Ayodhya: అయోధ్యలో విషాదం.. సరయూలో మునిగి జల సమాధి
ABN , Publish Date - Mar 10 , 2024 | 07:07 PM
అయోధ్య(Ayodhya) రామ్ లల్లాను దర్శించుకోవడానికి వచ్చిన ముగ్గురు సరయూ నదిలో(Saryu River) జల సమాధి అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని కాన్పూర్‌కి చెందిన స్నేహితులు రవి మిశ్రా (20), ప్రియాంషు సింగ్ (16), హర్షిత్ అవస్థి (18)లు అయోధ్య రాముడి దర్శనం కోసం ఆదివారం వచ్చారు.
అయోధ్య: అయోధ్య(Ayodhya) రామ్ లల్లాను దర్శించుకోవడానికి వచ్చిన ముగ్గురు సరయూ నదిలో(Saryu River) జల సమాధి అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని కాన్పూర్‌కి చెందిన స్నేహితులు రవి మిశ్రా (20), ప్రియాంషు సింగ్ (16), హర్షిత్ అవస్థి (18)లు అయోధ్య రాముడి దర్శనం కోసం ఆదివారం వచ్చారు.
స్నానం ఆచరించి గుడిలోకి వెళ్దామనుకున్నవారు సరయూ నదీ తీరానికి వెళ్లారు. సాధారణంగా స్నానాలు ఆచరించే ఘాట్‌కి వెళ్లకుండా రామ్ కథా పార్కు సమీపంలోని శ్మశాన వాటిక పక్కనే ఉన్న నది ఒడ్డుకు చేరుకున్నారు.
అనంతరం ఒక్కొక్కరుగా నదిలోకి దిగారు. వాళ్లు దిగిన ప్రాంతం లోతుగా ఉండటంతో ఈత రాక మునివడంతో అక్కడే జల సమాధి అయ్యారు. స్థానికులు వారిని గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకి తీయించి.. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. నదిలో స్నానానికి వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి