-
-
Home » Mukhyaamshalu » Today Telugu Breaking News Monday 9th December 2024 Live Updates Siva
-
Breaking News: అమ్మాయిలను చెప్పుతో కొట్టించిన వార్డెన్
ABN , First Publish Date - Dec 09 , 2024 | 09:01 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
2024-12-09T21:52:08+05:30
అమ్మాయిలను చెప్పుతో కొట్టించిన వార్డెన్
చాదర్‌ఘాట్‌లోని ఎస్సీ ప్రభుత్వ బాలికల హాస్టల్‌లో వార్డెన్ దాష్టికo
హాస్టల్ విద్యార్థుల మధ్య స్వల్ప వివాదo నేపథ్యంలో తల్లిదండ్రులను పిలిపించి ఇతర విద్యార్థులపై దాడి
ఓ బాలిక తల్లిదండ్రులతో పలువురు హాస్టల్ విద్యార్థినులను చెప్పుతో కొట్టించిన వార్డెన్
అడ్డుకునేందుకు యత్నించిన బాలికలపై చేయి చేసుకున్న వార్డెన్
భయంతో బాలికలు బయటకు వెళ్లేందుకు యత్నించగా.. హాస్టల్ గేటుకు తాళం వేయించిన వార్డెన్
హస్టల్ భవనం పైనుంచి మరో భవనంపైకి దూకి ముగ్గురు బాలికలు పరారీ
భయాందోళనలో హాస్టల్ బాలికలు
వార్డెన్ శాంతి అక్రమాలపై అధికారులకుమూడు నెలల క్రితం విద్యార్థుల పిర్యాదు
ఈ హాస్టల్‌లో 150 మంది ఇంటర్, డిగ్రీ చదవుతున్న అమ్మాయిలు
హాస్టల్ వద్ద విద్యార్థుల ఆందోళన, పరిస్థితి ఉద్రిక్తం
హాస్టల్ కు చేరుకున్న పోలీసులు
-
2024-12-09T20:45:44+05:30
టీడీపీ రాజ్యసభ సభ్యులు ఖరారు
టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యులు ఖరారు
బీద మస్తాన్ రావు, సానా సతీష్ పేర్లు ఖరారు చేసిన అధిష్టానం
ఇప్పటికే బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య పేరు ఖరారు
త్వరలో ఏపీ కేబినేట్‌లోకి పవన్ సోదరుడు నాగబాబు
-
2024-12-09T20:26:44+05:30
బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి గుర్తింపు..
పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని గుర్తించిన కృష్ణలంక పోలీసులు.
లబ్బీపేట వాటర్ ట్యాంక్ రోడ్ లో ఉంటున్న మల్లికార్జున్‌గా గుర్తించిన పోలీసులు
అతని సెల్ ఫోన్ ట్రాక్ చేసిన పోలీసులు.
లబ్బీపేటకి వెళ్లేసరికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన మల్లికార్జున్
సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అతని కోసం గాలిస్తున్న పోలీసులు
-
2024-12-09T19:13:17+05:30
సచివాలయం వద్ద డ్రోన్ షో
తెలంగాణ సచివాలయం వద్ద డ్రోన్ షో
డ్రోన్ షో ద్వారా ప్రభుత్వ పథకాల ప్రదర్శన
-
2024-12-09T19:11:28+05:30
ఆర్మీ జవాన్ మృతి
జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లా థానేదార్ టెక్రీలో విషాదం
మైన్ పేలడంతో పెట్రోలింగ్ విధుల్లో ఉన్న ఆర్మీ జవాన్ సుబ్బయ్య వరికుంట మృతి
25వ రాష్ట్రీయ రైఫిల్స్ విభాగంలో హవాల్దార్ ర్యాంక్‌లో ఉన్న సుబ్బయ్య
-
2024-12-09T19:09:51+05:30
ఢిల్లీకి సీతక్క
ఢిల్లీకి రావాలని మంత్రి సీతక్కకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు
రాత్రి ఢిల్లీకి వెళ్లనున్న సీతక్క
రేపు రాహుల్ గాంధీతో సమావేశం కానున్న సీతక్క
రాహుల్‌తో సమావేశంపై ఆసక్తి
సడన్‌గా సీతక్కను ఢిల్లీకి పిలవడంపై రాజకీయవర్గాల్లో ఆసక్తి
-
2024-12-09T18:47:25+05:30
స్టేషన్‌కు మంచు మనోజ్
పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న మంచు మనోజ్
తనపై దాడికి సంబంధించి రాత పూర్వకంగా పిర్యాదు
తనపై దాడి చేసిన వారి వివరాలు పోలీసులకు ఇవ్వనున్న మనోజ్
-
2024-12-09T18:36:52+05:30
పోలీస్ స్టేషన్‌కు మంచు మనోజ్
జలపల్లి నివాసం నుంచి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌కి బయలుదేరిన మంచు మనోజ్
రాత పూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు మంచు మనోజ్ స్టేషన్‌కు వెళ్లారంటూ ప్రచారం
-
2024-12-09T18:34:04+05:30
పవన్‌కు బెదిరింపు కాల్‌పై హోంమంత్రి ఆరా
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయానికి వచ్చిన బెదిరింపు కాల్స్ పై హోంమంత్రి అనిత ఆరా
మెసేజ్ లు, పోన్ కాల్స్‌పై పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి విషయాలు తెలుసుకున్న హోంమంత్రి అనిత
కాల్స్, మెసేజ్‌లపై వెంటనే దర్యాప్తు చేసి.. నిందితులను పట్టుకోవాలని ఆదేశాలు
ఎక్కడి నుంచి కాల్స్ వచ్చాయనే దానిపై దృష్టి సారించిన సైబర్ క్రైం పోలీసులు
-
2024-12-09T18:19:48+05:30
డిప్యూటీ సీఎం పవన్ పేషీకి బెదిరింపు కాల్
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్
చంపేస్తామని హెచ్చరిస్తూ ఆగంతకుడి నుంచి ఫోన్ కాల్
ఉప ముఖ్యమంత్రిని ఉద్దేశించి అభ్యంతకర భాషతో హెచ్చరిస్తూ సందేశాలు పంపించిన ఆగంతకుడు
పవన్ కళ్యాణ్ దృష్టికి బెదిరింపు కాల్స్ విషయాన్ని తీసుకెళ్లిన సిబ్బంది
బెదిరింపు కాల్స్ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు తెలియచేసిన డిప్యూటీ సీఎం పేషీ అధికారులు
-
2024-12-09T17:41:08+05:30
ఆర్‌బిఐకి కొత్త గవర్నర్
భారతీయ రిజర్వు బ్యాంక్ కొత్త గవర్నర్ నియామకం
ఆర్‌బిఐ కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా
మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్న సంజయ్ మల్హోత్రా
ప్రస్తుతం ఆర్థిక శాఖలో రెవెన్యూ కార్యదర్శిగా సంజయ్ మల్హోత్రా
రేపటితో ముగియనున్న ప్రస్తుత గవర్నర్ శక్తికాంత్ దాస్ పదవీకాలం
-
2024-12-09T16:58:33+05:30
డిసెంబర్ 15న మాలల మహాగర్జన
విజయవాడలో డిసెంబర్ 15న మాలల మహాగర్జన సభ నిర్వహిస్తామన్న అఖిల భారత మాలల జేఏసీ చైర్మన్ దేవీశ్రీప్రసాద్
డిసెంబర్ 15 మహాగర్జన సభకు మాలలు భారీగా తరలివస్తారన్న దేవీశ్రీప్రసాద్
ఎస్సీ వర్గీకరణను మాలలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు
ఈఅంశంపై సుప్రీం కోర్టులోనే విభిన్న జడ్జిమెంట్లు వచ్చాయన్న దేవీశ్రీప్రసాద్
29 రాష్ట్రాల్లో 22 రాష్ట్రాలు వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నాయి
ముందు జనాభా లెక్కలు తీసి, కులగణన చేయాలని అఖిల భారత మాలల జేఏసీ డిమాండ్
-
2024-12-09T16:54:52+05:30
పల్సర్ బైక్ నుంచి మంటలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో పల్సర్ బైక్ నుంచి మంటలు
డ్రైవింగ్‌లో ఉండగానే అప్రమత్తమైన వాహనదారుడు
మంటలను ఆర్పిన స్థానికులు
ఆళ్లగడ్డ పట్టణంలో ఘటన
-
2024-12-09T16:47:22+05:30
జానీ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు..
