-
-
Home » Mukhyaamshalu » Breaking News of 25 August 2024 Today Latest Telugu News Live Updates. Siva
-
Breaking News: నేటి తాజా వార్తలు..
ABN , First Publish Date - Aug 25 , 2024 | 07:32 AM
Breaking News Live Updates: ప్రపంచ నలుమూల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. మినిట్ టు మినిట్ తాజా వార్తలను ఇక సులభంగా తెలుసుకోవచ్చు. మీకోసమే ప్రత్యేకంగా ఈ లైవ్ అప్‌డేట్స్ ప్లాట్‌ఫామ్.. సమస్త సమాచారం ఇక్కడే చూసేయండి.
Live News & Update
-
2024-08-25T13:35:45+05:30
‘కాంగ్రెస్ నేతల అక్రమ కట్టడాలనే కూలుస్తారా?’
సంగారెడ్డి: బీజేపీ ఆఫీస్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమం
హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారు: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
హైడ్రా పేరుతో డైవర్ట్ పాలిటిక్స్: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
దానంపై హైడ్రా కేసు నమోదు చేసి ఎందుకు అరెస్ట్ చేయలేదు?
మీ పార్టీ నేతల అక్రమ నిర్మాణాలు కూల్చివేసే దమ్ము మీకుందా?
-
2024-08-25T12:42:26+05:30
అహంకారాన్ని వదలండి.. వైసీపీకి మాజీ మంత్రి వార్నింగ్..
గుంటూరు జిల్లా: మహిళలపై అత్యాచారాలు, వేధింపులకు పాల్పడటాన్ని సమాజంలోని అన్ని వర్గాలు ఖండించాయని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు.
వైసీపీ ఎమ్మెల్సీ అనంత్ బాబు తన వికృత చేష్టలతో అప్రదిష్ట పాలయ్యారు.
ఎమ్మెల్సీని పార్టీ నుండి సస్పెండ్ చేసి రాజకీయాల నుండి తొలిగించాలి.
వైసిపి కార్యకర్తలకు ఎమ్మెల్సీ అనంత్ బాబు, మాజీ ఎంపీతో దళితులను ఎలా చంపాలి, మహిళలను ఎలా వేధించాలి అని శిక్షణ ఇప్పిస్తారు.
ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని త్వరలోనే గవర్నర్ కలుస్తాం.
అనంత్ బాబు, తోట త్రిమూర్తులపై చర్యలు తీసుకోవాలి.
వైసిపి నేతలు అహంకారాన్ని వదులుకోవాలి.
నేరాలు ఎలా చేయాలి అన్న అంశంపై వీరంతా శిక్షణ ఇవ్వడమా.. సిగ్గు చేటు.
-
2024-08-25T11:36:19+05:30
హైడ్రా ఇక మరింత స్ట్రాంగ్.. దబిడి దిబిడే..!
హైడ్రా.. హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది. చెరువులు, కుంటలు, నాళాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై కొరడా ఝుళిపిస్తోంది. ఇప్పటికే ఎన్నో అక్రమ కట్టడాలను కూల్చిన హైడ్రా.. మరికొన్ని అక్రమ నిర్మాణాలపైనా దృష్టి సారిస్తోంది. అయితే, హైడ్రా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మున్ముందు న్యాయపరంగా హైడ్రాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పించే ప్రయత్నం చేస్తోంది. హైడ్రాకు పోలీస్ స్టేషన్ హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. అక్రమాలపై సొంతంగా ఎఫ్ఐఆర్‌లను నమోదు చేసే అధికారాన్ని హైడ్రాకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోందట.
-
2024-08-25T10:58:25+05:30
Telegram Founder Arrested: టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ అరెస్ట్..
టెలిగ్రామ్‌లో జరుగుతున్న అసాంఘిక కార్యకపాల కేసులో టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పావెల్ దురోవ్ అరెస్ట్ అయ్యారు. ఫ్రాన్స్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పారిస్‌లోని లె బౌర్గెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వెంటనే అతన్ని అరెస్ట్ చేశారు.
టెలిగ్రామ్ యాప్ కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో చీటింగ్, మనీలాండరింగ్, వ్యభిచారం, మాదక ద్రవ్యాల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, చిన్నపిల్లలపై లైంగికదాడులకు సంబంధించిన నేరాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో వాటిని నిరోధించేలా ఎలాంటి చర్యలను యాప్ యాజమాన్యం తీసుకోవడం లేదు. దీంతో పావెల్ దురోవ్‌ను అరెస్ట్ చేశారు.
