Share News

Building Collapsed: మూడంతస్తుల భవనం కూలి 10 మంది మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు

ABN , Publish Date - Sep 15 , 2024 | 09:45 AM

మూడంతస్తుల భవనం ఆకస్మాత్తుగా కూలీపోవడంతో(building collapsed) 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో శిథిలాలలో చిక్కుకున్న మొత్తం 15 మందిలో 14 మందిని బయటకు తీయగా, వారిలో 10 మంది మరణించారు. ఈ విషాధ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ నగరం జాకీర్ కాలనీలో చోటుచేసుకుంది.

 Building Collapsed: మూడంతస్తుల భవనం కూలి 10 మంది మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
Uttar Pradesh Meerut

ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh)లోని మీరట్ నగరం జాకీర్ కాలనీ ప్రాంతంలో మూడంతస్తుల భవనం కుప్పకూలడంతో(building collapsed) 10 మంది మరణించారు. సమాచార శాఖ ప్రకారం శిథిలాలలో చిక్కుకున్న మొత్తం 15 మందిలో 14 మందిని బయటకు తీయగా, వారిలో 10 మంది మరణించారు. NDRF, SDRF బృందాలు మీరట్‌లోని జాకీర్ కాలనీలో తమ రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా శిథిలాల కింద చిక్కుకున్న వారిని స్నిఫర్ డాగ్‌లను ఉపయోగించి గుర్తించారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో మరో ఆరుగురు శిథిలాలలో చిక్కుకోగా, వీరికి గాయాలైనట్లు తెలుస్తోంది.


ప్రమాద సమయంలో

ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో దాదాపు 15 మంది ఉన్నారని మీరట్ జిల్లా మేజిస్ట్రేట్ దీపక్ మీనా తెలిపారు. ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకున్న వారందరినీ రక్షించారు. ఆదివారం ఉదయం శిథిలాల నుంచి ఐదుగురిని బయటకు తీశారు. ఈ సందర్భంగా రాత్రంతా అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పుడు ప్రజలను రక్షించిన తర్వాత, జంతువులు రక్షించబడుతున్నాయి. జిల్లా మేజిస్ట్రేట్ దీపక్ మీనా తెలిపిన వివరాల ప్రకారం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న జంతువులను వీలైనంత త్వరగా రక్షించడమే మా ప్రయత్నమని ఆమె అన్నారు.


ప్రమాదం ఎలా జరిగింది?

లోహియా నగర్ ప్రాంతంలోని జాకీర్ కాలనీలో శనివారం ఈ ప్రమాదం జరిగినట్లు డీఎం తెలిపారు. ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన 15 మంది ఉన్నారు. ఇల్లు చాలా పాతది కావడంతో నిరంతర కురుస్తున్న భారీ వర్షాలు ఇంటిపై ప్రభావం చూపించాయి. ఆ క్రమంలోనే మూడంతస్తుల ఇల్లు ఒక్కసారిగా నేలకూలింది. ఇంటి కింది అంతస్తులో డెయిరీని నిర్వహిస్తున్నారు. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో పశువులు కూడా శిథిలాల కింద కూరుకుపోయాయి. విచారణ తర్వాతే ప్రమాదానికి నిజమైన కారణాలు తెలుస్తాయి. ఇంటి యజమానిని అల్లావుద్దీన్‌గా గుర్తించారు. ఆ భవనంలో డెయిరీని నడుపుతున్నాడు. ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రుల చికిత్సకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారు.


ఇవి కూడా చదవండి:

Rain Alert: వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు


Neeraj Chopra: నీరజ్ చోప్రాకు మళ్లీ షాక్.. డైమండ్ లీగ్ టైటిల్ కొంచెంలో మిస్

Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు

Read LatestNational NewsandTeluguNews

Updated Date - Sep 15 , 2024 | 10:13 AM