CAA: ఫస్ట్ బ్యాచ్ 14 మందికి పౌరసత్వ సర్టిఫికెట్లు
ABN , Publish Date - May 15 , 2024 | 09:21 PM
దేశంలో పౌరసత్వ సవరణ చట్టం నోటిఫై అయిన సుమారు రెండు నెలల తర్వాత తొలిసారి 14 మందికి కేంద్ర ప్రభుత్వం భారత పౌరసత్వం కల్పించింది. ఇందుకు సంబంధించిన సర్టిఫెకెట్లను తొలి బ్యాచ్‌కు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ భల్లా బుధవారంనాడు ప్రదానం చేశారు.
న్యూఢిల్లీ: దేశంలో పౌరసత్వ సవరణ చట్టం (CAA) నోటిఫై అయిన సుమారు రెండు నెలల తర్వాత తొలిసారి 14 మందికి కేంద్ర ప్రభుత్వం భారత పౌరసత్వం కల్పించింది. ఇందుకు సంబంధించిన సర్టిఫెకెట్లను తొలి బ్యాచ్‌కు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ భల్లా బుధవారంనాడు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ పోస్ట్స్, డైరెక్టర్ (ఐబీ), రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
Lok Sabha Elections: కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతుపై మమత కీలక వ్యాఖ్యలు
సీఏఏ ప్రకారం 2014 డిసెంబర్ 31కి ముందు దేశంలోకి పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పిస్తారు. 2019లో పార్లమెంటులో ఆమోదం పొందిన ఈ బిల్లును ఇటీవల కేంద్రం అమల్లోకి తెచ్చింది. దేశంలోకి వలస వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు సీఏఏ వర్తిస్తుంది.
Read Latest National News and Telugu News