జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల కాల్చివేత
ABN , Publish Date - Aug 30 , 2024 | 03:48 AM
జమ్మూకశ్మీర్‌లో రెండు చోట్ల జరిగిన ఎన్కౌంటర్లలో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. గురువారం కుప్వారా, మచ్చల్ ప్రాంతాల్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
శ్రీనగర్, ఆగస్టు 29: జమ్మూకశ్మీర్‌లో రెండు చోట్ల జరిగిన ఎన్కౌంటర్లలో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. గురువారం కుప్వారా, మచ్చల్ ప్రాంతాల్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ‘‘కుప్వారా, మచ్చల్ ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో వారి కోసం వేట ముమ్మరం చేశాం. ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసు అధికారులతో కలిసి సంయుక్తంగా గస్తీ ఆపరేషన్ నిర్వహించాం. ఈ క్రమంలో భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. గురువారం ఉదయం కుప్వారాలో ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను గుర్తించాం. అలాగే కర్నాహ ప్రాంతంలో మరో మృతదేహం లభించింది. వారి వద్ద నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం’’అని శ్రీనగర్‌కు చెందిన అధికారులు ‘ఎక్స్’లో తెలిపారు.