-
2024-08-25T10:54:02+05:30
రూ. 175 కోట్ల మోసం.. ఇద్దరు అరెస్ట్..
రూ. 175 కోట్ల మోసంలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో.
మహమ్మద్ షూబ్ తౌకీర్, మహమూద్ బిన్ అహ్మద్ బవాజీర్ రూ. 175 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు.
ప్రధాన నిందితుడు దుబాయ్‌లో ఉండి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులు.
పేద ప్రజల పేరుతో బ్యాంకు ఖాతాలు తెరిచి సైబర్ నేరాలు.
డబ్బులను హవాలా మార్గాల్లో పంపిణీ చేసినట్లు గుర్తింపు.
క్రిప్టోకరెన్సీ ద్వారా కొంత డబ్బును దుబాయ్‌కు తరలించినట్టు గుర్తించిన సైబర్ సెక్యూరిటీ.
-
2024-08-25T09:51:57+05:30
వెంకటరెడ్డి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
అమరావతి: APMDC మాజీ MD వెంకటరెడ్డి అవినీతి వ్యవహారాలపై ఏసీబీ ఫోకస్.
రాష్ట్రంలోని మైనింగ్ కార్యాలయాలు అన్నింటిలో రికార్డులు పరిశీలిస్తున్న ఏసీబీ.
శనివారం మధ్యాహ్నం నుంచి రికార్డులు పరిశీలన.
ఆదివారం కూడా కొనసాగుతున్న పరిశీలన.
కొన్ని కార్యాలయాల నుంచి రికార్డ్‌లను సీజ్ చేసి తీసుకువెళ్ళిన ఏసీబీ అధికారులు.
2021 నుంచి రికార్డ్ లను పరీశీలిస్తున్న ఏసీబీ.
జేపీ వెంచర్స్ కాంటాక్ట్‌లు, తవ్వకాలు, చెల్లింపులపై ప్రధానంగా ఫోకస్ పెట్టిన ఏసీబీ.
కొంతమంది అధికారులను సోమవారం ఏసీబీ కార్యాలయానికి రావాలని నోటీసులు.
వైసిపితో అంట కాగిన, వెంకటరెడ్డి చెప్పిందల్లా చేసిన అధికారులపై దృష్టి పెట్టిన ఏసీబీ.
రాష్ట్రంలోని పలు కార్యాలయాల్లో ఇంకా కొనసాగుతున్న తనిఖీలు.
పరారీలో వున్న వెంకటరెడ్డి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.
వైసిపి హయాంలో మంత్రులుగా పని చేసిన కొంతమంది పాత్రపై కూడా కూపీ లాగుతున్న ఏసీబీ.
-
2024-08-25T09:49:53+05:30
ఒకే షాపులో పలుమార్లు దొంగతనం.. దొంగ మృతి..
మధురానగర్‌లో ఓ దొంగ మృతి.
మధురానగర్‌లో దొంగను కొట్టి చంపిన పండ్ల వ్యాపారి.
దొంగతనం చేస్తుండగా యువకుడిని పట్టుకున్న పండ్ల వ్యాపారి.
దొంగపై ఇన్పురాడుతో దాడి చేసిన పండ్ల వ్యాపారి.
దెబ్బలకు నడిరోడ్డుపై మృతి చెందిన దొంగ.
పలుసార్లు ఇదే షాపులో దొంగతనాలకు పాల్పడ్డ యువకుడు.
-
2024-08-25T09:49:16+05:30
నార్సింగీలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల అరెస్ట్.
పేకాట ఆడుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ రియల్టర్స్.
పుప్పాల్ గూడ కంట్రీ ఫామ్ అపార్ట్‌మెంట్ లోని ఓ ప్లాట్ పై మాదాపూర్ ఎస్ఓటీ పోలీసుల దాడులు.
చేవెళ్ళ కు చెందిన 21 మంది వ్యాపారులను అదుపులోకి తీసుకున్న ఎస్ఓటీ.
వారు వద్ద నుండి 1లక్ష 50 వేల నగదు, 21 మొబైల్ ఫోన్లు, 6 కార్లు సీజ్.
గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నార్సింగీ పోలీసులు.
-
2024-08-25T09:48:52+05:30
హైదరాబాదులో పలు పబ్బుల్లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలు.
గత కొద్దిరోజులుగా పబ్బులపై స్పెషల్ ఫోకస్ పెట్టిన ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్.
రాత్రి 25 పబ్బులు బార్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్.