తనపై ఆరోపణలు నిర్థారణ కాలేదన్న జానీ మాస్టర్
నిర్ధారణకాని ఆరోపణలు కారణంగా చూపిస్తూ తనతను యూనియన్ నుంచి శాశ్వతంగా తొలగించినట్లు పుకార్లు పుట్టిస్తున్నారు
పుకార్లను నమ్మవద్దన్న జానీ మాస్టర్
తనకు ఇంకా పదవీ కాలం ఉందన్న జానీ మాస్టర్
అనధికారికంగా, అనైతికంగా ఎన్నికలు నిర్వహించి వారికి వారే ఏకపక్ష నిర్ణయాలు, హోదాలు తీసుకునే హక్కు ఎవరికి లేదన్న జానీ మాస్టర్
అనైతిక చర్యలకు పాల్పడినవారిపై చర్యల కోసం చట్టపరంగా పోరాడతా
టాలెంట్ ఉన్నవారికి పనివ్వకుండా, దొరక్కుండా ఆపలేరు
నా కొరియోగ్రఫీలో గేమ్ చేంజర్ నుంచి ఓ మంచి పాట రాబోతుంది
మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుందన్న జానీ మాస్టర్
-
2024-12-09T12:19:45+05:30
మనోజ్ మెడికల్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు..
ఏబీఎన్-ఆంధ్రజ్యోతి చేతిలో మంచు మనోజ్ మెడికల్ రిపోర్ట్.
ఎడమవైపు ఉన్న భుజం కి గాయం అయినట్లు మెడికల్ రిపోర్ట్‌లో పేర్కొన్న వైద్యులు.
మంచు మనోజ్ కుడివైపు భుజంకి ఫ్యాక్చర్ అయినట్లు గుర్తింపు.
జల్లిపల్లి ఫామ్ హౌస్‌లో గుర్తు తెలియని వ్యక్తులు మంచు మనోజ్‌పై దాడి చేసినట్లు మెడికల్ రిపోర్ట్ పేర్కొన్న వైద్యులు.
వెన్నుముకపై దాడి జరిగినట్లు గుర్తింపు.
సిటీ స్కాన్, అల్ట్రా సౌండ్ పరీక్షలు నిర్వయించిన వైద్యులు.
పొట్ట, వెన్న పూస, నెక్‌కు కనిపించని గాయం అయినట్లు గుర్తింపు.
-
2024-12-09T11:02:59+05:30
Big Breaking: వైసీపీ నేతకు ఊరట.. హైకోర్టు కీలక తీర్పు..
అమరావతి: హైకోర్టు తీర్పుతో వైసీపీ నేతకు ఊరట లభించింది.
సినీనటి జాత్వని ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు.
-
2024-12-09T10:37:04+05:30
ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
సీఎం రేవంత్, అదానీ ఫోటోతో ఉన్న టీషర్ట్స్ ధరించినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్న పోలీసులు.
ట్రాక్టర్‌పై అసెంబ్లీకి హాజరైన బీజేపీ ఎమ్మెల్యేలు.
-
2024-12-09T10:18:12+05:30
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్..
అసెంబ్లీ గేట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అరెస్ట్.
అదానీ, రేవంత్ ఫోటోస్ ఉన్న టీ షర్ట్స్‌ను తీసివేయాల్సిందేనంటోన్న పోలీసులు.
టీ షర్ట్స్ తొలగించేది లేదంటోన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
పోలీసుల తీరుపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం.
బీఆర్ఆఎస్ ఎమ్మెల్యేలను ప్రత్యేక వాహనాల్లో తరలిస్తోన్న పోలీసులు.
-
2024-12-09T09:40:13+05:30
Big Breaking: మంచు ఫ్యామిలీలో కొనసాగుతున్న హైడ్రామా.. హైదరాబాద్‌కు విష్ణు..
మంచు ఫ్యామిలీ లో కొనసాగుతున్న హైడ్రామా.
తన తండ్రి అనుచరులు దాడి చేశారంటూ నిన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న మంచి మనోజ్.
ఒంటిమీద గాయాలైనట్టు నిర్ధారించిన వైద్యులు.
నేడు మరోసారి ఆస్పత్రికి వెళ్లనున్న మంచు మనోజ్.
మోహన్ బాబు అనుచరులు మంచు మనోజ్‌పై దాడి నేపథ్యంలోదుబాయ్ నుంచి హైదరబాద్ చేరుకున్న మంచు విష్ణు.
మరికాసేపట్లో జల్‌పల్లిలోని మంచు మనోజ్ ఇంటికి వెళ్ళనున్న విష్ణు.
జల్‌పల్లిలో ఉంటున్న మంచు మనోజ్ ఇంటికి వచ్చిన విష్ణు పాట్నర్ విజయ్.
మనోజ్ ఇంటి సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ తీసుకెళ్లిన విజయ్.
మంచు మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు మనుషులు కాపలా.
