నయ్య నాయుడు మార్గదర్శనలో కౌంటర్ వెయిట్లు ఏర్పాటు

    • గేట్ల మరమ్మతులు చేపట్టి పూర్తి చేసిన బెకెమ్ ఇన్ ఫ్రా సంస్థ

    • రేయింబవళ్లు పనిచేసిన సిబ్బంది, ఇంజినీర్లు, అధికారులకు కన్నయ్య సన్మానం

    • మార్గదదర్శనం చేసిన నిపుణుడు కన్నయ్యను సన్మానించిన ఇంజినీర్లు, అధికారులు

      Prakasam-Barrage-Works.jpg

  • 2024-09-09T16:30:14+05:30

    చాతిలో నొప్పితో చెన్నైకి..

    • సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై ఆరోపణలు చేసిన..

    • బాధితురాలికి వైద్య పరీక్షలకు హాజరు కావాలని ఈస్ట్ పోలీసుల పిలుపు

    • తిరుపతి చేరుకున్న తర్వాత చాతిలో నొప్పి ఉందని చెన్నైకి వెళ్లిన బాధితురాలు

    • పోలీసు ప్రొటెక్షన్‌తో చెన్నై వెళ్లిన బాధితురాలు

    • ఆమె ఆరోగ్యం కుదటపడిన తర్వాత వైద్య పరిక్షలకు పిలుస్తామంటున్న పోలీసులు

    Admilam-Koneti.jpg

  • 2024-09-09T16:15:24+05:30

    నేనున్నాననీ..

    • ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు

    • కాకినాడ జిల్లా వరద నీటిలోకి దిగి ఏలేరు ముంపు..

    • బాధితులను పరామర్శిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

    • ఏలేరు వరదకి పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పేదలు ఇళ్ల కాలనీ మునక

    • బాధితులతో మాట్లాడి ధైర్యం చెబుతున్న పవన్

    • ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా..

    Pawan-kalyan.jpg

  • 2024-09-09T16:05:04+05:30

    జగన్ పాస్‌పోర్టు కేసులో తీర్పు రిజర్వ్

    • పాస్ పోర్టు విషయంలో ఏపీ హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ జగన్

    • ఐదు సంవత్సరాలకు పాస్ పోర్టు కావాలని మోషన్ పిటిషన్‌ దాఖలు

    • సోమవారం విచారణ జరిగిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం

    • మాజీ సీఎం వైఎస్ జగన్ పాస్ పోర్టు కేసులో తీర్పు రిజర్వ్

    • ఎల్లుండి (బుధవారం నాడు) తీర్పు ఇవ్వనున్న హైకోర్టు

    • ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు

    YS-Jagan-Passport.jpg

  • 2024-09-09T15:37:56+05:30

    వర్షాలు-వరదలు: ఏపీ బీజేపీ ఎమ్మెల్యేల కీలక నిర్ణయం

    • అమరావతి: వర్షాలు- వరదలతో ఆంధ్రప్రదేశ్‌కు తీరని నష్టం

    • సహాయక చర్యల కోసం విరాళాలు అందజేస్తోన్న ప్రముఖులు

    • నెల జీతం అందజేయాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యేల నిర్ణయం

    • సీఎం చంద్రబాబుకు లేఖ అందజేసిన బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణు కుమార్ రాజు

  • 2024-09-09T15:36:13+05:30

    యుద్ధ ప్రతిపాదికన బుడమేరు గట్టు బలోపేతం

    • ఎన్టీఆర్ జిల్లా: సీఎం చంద్రబాబు ఆదేశాలతో యుద్ధ ప్రతిపాదికన బుడమేరు గట్టు బలోపేతం పనులు

    • గట్టు బలహీనంగా ఉందో పరిశీలిస్తోన్నాం: మంత్రి నిమ్మల రామానాయుడు

    • ఈలప్రోలు వద్ద గద్దె కాలువ లాకుల దగ్గర దెబ్బతింది

    • గండ్లు పడిన ప్రాంతాల్లో వేగంగా సహాయక పనులు

    • మంత్రి నిమ్మల రామానాయుడుతో స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, ఇరిగేషన్ అధికారులు

  • 2024-09-09T15:29:27+05:30

    సుప్రీంకోర్టును ఆశ్రయించిన దేవినేని అవినాశ్

    • ఢిల్లీ: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సుప్రీంకోర్టుకు దేవినేని అవినాశ్

    • ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు

    • అవినాశ్‌కు ముందస్తు బెయిల్ నిరాకరించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు

    • ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన దేవినేని అవినాశ్

    • టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన అవినాశ్, వైసీపీ నేతలు రఘురాం, నందిగం సురేశ్, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు

    • ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించని హైకోర్టు ధర్మాసనం

    • హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసిన దేవినేని అవినాశ్

    • రేపు విచారణకు వచ్చే అవకాశం

  • 2024-09-09T15:25:07+05:30

    కూనంనేని హాట్ కామెంట్స్

    • హైదరాబాద్: ప్రభుత్వంలో సీపీఐ భాగస్వామ్యం కాదు

    • బాంబ్ పేల్చిన కూనంనేని సాంబశివరావు

    • ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలసి పోటీ మాత్రమే చేశాం

    • పార్టీ మారిన ఎమ్మెల్యేల పదవిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్

    • పార్టీ మారిన ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు పెట్టాలి

    • సెప్టెంబర్ 17వ తేదీని అధికారికంగా నిర్వహించటానికి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతోంది

    • ప్రభుత్వంలో భాగస్వామ్యం అయితే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించే వాళ్ళం

    • తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపొద్దని విజ్ఞప్తి

    • మానవత్వంతో కేంద్రం రాష్ట్రానికి సహాయం చేయాలి.

    • జాతీయ విపత్తు కింద తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ. 6 వేల కోట్లు ఇవ్వాలి

    • మా అంచనా ప్రకారం రూ. 10 వేల కోట్లు ఇవ్వాలి.

    • ఇళ్లు కూలిపోయిన, దెబ్బతిన్న ఇళ్లకి, పంట నష్టానికి రూ.10 వేలు సరిపోవు

    • నష్టపోయిన దానిలో కనీసం సగం అయిన ఇవ్వాలి.

    • మావోయిస్టుల పై అమిత్ షాకు ఎందుకంత కక్ష? మావోయిస్టులతో చర్చలు జరపాలి.

    • మావోయిస్టుల విషయంలో కేంద్రం మాయలో పడి రాష్ట్ర ప్రభుత్వం తప్పులు చేయకూడదు.

    • సెప్టెంబర్ 11నుండి 17వరకు రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు జరుపుతాం

    • సెప్టెంబర్ 21 వ తేదిన భారీ బహిరంగ సభ ఉంటుంది.

  • 2024-09-09T15:19:59+05:30

    • వెదర్ అప్‌డేట్

    • విశాఖపట్నం: వద్దంటే వాన

    • పూరి తీరానికి సమీపంలో తీరం దాటిన తీవ్ర వాయుగుండం

    • క్రమంగా బలహీనపడుతూ, వాయుగుండంగా మారే అవకాశం

    • పశ్చిమ వాయువ్య దిశగా పయనం

  • 2024-09-09T15:16:46+05:30

    • ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్

    • వరంగల్: ములుగు జిల్లా మేడారం అడవుల్లో ఘోర విపత్తుపై ఎన్‌‌ఆర్‌ఎస్సీ, వాతావరణ శాఖ విచారణ

    • అడవుల్లో వాతావరణ పరిస్థితులను నమోదు చేసుకున్న ఎన్‌‌ఆర్‌ఎస్సీ

    • 2018 జనవరి 22న మేడారం చిలకల గుట్టలో టోర్నడో లాంటి సుడిగాలి

    • సుడిగాలి ఫోటోలను క్యాప్చర్ చేసిన ఆంధ్రజ్యోతి ఫొటో గ్రాఫర్ వీరగోని హరీష్

    • మేడారం అడవుల్లో టోర్నడో బీభత్సం వలే అడవులు ధ్వంసమైనట్టు నిర్ధారణకు వస్తోన్న అధికారులు

  • 2024-09-09T15:12:55+05:30

    • పవన్ కల్యాణ్ పర్యటన

    • కాకినాడ: కాసేపట్లో ఏలేరు ముంపు ప్రాంతానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

    • నీట మునిగిన పేదల ఇళ్ల కాలనీ బాధితులకు పరామర్శ

    • అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్న పవన్ కల్యాణ్

  • 2024-09-09T15:09:49+05:30

    • ఊరట..

    • అమరావతి: పెండ్యాల శ్రీనివాస్‌పై సస్పెన్షన్ ఎత్తివేత

    • గతంలో సీఎం చంద్రబాబుకి పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన శ్రీనివాస్

    • శ్రీనివాస్‌పై వైసీపీ సర్కార్ కక్షసాధింపు చర్యలు.. సస్పెన్షన్ వేటు

    • సస్పెన్షన్ ఎత్తివేసిన కూటమి ప్రభుత్వం

    • ప్లానింగ్ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీ పోస్టింగ్

    • సస్పెన్షన్ కాలాన్ని ఆన్ డ్యూటీగా పరిగణించాలని ఉత్తర్వులు జారీ

  • 2024-09-09T15:04:59+05:30

    విరాళాల వెల్లువ

    • హైదరాబాద్: వరదలతో తెలుగు రాష్ట్రాలకు తీరని నష్టం

    • ముఖ్యమంత్రి సహాయనిధికి వెల్లువెత్తుతున్న విరాళాలు

    • రూ.కోటి విరాళం అందజేసిన సైజెన్ గ్రూప్ కంపెనీ ప్రతినిధులు.

    • జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేసిన ప్రతినిధులు.

      cm-cheque.jpg

  • 2024-09-09T14:45:22+05:30

    హైకోర్టు తీర్పు భేష్: మాజీ ఎంపీ వినోద్ కుమార్

    • వరంగల్: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై హై కోర్టు తీర్పుపై మాజీ ఎంపీ వినోద్ కుమార్

    • పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్ పై విచారణ జరిగింది, సుదీర్ఘ వాదనలు జరిగాయి

    • నాలుగు వారాల్లో విచారించి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది

    • స్పీకర్ నిర్లక్ష్యం చేస్తే మేమే విచారణ చేస్తాం అని హైకోర్టు చెప్పింది

    • ఇకనైనా స్పీకర్ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం

    • 1985లో రాజీవ్ గాంధీ 52వ షెడ్యూల్ సవరణ ద్వారా పార్టీ మారే, పార్టీ నిర్ణయాన్ని దిక్కరించే వారిపై అనర్హత వేటు వేయాలని చట్టం తెచ్చారు

    • ఒక సమయంలో అమలు చేయకపోవడంతో అనర్ధాలకు కారణమైంది

    • 39 ఏళ్ల క్రితం చట్టం వచ్చినా అందులో లోసుగులు ఉండటం కొందరికి ఉపయోగంగా మారింది

    • ప్రధాని మోదీ నీతులు చెబుతారు.

    • ఎన్నో చట్ట సవరణలు తెచ్చిన మోదీ ఈ చట్ట మాత్రం సవరణ చేయరు

    • శాసన సభ స్పీకర్ కోర్టుతో చీవాట్లు తినాలా ?

    • సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, ఖర్గే మాటలు వినకుండా తెలంగాణ స్పీకర్ విచారణ చేయాలి

    • దేశంలోని రాజకీయ పార్టీలు పట్టుబట్టి 10 షెడ్యూల్ రద్దు చేయాలి

    • స్పీకర్‌కి 4, 6 వారాల్లో నిర్ణయం తీసుకునేలా చట్ట సవరణ చేయాలి

    • మోదీ ప్రభుత్వం వెంటనే 10వ షెడ్యూల్ రద్దు చేయకుంటే ప్రజాస్వామ్యం అంటే ప్రజలు గౌరవం కోల్పోయే ప్రమాదం ఉంది.

    • ఆనాడు చట్టం తెచ్చినప్పుడు రాజీవ్ గాంధీ ఇలాంటి స్పీకర్లు ఉంటారని ఊహించలేదు

    • చట్టంలో ఏ నేత తప్పు చేయకుండా చేయాలి.. తప్పు చేసే ఆస్కారం ఉండకుండా చూడాలి

  • 2024-09-09T14:39:29+05:30

    • మేమున్నాం..

    • అనకాపల్లి జిల్లా: పాయకరావుపేటలో తాండవ నది వరద ఉధృతిని పరిశీలించిన హోంమంత్రి వంగలపూడి అనిత

    • నదిని ఆనుకొని ఉన్న కాలనీలోని ప్రజలతో మాటమంతి

    • అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి అనిత పిలుపు

  • 2024-09-09T14:35:27+05:30

    రాజమండ్రికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

    • రాజమండ్రి: రాజమండ్రి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

    • హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి వచ్చిన పవన్

    • పవన్ కళ్యాణ్‌కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, జనసేన నేతలు

    • రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి రోడ్డుమార్గాన కాకినాడకు పవన్

    • గొల్లప్రోలులో ఏలేరు రిజర్వాయర్ ముంపును పరిశీలించే అవకాశం.

