Share News

Breaking News: నేటి తాజా వార్తలు..

ABN , First Publish Date - Aug 23 , 2024 | 09:38 AM

Breaking News Live Updates: ప్రపంచ నలుమూల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. మినిట్ టు మినిట్ తాజా వార్తలను ఇక సులభంగా తెలుసుకోవచ్చు. మీకోసమే ప్రత్యేకంగా ఈ లైవ్ అప్‌డేట్స్ ప్లాట్‌ఫామ్.. సమస్త సమాచారం ఇక్కడే చూసేయండి.

Breaking News: నేటి తాజా వార్తలు..
Breaking News

Live News & Update

  • 2024-08-23T14:27:35+05:30

    సీఏం రేవంత్‌కు కేటీఆర్ మరో సవాల్..

    • సీఎం రేవంత్ కు దమ్ముంటే.. “చలో ఢిల్లీ” కాదు.. “చలో పల్లె” చేపట్టాలి.

    • రుణమాఫీ కాక లక్షలాది రైతులు రగిలిపోతుంటే.. వారివైపు కన్నెత్తి కూడా చూడకుండా హస్తిన యాత్రలా..??

    • ఒకటి కాదు.. రెండుకాదు.. ఎనిమిది నెలల్లో..ఏకంగా 20 సార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడతారా..??

    • రిమోట్ కంట్రోల్ పాలనతో రైతులను బలి చేస్తారా..??

    • ఎన్నికల్లో అన్నీ గాలి మాటలు చెప్పారు..

    • గద్దెనెక్కగానే గాలిమోటర్లలో ఊరేగుతున్నారు..

    • మీ యాత్రలతో తెలంగాణ ప్రజలకు ఒరిగిన ప్రయోజనమేంటి..??

    • అన్నదాతలను ఆగంచేసి..

    • దేశ రాజధాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే..

    • రైతుల తండ్లాట తీర్చేదెవరు.. రుణమాఫీ పూర్తిచేసెదెవరు..??

    • అధిష్టానం మెప్పు కోసం పగలూ రాత్రి తపన తప్ప.. అన్నం పెట్టే రైతుల తిప్పల గురించి ఆలోచించే తీరిక లేదా..??

    • రైతులకేమో మాయమాటలు..

    • ఢిల్లీ పెద్దలకు మాత్రం మూటలా??

    • 20 సార్లు చేపట్టిన ఢిల్లీ యాత్రలతో తెలంగాణకు దక్కింది.. “గుండుసున్నా”

    • ఓవైపు డెంగీ మరణాలు..

    • మరోవైపు పెరుగుతున్న నేరాలు..

    • ఇంకోవైపు అన్నదాతల ఆందోళనలు..

    • గాడితప్పిన పాలనతో.. రాష్ట్రమంతా అట్టుడుకుతున్న ఈ విపత్కర పరిస్థితుల్లో.. ముఖ్యమంత్రి, మంత్రులు ఉండాల్సింది.. ఢిల్లీలో కాదు.. తెలంగాణ గల్లీల్లో..

    • రాష్ట్రాన్ని గాలికొదిలేసి..

    • అన్నదాతలను అరిగోస పెట్టి..

    • హైకమాండ్ ఆశీస్సుల కోసం ప్రతిక్షణం పాకులాడితే..

    • తెలంగాణ సమాజమే ఏదోరోజు కుర్చీ లాగేయడం తథ్యం..

    • జై కిసాన్

    • జై తెలంగాణ

  • 2024-08-23T14:25:18+05:30

    సోనియా, రాహుల్ గాంధీ నివాసానికి బీజేపీ ఎంపీ రఘునందన్, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్.

    • బ్లిట్జ్ పత్రికలో వచ్చిన కథనాలకు సమాధానం చెప్పాలని, బ్లిట్జ్ పత్రికను రాహుల్ గాంధీకి కార్యాలయంలో ఇచ్చాను.

    • రాహుల్ గాంధీ మీటింగ్‌లో ఉన్నారని చెప్పారు.

    • దాంతో రిసెప్షన్‌లో పత్రిక ఇచ్చి వచ్చాను.

    • నిన్న హైదారాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టీ చెప్పాను.

    • బ్లిట్జ్ పత్రికలో వచ్చిన రిపోర్టుపై సోనియా, రాహుల్ ఏం చర్య తీసుకుంటారో చెప్పాలి అని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.

  • 2024-08-23T12:42:07+05:30

    నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నదిలో పడిపోయిన బస్సు..

    నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 40 మందితో ప్రయాణిస్తున్న భారతీయ ప్రయాణీకుల బస్సు తనహున్ జిల్లాలో మార్స్యంగ్డి నదిలో పడిపోయింది. ఈ విషయాన్ని నేపాల్ పోలీసులు ధృవీకరించారు. ‘UP FT 7623’ నంబర్ ప్లేట్ గల బస్సు నది లోయలోకి పడిపోయింది. ఈ విషయాన్ని డిఎస్‌పి దీప్‌కుమార్ రాయ వెల్లడించారు. ప్రమాదానికి గురైన బస్సు పోఖారా నుండి ఖాట్మండుకు వెళుతోంది.

  • 2024-08-23T12:06:17+05:30

    156 మెడిసిన్లపై నిషేధం..

    కేంద్ర ప్రభుత్వంగురువారం రోజు 156 ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ మందులను నిషేధించింది. వీటిలో యాంటీబయాటిక్స్, నొప్పి నివారణ, మల్టీవిటమిన్ మందులు కూడా ఉన్నాయి. ఈ మందులు ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయని పరిశోధనలో తేలింది. ఈ క్రమంలో ఈ మందుల తయారీ, విక్రయం, పంపిణీని పూర్తిగా నిషేధిస్తున్నామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

    పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

  • 2024-08-23T11:36:27+05:30

    యూట్యూబర్ హర్షపై పోలీస్ కేసు నమోదు..

    harsha.jpg

    • యూట్యూబర్ హర్షపై రెండు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు.

    • డబ్బులు విసిరే వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యూట్యూబర్ హర్షపై కేసు నమోదు.

    • రోడ్లపై డబ్బులు విసిరిస్తూ వీడియోలు రికార్డ్ చేసి టెలిగ్రామ్ లో అప్లోడ్ చేస్తున్న హర్ష..

    • తాను టెలిగ్రామ్ లో గంటకి వేల రూపాయలు సంపాదిస్తున్నానంటూ మీరు కూడా జాయిన్ అవ్వండి అంటూ వీడియోలు పెడుతున్న హర్ష.

    • హర్షపై సనత్ నగర్ లో ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన సనత్ నగర్ పోలీసులు.

    • KPHB పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు.

  • 2024-08-23T11:34:02+05:30

    పరవాడ ఫార్మా ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి..

    Anitha.jpg

    • పరవాడ సినర్జీ ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను పరామర్శించిన హోం మంత్రి వంగలపూడి అనిత.

    • మరో దురదృష్టకరమైన ఘటన.

    • రసాయనాలు కలిపేటప్పుడు ఈ ప్రమాదం జరిగింది.

    • జార్ఖండ్ కు చెందిన ముగ్గురు కార్మికులకు గాయాలయ్యాయి.

    • నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి.

    • మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం.

    • గాయాలైన సూర్యనారాయణకు ధైర్యం చెప్పాము.

    • బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది.

    • యాజమాన్యాలు నిర్లక్ష్యం వలన పరిశ్రమల్లో ప్రమాదాలు జరగుతున్నాయి.

    • పరిశ్రమల యాజమాన్యాలు భద్రత పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.

    • త్వరలో పరిశ్రమల భద్రతపై సమావేశం నిర్వహిస్తాం.

    • ఒక కమీటి వేసి,పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తాం.

    • ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం.

    • ఎల్జీపాలిమర్స్ ఘటన ఎంత పెద్ద సంఘటన.

    • కనీసం అప్పటి ముఖ్యమంత్రి పరామర్శకు కూడా రాలేదు.

  • 2024-08-23T11:19:56+05:30

    కేజ్రీవాల్‌కు షాక్..

    • సుప్రీంకోర్టులో సిఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై విచారణ ప్రారంభం.

    • జస్టిస్ సూర్యకాంత్,జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం ముందు విచారణ.

    • కేజ్రీవాల్ బెయిల్ కేసులో ఇంకా కౌంటర్ దాఖలు చేయని సిబిఐ.

    • కౌంటర్ ఫైల్ చేయడానికి వారం రోజుల సమయం కోరిన సిబిఐ.

    • రెండు రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని సిబిఐకి సుప్రింకోర్టు ఆదేశం.

    • సెప్టెంబర్ 6 వ తేదీకి కేసు విచారణ వాయిదా.

  • 2024-08-23T10:30:23+05:30

    నిండు ప్రాణం తీసిన భూత వైద్యం..

