Ayodhya: అయోధ్యకు 11 వేల మంది అతిథులు, 2 బాక్సుల్లో కానుకలు
ABN , Publish Date - Jan 11 , 2024 | 12:11 PM
అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. 22వ తేదీన ప్రధాని మోదీ ప్రాణ ప్రతిష్ట చేస్తారు. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ 11 వేల మందిని స్వయంగా ఆహ్వానించింది.
అయోధ్య: అయోధ్యలో (Ayodhya) రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. 22వ తేదీన ప్రధాని మోదీ (PM Modi) ప్రాణ ప్రతిష్ట చేస్తారు. 11 వేల మంది అతిథులకు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ స్వయంగా ఆహ్వానించింది. రామ మందిరాన్ని నిర్మించిన కూలీలు కుటుంబ సభ్యులతో హాజరవుతారని ట్రస్ట్ ప్రకటనలో తెలిపింది.
అయోధ్యకు వచ్చే అతిథులకు (Guests) 12వ తేదీ శుక్రవారం నుంచి సనాతన్ సేవా న్యాస్ కానుకలను అందజేయనుంది. రెండు బాక్సుల్లో గిప్ట్స్ (Gifts) ఉంటాయి. ఒకదానిలో ప్రసాదం (Prasad), బేసన్ లడ్డు, తులసీ ఆకులు ఉంటాయి. మరో బాక్స్‌లో రామాలయ నిర్మాణ సమయంలో తీసిన మట్టి, సరయు నదీ నీరు, మెమోంటో ఉంచారు. ఇత్తడి ప్లేట్, వెండి నాణెం కూడా ఉన్నాయి. రెండు గిప్ట్స్ బాక్సులను (Gift Box) ఒక బ్యాగులో ఉంచారు. శ్రీరాముడిని దర్శించుకున్న తర్వాత అతిథులకు కానుకలను అందజేస్తారు. అయోధ్యకు భారీగా భక్తుల రావడంతో ఆధ్మాత్మిక శోభ సంతరించుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.