Share News

Breaking News Live Updates: నేటి తాజా వార్తలు..

ABN , First Publish Date - Dec 18 , 2024 | 02:08 PM

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News Live Updates: నేటి తాజా వార్తలు..
Breaking News

Live News & Update

  • 2024-12-18T17:19:30+05:30

    ప్రముఖ యూట్యూబర్ ప్రసాద్ బెహ్ర అరెస్ట్

    • వెబ్ సీరిస్ షూటింగ్ సమయంలో యువతిని లైంగిక వేధింపులకు గురి చేయడంతో పాటు, పలు మార్లు అసభ్య పదజాలంతో దూషించిన ప్రసాద్ బెహరా.

    • షూటింగ్ సమయంలో యువతి ప్రయివేట్ భాగాలను తాకుతూ అవమానించిన ప్రసాద్ బెహరా.

    • ప్రసాద్ బెహరా వేధింపులపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి.

    • ప్రసాద్ బెహరాపై 75(2),79,351(2)BNS సెక్షన్స్ కింద కేసు నమోదు.

    • ప్రసాద్ బెహరాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించిన పోలీసులు.

    • మా విడాకులు,పెళ్లి వారమండి, మెకానిక్ వెబ్ సిరీస్‌లతో పేరు తెచ్చుకున్న ప్రసాద్ బెహరా.

    • ఇటీవల రిలీజయిన కమిటీ కుర్రాళ్ళు సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రసాద్ బెహరా.

  • 2024-12-18T16:54:54+05:30

    పెనుకొండ లక్ష్మినారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు..

    • గుంటూరు జిల్లా: ప్రముఖ రచయిత పెనుకొండ లక్ష్మినారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు.

    • దీపిక అభ్యుదయ వ్యాస సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు.

    • అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షులుగా ఉన్న పెనుకొండ లక్ష్మినారాయణ.

    • పల్నాడు జిల్లా చెరువుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన లక్ష్మినారాయణ.

    • లక్ష్మి నారాయణ కు ప్రభుత్వ చీఫ్ విప్ జి.వి.ఆంజనేయులు అభినందనలు.

  • 2024-12-18T15:43:35+05:30

    సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సంచలన లేఖ..

    • తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు.

    • దమ్ముంటే ఫార్ములా-ఈ రేస్ అంశంపై రాష్ట్ర శాసనసభలో చర్చ పెట్టాలని సవాల్ విసిరారు.

    • ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం తనపై నిరాధార ఆరోపణలు చేస్తోందన్నారు.

    • కేసులు వేస్తామని.. క్యేబినెట్‌లో గంటన్నరపాటు ఇదే అంశంపై చర్చ జరిగినట్లు వార్తలు వస్తున్నాయన్నారు.

    • ఈ అంశంపై నాలుగు గోడల మధ్య కాకుండా.. అసెంబ్లీలో నాలుగు కోట్ల మంది ప్రజల ముందు చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు.

    • నిజానిజాలేంటో ప్రజలందరికీ తెలియాలన్నారు కేటీఆర్.

  • 2024-12-18T15:25:39+05:30

    కాళేశ్వరంపై విచారణ.. కీలక వివరాలు చెప్పిన ఐఏఎస్ రజత్ కుమార్..

    • నీటి పారుదల శాఖ మాజీ కార్యదర్శి రిటైర్డ్ ఐఏఎస్ రజత్ కుమార్‌ను కాళేశ్వరం కమిషన్ విచారించింది.

    • మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి కారణం గేట్ల ఆపరేషన్స్ సరిగ్గా లేకపోవడమే.

    • అధికారులు ఉన్నతంగా ఆలోచన చేయాలి అన్న కమిషన్ చీఫ్.

    • అధికారులు తప్పులు చేస్తే ప్రజల డబ్బు వృధా అవుతుంది కదా అని ప్రశ్న.

    • రజత్ కుమార్ సమాధానాలపై హర్షం వ్యక్తం చేసిన కమిషన్ చీఫ్.

