Share News

Drugs Seized: 427 కిలోల డ్రగ్స్ పట్టివేత.. పోలీసుల అదుపులో ఓ వ్యక్తి

ABN , Publish Date - Oct 21 , 2024 | 02:43 PM

దేశంలో మరోసారి పెద్ద ఎత్తున డ్రగ్స్ దొరికింది. గుజరాత్‌లోని భరూచ్ జిల్లా అంక్లేశ్వర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ ఫ్యాక్టరీలో మెథాంఫెటమైన్ (MD), 427 కిలోల ఇతర డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Drugs Seized: 427 కిలోల డ్రగ్స్ పట్టివేత.. పోలీసుల అదుపులో ఓ వ్యక్తి
drugs seized

దేశంలో గత కొన్ని నెలలుగా పెద్ద ఎత్తున డ్రగ్స్(drugs seized) దందా వెలుగులోకి వస్తుంది. ఇటివల దేశ రాజధాని ఢిల్లీలో 5 వేల కోట్ల విలువైన డ్రగ్స్ దొరికిన ఘటన మరువక ముందే, తాజాగా మరోకటి వెలుగులోకి వచ్చింది. గుజరాత్‌(Gujarat)లోని భరూచ్ జిల్లాలోని అంక్లేశ్వర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ ఫ్యాక్టరీ నుంచి నిషేధిత మెథాంఫెటమైన్ (MD), 427 కిలోల ఇతర డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత మెథాంఫెటమైన్ మొత్తం విలువ రూ.14 లక్షలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేశారు. అంక్లేశ్వర్ జీఐడీసీ ప్రాంతంలో ఉన్న అవసార్ ఎంటర్‌ప్రైజ్ నుంచి ఈ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.


ఇప్పటి వరకు

ఈ పదార్ధాలు నిర్ధారణ కోసం ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (FSL)కి పంపించారు. భరూచ్ జిల్లా SOG, సూరత్ పోలీసుల బృందం ఆదివారం రాత్రి ఫ్యాక్టరీపై దాడి చేసినట్లు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) పోలీసు ఇన్‌స్పెక్టర్ ఆనంద్ చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా రూ.14.10 లక్షల విలువైన 141 గ్రాముల ఎండీని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఒకరిని అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది.


దీనికి ముందు

అంతకుముందు అక్టోబర్ 13న గుజరాత్ ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి అంక్లేశ్వర్‌లోని అవ్కార్ డ్రగ్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీ నుంచి రూ.5000 కోట్ల విలువైన 500 కిలోలకు పైగా కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన జరిగిన వారం తర్వాత, ఇక్కడ మరో దాడి జరిగింది. దీనికి కొద్ది రోజుల ముందు కూడా ఢిల్లీ పోలీసులు రాజధానిలోని గోదాముపై దాడి చేసి 562 కిలోల కొకైన్, 40 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని రమేష్ నగర్‌లోని ఓ దుకాణంపై దాడి చేయగా, అక్కడ నుంచి 208 కిలోల కొకైన్ లభ్యమైంది.


అక్రమంగా..

ఈ నిషేధిత డ్రగ్స్ అంకాలేశ్వర్‌కు చెందిన అవ్కార్ డ్రగ్స్ లిమిటెడ్ కంపెనీ నుంచి వచ్చిన ఫార్మా సొల్యూషన్ సర్వీసెస్ కంపెనీకి చెందినదని విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. అయితే వరుసగా గుజరాత్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లోనే ఈ డ్రగ్స్ దొరకడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. గుజరాత్ తీర ప్రాంతానికి చేరువలో ఉన్న క్రమంలో సులంభంగా దుండగులు అక్రమంగా డ్రగ్స్ రవాణా చేసి దేశంలో విక్రయించేందుకు సిద్ధమవుతున్నారని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు సోదాలు చేస్తూ అధికారులను అప్రమత్తం చేసినట్లు ఉన్నతాధికారులు అంటున్నారు.


ఇవి కూడా చదవండి:

Personal Finance: మహిళలకు గుడ్ న్యూస్.. రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు..


Missed Call: మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ మిస్డ్ కాల్ ఇచ్చి ఇలా చెక్ చేసుకోండి..


Pension Plan: రోజూ రూ. 12 ఆదా చేస్తే.. 60 ఏళ్ల తర్వాత నెలకు ఎంత పెన్షన్ వస్తుందంటే..


Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..

For Latest News and National News click here

Updated Date - Oct 21 , 2024 | 02:45 PM