Home » CAA
దేశంలో పౌరసత్వ సవరణ చట్టం నోటిఫై అయిన సుమారు రెండు నెలల తర్వాత తొలిసారి 14 మందికి కేంద్ర ప్రభుత్వం భారత పౌరసత్వం కల్పించింది. ఇందుకు సంబంధించిన సర్టిఫెకెట్లను తొలి బ్యాచ్‌కు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ భల్లా బుధవారంనాడు ప్రదానం చేశారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం బీజేపీకి ఓ సవాల్ విసిరారు. త్వరలో రాబోయే ఎన్నికల్లో 400కు పైగా సీట్లు గెలుస్తామని చెప్పుకుంటున్న బీజేపీ.. కనీసం 200 స్థానాల్లో అయినా గెలిచి చూపించాలని ఛాలెంజ్ చేశారు. అంతేకాదు.. బెంగాల్ రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం అమలును తాము ఏమాత్రం అనుమతించబోమని తేల్చి చెప్పారు.
భారతదేశంలోని రోహింగ్యా ముస్లింలకు శరణార్థుల హోదా కల్పించాలనే డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇది అస్సలు జరగదని స్పష్టం చేసింది. వారికి ఇండియాలో స్థిరపడే హక్కు లేదని వివరించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ( Supreme Court ) కు తెలిపింది.
పౌరసత్వ సవరణ చట్టం (CAA) నిబంధనలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. పిటిషన్లపై కేంద్రప్రభుత్వం తన స్పందన తెలియజేయాలంటూ తదుపరి విచారణకు ఏప్రియల్9వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈకేసును విచారించింది.
పౌరసత్వ సవరణ చట్టం అమలుపై కొన్ని వర్గాల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. సీఏఏను సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం నాడు విచారణ చేపట్టనుంది. సీఏఏ అమలు, పౌరసత్వ సవరణ నిబంధనలు 2024పై 200కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై ఈ రోజు విచారణ జరగనుంది.
సీఏఏపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు రాజుకుంటున్నాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని కొందరు వ్యతిరేకిస్తుండగా మరికొందరు స్వాగతిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు రాజకీయ నేతలు చేసిన కామెంట్లు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
సీఏఏపై అమెరికా చేసిన కామెంట్లపై భారత తరఫు నిపుణులు ఘాటుగా స్పందిస్తున్నారు. భారతదేశంలో మత స్వేచ్ఛ, దాని ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నామన్న అమెరికా సీఏఏ అమలును అమెరికా ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని US స్టేట్ డిపార్ట్‌మెంట్ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.
తమ దేశంలో ఉన్న ఆర్థిక సంక్షోభంతో (Financial Crisis) పాటు మరెన్నో సమస్యల పరిష్కారంపై పాకిస్తాన్ (Pakistan) దృష్టి పెట్టకుండా.. భారత్‌పై (India) అక్కసు వెళ్లగక్కడమే పనిగా పెట్టుకుంది. అంతర్జాతీయ వేదికలపై భారత్‌పై అవమానపరిచేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ.. పాక్ పన్నుతున్న వ్యూహాలు ప్రతిసారి బెడిసికొడుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఆ దాయాది దేశం వేసిన ఎత్తుగడ బోల్తా కొట్టేసింది. అయోధ్య, సీఏఏ అంశాలను ప్రస్తావించి.. భారత్ చేతిలో అభాసుపాలయ్యింది.
పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుపై స్టే విధించాలని కోరుతూ AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేంద్రం మార్చి 11న పౌరసత్వ (సవరణ) చట్టం, 2019ని అమలు చేసి.. నాలుగు నిబంధనలను నోటిఫై చేసింది.
పొరుగు దేశాల నుంచి ఇండియాలో శరణార్థులుగా ఉంటున్న వారు దేశ రాజధాని దిల్లీలో చేసిన నిరసనలపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరంతా జైలులో ఉండాల్సి వారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.