పలు బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించిన ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్.
పబ్బుల్లో అనుమానితులకు డ్రగ్ డిటెక్షన్ పరికరం ద్వారా టెస్టులు.
డ్రగ్స్ సరఫరా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని పబ్బు ఓనర్లను హెచ్చరించిన ఎక్సైజ్ పోలీసులు.
-
2024-08-25T08:42:52+05:30
జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతలకు రంగం సిద్ధం.
హైదరాబాద్ : కూల్చివేతలపై దూకుడు పెంచిన హైడ్రా.
111 జీవో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన జన్వాడ ఫామ్ హౌస్ పై హైడ్రా ఫోకస్.
జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతలకు రంగం సిద్ధం.
N కన్వెన్షన్ కూల్చివేతల తర్వాత ప్రముఖుల అక్రమ నిర్మాణాలే టార్గెట్ గా దూసుకుపోతున్న హైడ్రా.
చెరువుల్లో అక్రమంగా నిర్మించిన మల్లారెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నిర్మాణాలపై చర్యలకు సిద్ధం.
మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు భారీగా ఫిర్యాదులు.
వారం రోజుల్లో వ్యవధిలో 70కి పైగా అక్రమ నిర్మాణాల నేలమట్టం చేసిన హైడ్రా.
-
2024-08-25T08:19:18+05:30
Big Breaking: 225 విల్లాలకు నోటీసులు..
మణికొండ చిత్రపురి కాలనీలో 225 విల్లాలకు నోటీసులు..
15 రోజుల్లో నోటీసులకు రిప్లై ఇవ్వాలని సూచించిన మున్సిపల్ కమిషనర్.
జీవో 658కి విరుద్ధంగా 225 ROW హౌస్‌ల నిర్మాణాలు.
జీ+1కి అనుమతులు తీసుకుని జీ+2 నిర్మించారని ఆరోపణలు.
గత పాలకుల నిర్ణయాలతో రూ. 50 కోట్ల నష్టం జరిగిందంటూ ఫిర్యాదులు.
-
2024-08-25T07:58:14+05:30
నేడు ఎన్టీఆర్ భవన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్: నేడు ఎన్టీఆర్ భవన్‌కు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు.
తెలంగాణ తెలుగుదేశం నేతలతో సమావేశంకానున్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు
ఇవాళ మధ్యహాన్నం 3గంకు ఎన్టీఆర్ భవన్‌కు రానున్న సీఎం చంద్రబాబు.
పార్టీ సభ్వత్వం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై టీటీడీపీ నేతలతో దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీకి నూతన అధ్యక్షుడి ఎంపికపై చర్చించే అవకాశం ఉందని సమాచారం.
-
2024-08-25T07:36:41+05:30
మళ్లీ తెరుచుకున్న నాగార్జున సాగర్ గేట్లు..
నల్గొండ : తెరుచుకున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు.
రెండు గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల.
ఇన్ ఫ్లో , అవుట్ ఫ్లో : 64,455 క్యూసెక్కులు.
పూర్తి స్థాయి నీటిమట్టం : 590 అడుగులు, 312.04 టీఎంసీలు
ప్రస్తుత నీటిమట్టం : 590 అడుగులు, 312.04 టీఎంసీలు
-
2024-08-25T07:32:24+05:30
నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.
డెలివరీ కోసం వచ్చిన గర్భిణీపై వైద్యురాలి దాష్టికం.
డెలివరీ కోసం వచ్చిన మాడ్గులపల్లి మండలం గ్యారకుంట పాలెంకు చెందిన గర్భిణీ చెరుకుపల్లి శ్రీలత.
బలవంతంగా ఆపరేషన్ చేయడంతో పండంటి శిశువు మృతి.
గురువారం రాత్రి కుర్చీలో కూర్చొని డెలివరీ అయిన గర్భిణీ ఘటనలో వైద్యురాలిలో రాని మార్పు.
ఘటనపై ఆసుపత్రిని సందర్శించి వైద్య సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన అదనపు కలెక్టర్ పూర్ణ చంద్ర.
ఉన్నతాధికారుల మందలింపుతో నిన్నటి నుండి పట్టించుకోని వైద్య సిబ్బంది.
ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లేందుకు బయటికి పోతుండగా మందలించి ఆపరేషన్ చేస్తామని నమ్మబలికారు.
కోపంతో భయపడినట్టే నటించి ఆపరేషన్ చేసి శిశువును చంపారని బాధితుల ఆరోపణలు.