Cabinet decisions: 3 మెట్రో రైల్, 2 ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
ABN , Publish Date - Aug 16 , 2024 | 09:39 PM
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారంనాడు జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మూడు కీలక రైలు ప్రాజెక్టులు, రెండు కొత్త ఎయిర్ పోర్ట్ ఫెసిలిటీలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. క్యాబినెట్ కీలక నిర్ణయాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరించారు.
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అధ్యక్షతన శుక్రవారంనాడు జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మూడు కీలక రైలు ప్రాజెక్టులు, రెండు కొత్త ఎయిర్ పోర్ట్ ఫెసిలిటీలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. క్యాబినెట్ కీలక నిర్ణయాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరించారు.
Parliament: పార్లమెంటులో ప్రజా పద్దుల సంఘం ఏర్పాటు.. ఛైర్మన్‌గా కేసీ వేణుగోపాల్
థానే సమగ్ర రింగ్ మెట్రో రైల్ ప్రాజెక్టు, పుణే మెట్రో ఫేజ్-1, బెంగళూరు మెట్రో ఫేజ్-3 రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు మంత్రి తెలిపారు. బెంగళూరు మెట్రో ఫేజ్-3 నిర్మాణంలో భాగంగా 44.65 కిలోమీటర్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2020 నాటికి ఫేజ్-3 మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నారు. బెంగళూరు మెట్రో రైలు ప్రాజక్టుకు రూ.15,611 కోట్లను కేంద్రం కేటాయించింది. థానే ఇంటిగ్రల్ రింగ్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ.12,200.10 కోట్లు కేటాయించారు. 22 స్టేషన్లను కలుపుతూ 29 కిలోమీటర్ల కారిడార్‌గా దీనిని రూపొందిస్తు్న్నారు. పుణె మెట్రో ఫేజ్-1ను 5.46 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. మూడు అండర్‌గ్రౌండ్ స్టేషన్లు కూడా ఇందులో ఉంటాయి. రూ.2,945.53 కోట్లు ఇందుకు కేటాయిస్తున్నారు. 2029 ఫిబ్రవరి నాటికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. కాగా, పాట్నాలోని బిహాతా, పశ్చిమబెంగాల్‌లోని బాగ్‌డోగరాలో రూ.2,962 కోట్ల అంచనా వ్యయంతో ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టులకు కూడా కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
Read More National News and Latest Telugu News