  • 2024-09-09T12:45:31+05:30

    ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌కు తప్పిన పెను ప్రమాదం..

    Kamineni-Srinivas.jpg

    • ఎమ్మెల్యే కామినేనికి త్రుటిలో తప్పిన ప్రమాదం.

    • కైకలూరు మండలం పందిరిపల్లి గూడెం దగ్గర కొల్లేరులో దిగిపోయిన కామినేని ప్రయాణిస్తున్న వాహనం.

    • అధికారులు, కూటమి నాయకుల అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం.

    • బొలెరోలోనే ఉన్న కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు, మీడియా ప్రతినిధులు.

  • 2024-09-09T12:10:44+05:30

    ఘోర ప్రమాదం.. 48 మంది మృతి..

    • నైజీరియాలో ఘోర ప్రమాదం..

    • ట్రక్కు-ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొని 48 మంది మృతి

  • 2024-09-09T11:53:26+05:30

    ముంచుకొస్తున్న మరోముప్పు.. సర్కార్ అలర్ట్..

    weather.jpg

    • విశాఖ: మరో ముప్పు ముంచుకొచ్చే నేపథ్యంలో హోం, విపత్తుల నిర్వహణ శాఖలను అప్రమత్తం చేసిన హోం మంత్రి అనిత.

    • ఉత్తరాంధ్రను వానలు ముంచెత్తుతుండడంతో విజయవాడ నుంచి బయలుదేరి వెళ్లిన హోంమంత్రి అనిత.

    • కోస్తాంధ్రలోనూ అతి భారీ వర్షాలున్నాయన్న వాతావరణ శాఖ సమాచరం నేపథ్యంలో రాబోయే 72 గంటలు జాగత్తగా ఉండాలని హోం మంత్రి సూచన.

    • వంశధార, నాగావళి, బహుదా పరివాహక ప్రాంతాల ప్రజల మొబైళ్లకు ఎప్పటికప్పుడు అలెర్ట్ సందేశాలు పంపి అప్రమత్తం చేయాలని ఆదేశం.

    • గోపాలపట్నం, కంచరపాలెం, అరకులోయ పరిసర ప్రాంతాలలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలపై హోంమంత్రి విచారం.

    • జ్ఞానాపురం ఎర్రిగెడ్డ, అల్లూరి జిల్లా మత్స్యగెడ్డల ఉగ్రరూపంపై ఎప్పటికప్పుడు వివరాలందించాలని ఆదేశం.

    • ముంపు బారిన పడే అవకాశమున్న ప్రాంతాలలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశాలు.

  • 2024-09-09T11:19:05+05:30

    Hyderabad: పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో హైకోర్టు కీలక తీర్పు..

    telhighcourt.jpg

    • హైదరాబాద్: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి ఆదేశం.

    • నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా కేసుగా మళ్ళీ విచారణ ప్రారంభిస్తామన్న హైకోర్టు.

  • 2024-09-09T11:09:39+05:30

    హైదరాబాద్ వాసులకు హై అలర్ట్..

    • హైదరాబాద్ : సిటీలో మూసికి పోటెత్తిన వరద.

    • జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసికి భారీగా వరద.

    • మూసి పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్.

    • జియాగూడ, గోల్నాక, మూసారంబాగ్, చాదర్ఘాట్ వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న మూసి.

    • ఉస్మాన్ సాగర్ రెండు గేట్లు, హిమాత్ సాగర్ ఒక గేటు ను ఎత్తి 550 క్యూసెక్కుల నీరు విడుదల.

    • మూసి పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన జిహెచ్ఎంసి.

  • 2024-09-09T10:55:15+05:30

    విజయవాడ: కనకదుర్గమ్మ వారధిపై భారీగా ట్రాఫిక్ జామ్

    Traffic-jam.jpg

    • అమరావతి: జాతీయ రహదారిపై గుంటూరు, విజయవాడ మధ్య కనకదుర్గమ్మ వారధిపై ట్రాఫిక్ జామ్.

    • రెండు గంటల నుంచి నిలిచిపోయిన ట్రాఫిక్.

    • వర్షంలో నరకం అనుభవిస్తున్న ప్రయాణీకులు.

    • పట్టించుకోని పోలీసులు.

    • వారధికి గుంటూరు వైపు జాతీయ రహదారిపై నాలుగు కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.

    • జాతీయ రహదారి పక్కన సర్వీస్ రోడ్డులో కూడా స్తంభించిన ట్రాఫిక్.

    • ఎటు వెళ్లే మార్గం లేక అల్లాడిపోతున్న ప్రయాణీకులు.

  • 2024-09-09T10:52:11+05:30

    సుప్రీంకోర్టులో బెంగాల్ ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై విచారణ

    supreme court.jpg

    • ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో బెంగాల్ ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన పై విచారణ.

    • బెంగాల్ ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు.

    • ఇప్పటి వరకు జరిగిన విచారణ స్టేటస్కో తెలుసుకొనున్న సుప్రింకోర్టు.

    • ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో భద్రత కోసం నేషనల్ టాస్క్ ఫోర్స్ నియమించిన సుప్రీంకోర్టు.

    • ఇప్పటికే డాక్టర్లపై దాడులను తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు.

    • డాక్టర్ల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిందే అన్న సుప్రీం కోర్ట్.

    • సుప్రీంకోర్టు ఆదేశాలతో దేశవ్యాప్త ఆందోళనలను విరమించిన డాక్టర్లు.

    • ఆర్‌జి కార్ మెడికల్ కాలేజ్ కేసును విచారణ జరుపుతున్న సీబిఐ.

    • సుప్రీంకోర్టుకు స్టేటస్ రిపోర్టును నివేదించిన సిబిఐ.

  • 2024-09-09T10:50:22+05:30

    వట్టినాగులపల్లిలో ఘోరం.. ఏడేళ్ల చిన్నారి..

    died.jpg

    • వట్టినాగులపల్లిలో నిన్న అదృశ్యమైన 3 వ తరగతి విద్యార్థి మృతి.

    • నీళ్లు నిలువ చేసిన‌ నీటి గుంటలో పడి దుర్మరణం చెందిన‌ విద్యార్థి.

    • నిన్న మద్యాహ్నం ఆడుకోవడానికి బయటకు వెళ్లిన విద్యార్థి. ‌

    • ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడ్డ బాలుడు. ‌

    • ఈత రాకపోవడంతో గుంటలో మునిగి పోయి ప్రాణాలు విడిచిన చిన్నారి.

    • మద్యాహ్నం నుండి శ్రీనివాస్ కనిపించక పోవడంతో చుట్టూ పక్కల వెతికిన తల్లిదండ్రులు.

    • ఆచూకీ లభించక పోవడంతో పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులు.

    • బాలుడి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టిన కాప్స్.

    • ఉదయం నీటి కోసం తొవ్విన భారీ గుంట లో బాలుడి శవం.

    • బాలుడి శవం చూసి కన్నీరు మున్నీరుగా విలపించిన కుటుంబ సభ్యులు.

    • గత కొంత కాలంగా నీటి దందా చేస్తున్న మాఫియా.

    • నీళ్లను ట్యంకర్ల ద్వారా అమ్మి సొమ్ము చేసుకుంటున్న మాఫియా.

    • ఏలాంటి జాగ్రత్తలు పాటించని యజమానులు.

    • నిబంధనలకు విరుద్దంగా నీళ్లను అమ్ముకుంటున్న కేటుగాళ్లు‌.

    • గత నెల నీటి గుంటలను జేసీబీ తో కూల్చివేసిన రెవెన్యూ అధికారులు.

    • అక్రమంగా నీటు దందా కొనసాగింపు.

    • వారి నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడంటూ ఆరోపణ.

  • 2024-09-09T10:47:23+05:30

    నల్గొండ : నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం

    nagarjuna sagar.jpg

    • 24 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

    • ఇన్ ఫ్లో : 2, 32, 587 క్యూసెక్కులు.

    • ఔట్ ఫ్లో : 2,59, 957 క్యూసెక్కులు.

    • పూర్తి స్థాయి నీటి మట్టం : 590 అడుగులు.. 312 టిఎంసీలు

    • ప్రస్తుత నీటి మట్టం : 588.90 అడుగులు.. 307.28 టీఎంసీలు.