-
2024-12-09T09:34:28+05:30
కాంగ్రెస్‌కు కౌంటర్‌గా బీఆర్ఎస్.. మేడ్చల్‌లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
అధికార కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కౌంటర్ కార్యక్రమం.
నేడు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టిస్తోన్న తెలంగాణ ప్రభుత్వం.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టిస్తోంది తెలంగాణ తల్లి కాదు.. కాంగ్రెస్ తల్లి అంటోన్న బీఆర్ఎస్.
తెలంగాణ తల్లి పాత విగ్రహ రూపాన్నే కొనసాగించాలంటోన్న బీఆర్ఎస్.
ప్రభుత్వానికి కౌంటర్‌గా మేడ్చల్‌లో తెలంగాణ తల్లి పాత రూపం విగ్రహాన్ని ప్రతిష్టిస్తోన్న బీఆర్ఎస్.
సీఎం రేవంత్ సచివాలయంలో ప్రతిష్టిస్తోన్న సమయంలోనే.. మేడ్చల్ కార్యక్రమంలో పాల్గొననున్న కేటీఆర్.
-
2024-12-09T09:34:05+05:30
గన్‌పార్క్ వద్ద హై టెన్షన్ వాతావరణం..
హైదరాబాద్ : గన్ పార్క్ వద్ద హై టెన్షన్ వాతావరణం.
గన్ పార్క్ అమరవీరుల స్థూపం దగ్గరకు చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు.
తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడంపై నిరసన.
గన్ పార్క్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు.
-
2024-12-09T09:26:01+05:30
నటి జత్వాని కేసులో నేడు కీలక తీర్పు..
అమరావతి: ముంబై నటి జత్వని కేసులో నిందితుడు కుక్కల విద్యాసాగర్ బెయిల్‌పై నేడు తీర్పు ఇవ్వనున్న ఏపీ హైకోర్టు.
కేసులో బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేసిన నిందితుడు వైసిపి నేత కుక్కల విద్యాసాగర్.
జత్వానీ, పోలీసుల తరుపు వాదనలు వినిపించిన న్యాయవాది నర్రా శ్రీనివాస్,పీపీ లక్ష్మీ నారాయణ.
బెయిల్ మంజూరు చేస్తే నిందితుడు కేసును ప్రభావితం చేస్తారని కోర్టుకు తెలిపిన న్యాయవాది నర్రా శ్రీనివాస్.
నిందితుడు తరుపు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి.
నిందితుడు ఇప్పటికే 76 రోజులుగా జైలులో ఉన్నాడని కోర్టుకు తెలిపిన విద్యాసాగర్ తరుపు న్యాయవాది నిరంజన్ రెడ్డి.
ఇరుపక్షాల వాదనలు పూర్తి.
ఈ కేసుపై నేడు తీర్పు ఇవ్వనున్న హైకోర్టు.
-
2024-12-09T09:01:57+05:30
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ఉదయం 10:30గంటలకు శాసన సభ, శాసన మండలి ఉభయ సభలు ప్రారంభం.
మొదటి రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేయనున్న సిఎం రేవంత్ రెడ్డి.
నేడు శాసనసభ ముందుకు రానున్న ఐదు ఆర్డినెన్సులు, రెండు వార్షిక నివేదికలు.
తెలంగాణ జీతాలు మరియు పింఛను చెల్లింపు మరియు అనర్హతల తొలగింపు (సవరణ) ఆర్డినెన్సును సభలో ప్రవేశ పెట్టనున్న సిఎం రేవంత్ రెడ్డి.
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (సవరణ) ఆర్డినెన్సు 2024 ను సభలో ప్రవేశపెట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి.
హైదరాబాదు మహానగర పాలక సంస్థ (సవరణ) ఆర్డినెన్సు 2024 ప్రవేశ పెట్టనున్న సిఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణ వస్తువుల మరియు సేవల పన్ను (సవరణ) ఆర్డినెన్సు 2024ను సభలో ప్రవేశపెట్టనున్న సిఎం.
తెలంగాణ పంచాయతీ రాజ్ (సవరణ) ఆర్డినెన్సు 2024ను సభలో ప్రవేశ పెట్టనున్న మంత్రి సీతక్క.
తెలంగాణ విద్యుత్ ఆర్థిక సంస్థ లిమిటెడ్ 9వ వార్షిక నివేదిక 2022-23 ప్రతిని సభకు నివేధించనున్న డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క.
తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ లిమిటెడ్ 7వ వార్షిక నివేదిక 2021-22 ప్రతిని సభకు నివేదించనున్న మంత్రి కొండా సురేఖ.