Share News

Maharastra: స్టీల్ ఫ్యాక్టరీలో పేలుడు: 22 మంది కార్మికులకు గాయాలు

ABN , Publish Date - Aug 24 , 2024 | 06:19 PM

మహారాష్ట్రలోని జాల్నా నగరంలోని ఎంఐడీసీ ప్రాంతంలో గజ కేసరి స్టీల్ ఫ్యాక్టరీ మిల్‌లో బాయిలర్‌ పేలింది. ఈ ఘటనలో 22 మంది కార్మికులు గాయపడ్డారని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.

Maharastra: స్టీల్ ఫ్యాక్టరీలో పేలుడు: 22 మంది కార్మికులకు గాయాలు

ముంబయి, ఆగస్ట్ 24: మహారాష్ట్రలోని జాల్నా నగరంలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక ఎంఐడీసీ ప్రాంతంలోని గజ కేసరి స్టీల్ ఫ్యాక్టరీ మిల్‌లో బాయిలర్‌ పేలింది. ఈ ఘటనలో 22 మంది కార్మికులు గాయపడ్డారని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. వారిని ఆసుపత్రికి తరిలించినట్లు తెలిపారు. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని.. మెరుగైన వైద్య చికిత్స కోసం వారిని చత్రపతి శంభాజీనగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

Also Read: Uttar Pradesh: పీఎం మోదీ, సీఎం యోగిలను ప్రశంసించి భార్య.. ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త


బాయిలర్ పేలుడు కారణంగా.. అధిక ఉష్ణోగ్రతలో ఉన్న ఉక్కు ద్రావకం కార్మికులపై పడిందని వివరించారు. ఈ ఘటనలో క్షతగాత్రుల నుంచి వాంగ్మూలం తీసుకున్నామన్నారు. అలాగే కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Also Read: RG Kar college ex-principal: ప్రొ. సందీప్ ఘోష్‌పై సీబీఐ కేసు నమోదు


మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం సెజ్‌లో ఎసెన్షియా పార్మా కంపెనీలో ఇటీవల భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించారు. దాదాపు 50 మంది వరకు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం వెంటనే స్పందించి.. సహాయక చర్యలు చేపట్టింది.ఈ ఘటన స్థలాన్ని సైతం సీఎం చంద్రబాబు పరిశీలించారు.

Also Read: Mumbai Dating scam: అబ్బాయిలను బురిడీ కొట్టిస్తున్న అందమైన అమ్మాయిలు


అనంతరం బాధిత కుటుంబాలతో మాట్లాడి వారికి సీఎం భరోసా కల్పించారు. ఈ ఘటనలో మృతి చెందిన ఒక్కొక్కరికి రూ. కోటి ఆర్థిక సాయంగా సీఎం ప్రకటించారు. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 25 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేస్తామన్నారు.

Jammu Kashmir Assembly Elections: నేషనల్ కాన్ఫరెన్స్‌లో నేతలు తిరుగుబాటు

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Aug 24 , 2024 | 06:19 PM