    • 2015లో అసెంబ్లీలో ప్రాజెక్టుపై ప్రజెంటేషన్ ఇచ్చి 2016లో కేసీఆర్ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చారు.

    • బ్యారేజీలలో నీళ్లను ఎందుకు స్టోర్ చేశారన్న కమిషన్ చీఫ్.

    • మూడు బ్యారేజీలలో నీళ్లను లిఫ్ట్ చేయడం కోసం మాత్రమే స్టోరేజ్ చేశాం.

    • ఎన్నికల కోడ్ వల్ల బ్యారేజీలలో జరిగిన డ్యామేజీలను రిపేర్ చేయలేకపోయాం.

    • ఫీయర్స్ కుంగిపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించిన కమిషన్?

    • బ్యారేజీ ఫౌండేషన్ కింద ఇసుక కొట్టుకపోవడంతో పియర్స్ కృంగిపోయాయి అనే అనుమానం ఉంది.

    • క్వాలిటీ కంట్రోల్ సరిగ్గా లేకపోవడం వల్లనే ప్రమాదం జరిగింది అన్న అభిప్రాయం కూడా ఉంది.

    • మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ తరువాత మరమ్మత్తుల విషయంలో అధికారుల పాత్ర ఏంటి?

    • 2019 నుంచి 2022 వరకు మూడు సంవత్సరాలు వరుసగా వరదలు వచ్చినా బ్యారేజీలు తట్టుకున్నాయి.

    • మూడు సంవత్సరాలలో ఎక్కడా కూడా ఇలాంటి లోపాలు లేకుండా బ్యారేజీలు ఉన్నాయి.

    • నిబంధనల ప్రకారమే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులు జరిగాయి.

    • బ్యారేజీ వద్ద డ్యామేజ్ జరిగితే ఫీల్డ్ లెవల్‌లో అధికారులు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఈఎన్సి బాధ్యత వహించాలి.

    • ఎన్‌డిఎస్ఏ కామెంట్స్‌పై స్పందించని మాజీ ఐఏఎస్ రజత్ కుమార్.

    • కార్పొరేషన్ ద్వారా తీసుకున్న లోన్స్ ఆదాయం వచ్చేవరకు ప్రభుత్వమే కట్టాల్సి ఉంటుంది.

  • 2024-12-18T15:17:38+05:30

    జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు బి రవీంద్రనాథ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

    • హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ అనర్హతపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కో ఆపరేటివ్ సొసైటీ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రారు కు హైకోర్టు ఆదేశం.

    • ఆరు వారాల్లో చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు.

    • హౌసింగ్ సొసైటీ మెంబర్ కాకుండా అధ్యక్షుడుగా రవీంద్రనాథ్ కొనసాగడంపై అభ్యంతరం.

    • కో ఆపరేటివ్ సొసైటీ పట్టించుకోకపోవడంతో హైకోర్టులో పిటిషన్ వేసిన ఇద్దరు సభ్యులు.

  • 2024-12-18T14:58:38+05:30

    సీఎం రేవంత్‌పై హరీష్ రావు షాకింగ్ ఆరోపణలు..

    • డైవర్షన్ పాలిటిక్స్ కోసం రోడ్లపై సీఎం రేవంత్ సర్కస్ ఫీట్లు చేస్తున్నాడు: హరీష్ రావు

    • అదానీతో రేవంత్ రెడ్డిది.. ఢిల్లీలో దోస్తీ..‌ గల్లీలో కుస్తీ.

    • అదానీకి ఏజెంట్ మాదిరి సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు.

    • ట్రాఫిక్ జాం చేసిన ముఖ్యమంత్రి మీద సీవీ ఆనంద్ కేసులు బుక్ చేయాలి.

    • అదానీ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చించాలి.

    • రాజ్ భవన్ వద్ద రేవంత్ మాట్లాడింది నిజమైతే.. తెలంగాణ పరవును కూడా రేవంత్ మంట కలిపిండు.