    Black-Magic.jpg

    • కర్నూలు: గోనెగండ్ల మండలం చిన్న మర్రివీడులో దారుణం చోటు చేసుకుంది.

    • భూత వైద్యానికి రంగన్న అనే వ్యక్తి మృతి.

    • ఆస్పరి మండలం వలిగొండకు చెందిన రంగన్నకు దయ్యం పట్టిందన్న భూత వైద్యుడు.

    • 9 వారాలు పూజలు చేయాలని చెప్పిన భూత వైద్యుడు.

    • మాంత్రికుడి మాటలు విని చిన్న మర్రివీడులో పూజలు చేయించుకున్న రంగన్న మృతి.

    • పరారీలో భూత వైద్యుడు.

    • కన్నీరు మున్నీరవుతున్న మృతుడి కుటుంబ సభ్యులు.

  • 2024-08-23T10:23:37+05:30

    అనకాపల్లి: పరవాడ ఫార్మసిటీలో మరో ప్రమాదం

    • సినర్జీన్ యాక్టివ్ ఇన్ గ్రేడియంట్స్ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాలో రాత్రి 12:30 గంటలకు చోటుచేసుకున్న ప్రమాదం.

    • ఒకటవ అంతస్తు బి. బ్లాక్ క్లీనింగ్ రూమ్ సమీపంలో జరిగిన ప్రమాదం.

    • ఈ ప్రమాదంలో జార్ఖండ్ కు చెందిన ముగ్గురు, విజయనగరం కి చెందిన ఒకరికి గాయలు.

    • గాయపడిన వ్యక్తుల్లో జార్ఖండ్ కు చెందిన ఓయ్బోంకోర్హా (22), లాల్‌సింగ్ పూర్తి( 24 ), రోయా అంజిరియా (22 ), విజయనగరానికి చెందిన సూర్యనారాయణ (36).

  • 2024-08-23T09:47:05+05:30

    Big Update: నేడు సుప్రీంకోర్టులో సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై విచారణ

    • విచారణ జరపనున్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం.

    • లిక్కర్ కేసులో ఐదు నెలలుగా తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్.

    • లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ హైకోర్టు బెయిల్ తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్.

    • సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ మరో పిటిషన్ దాఖలు చేసిన కేజ్రీవాల్.

    • ఆగస్టు 5న కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు.

    • ఆగస్టు 14న కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై సిబిఐ కి నోటిసులు జారీ చేసిన సుప్రీంకోర్టు.

    • కేజ్రీవాల్ కి సుప్రీంకోర్టు లో బెయిల్ వ్యతిరేకిస్తున్న సిబిఐ.

    • లిక్కర్ పాలసీ కుంభకోణం వెనుక ప్రధాన కుట్రదారు కేజ్రీవాలే అన్న సీబీఐ.

    • ఎక్సైజ్ శాఖ తన వద్ద లేకపోయినా లిక్కర్ పాలసి గురించి కేజ్రివాల్ నిర్ణయాలు తీసుకున్నారన్న సీబీఐ.

    • లిక్కర్ పాలసీ నిర్ణయాలు కేజ్రీవాల్ తీసుకున్నారని,కేజ్రీవాల్ దర్యాప్తుకి సహకరించడం లేదని, దాటవేత సమాధానాలు ఇస్తున్నారని సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐ .

    • ఇప్పటికే ఈడీ కేసులో కేజ్రీవాల్ కి మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు.

    • లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో జూన్ 26న అరెస్ట్ అయిన కేజ్రీవాల్.

    • సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో తీహార్ జైలులోనే ఉన్న కేజ్రీవాల్.

  • 2024-08-23T09:38:56+05:30

    ప్రజా భవన్ వద్ద దళిత బంధు లబ్ధిదారుల ఆందోళన.

    Dalit-Bandhu.jpg

    • గత ప్రభుత్వం ఎన్నికలకు నెల ముందు బెనిఫషర్ లిస్ట్ రెడీ చేసింది.

    • ఎన్నికలు ముగిసి ఎనిమిది నెలల కావస్తున్నా లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు జమ కాలేదు.

    • కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున ప్రజా భవన్ కు వచ్చిన లబ్ధిదారులు.

    • గతంలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి ని కలిసి వినతిపత్రం ఇచ్చిన ఫలితం లేందంటున్న బెనిఫిషర్స్.

    • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలంటూ ప్రజా భవన్ కి భారీగా చేరుకున్న దళితులు.