    • అదానీపై మాట్లాడే ధైర్యం లేకనే.. రేవంత్.. కేసీఆర్, కేటీఆర్ గురించి మాట్లాడుతున్నాడు.

    • కాంగ్రెస్ హైకమాండ్ తిట్టినందుకే అదానీ వంద కోట్లను రేవంత్ రెడ్డి వాపస్ ఇచ్చాడు.

    • అదానీపై పోరాటం నిజమైతే.. 12వేల 400కోట్ల ఒప్పందాలు రద్దు చేసుకోవాలి.

    • రాహుల్ గాంధీని సైతం సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడు.

    • అసెంబ్లీ సాక్షిగా అదానీ, రేవంత్ అక్రమ సంబంధం బయటపెడ్తాం.

    • నేతి బీరకాయలో నెయ్యి ఎంతనో.. రేవంత్ రెడ్డి మాటల్లో నిజమంతే.

    • పోలీసు పహారా మధ్య రామన్నపేటలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుంది.

  • 2024-12-18T14:19:06+05:30

    రాజ్ భవన్ వద్ద కాంగ్రెస్.. అసెంబ్లీ వద్ద బిఆర్ఎస్

    • కాంగ్రెస్, బిఆర్ఎస్ పోటాపోటీ నిరసనలు.

    • అధాని వ్యవహారంపై జేపీసీ వేయాలని కాంగ్రెస్ నిరసన..

    • టిపిసిసి ఆధ్యర్యంలో రాజ్ భవన్ కు నిరసన ర్యాలీ చేపట్టిన కాంగ్రెస్.

    • అదాని విషయంలో కెసిఆర్ స్టాండ్ చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్.

    • అదే సమయంలో అసెంబ్లీలో బిఆర్ఎస్ నిరసన.

    • అదాని, రేవంత్ భాయ్ భాయ్ అంటూ నినాదాలు

    • ప్రధాని రేవంత్ రెడ్డి కలిసిన ఫోటోలు ప్రదర్శిస్తూ అసెంబ్లీ లాబీల నుంచి మీడియా పాయింట్ వరకు వెళ్లిన బిఆర్ఎస్ ఎమ్మేల్యేలు.

  • 2024-12-18T14:16:26+05:30

    అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి షాక్..

    • అల్లు అర్జున్ అరెస్ట్ తరువాత సోషల్ మీడియా పోస్టులపై 4 కేసులు నమోదు.

    • ప్రభుత్వం, సీఎం రేవంత్ పై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారి మీద కేసులు నమోదు.

    • పలువురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు.

    • కేసులు నమోదు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.

    • నిందితులపై ఐటి యాక్ట్‌తో పాటు BNS 352, 353(1)(b) సెక్షన్ల కింద కేస్ నమోదు.

  • 2024-12-18T14:13:39+05:30

    త్వరలో రాష్ట్రపతి భవన్ కూడా ముట్టడిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

    • అదానీ విషయంలో మీ వైఖరి ఏంటో రేపు పొద్దున్న వరకు కేసీఆర్ చెప్పాలి.

    • అదానీ విషయంలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు రాజ్యసభ చైర్మన్ కి లేఖ రాయాలి.

    • ప్రజాకోర్టులో ప్రధానిని శిక్షించేదాక కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతోంది.

    • ప్రధాని పట్టించుకోవడం లేదనే రోడ్లపైకి రావాల్సి వచ్చింది.

  • 2024-12-18T14:08:20+05:30

    Breaking News Live Updates in Telugu: కాంగ్రెస్ ఆందోళనలు..

    • రాజ్ భవన్ బయల్దేరిన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు

    • గవర్నర్ కి వినతి పత్రం ఇవ్వనున్న కాంగ్రెస్ నేతలు

    • ప్రారంభమైన కాంగ్రెస్ నిరసన ర్యాలీ

    • ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్ భవన్ కు బయలుదేరిన నేతలు

    • ర్యాలీలో సీఎంతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు