Adulterated Khoya: దీపావళికి ముందే అధికారుల తనిఖీల్లో 430 కిలోల కల్తీ స్వీట్స్
ABN , Publish Date - Oct 18 , 2024 | 09:56 PM
దీపావళి పండుగ సందర్భంగా మీరు మిఠాయిలు కొనుగోలు చేస్తున్నారా. అయితే ఓసారి మిఠాయిల కల్తీ గురించి ఆలోచించండి. ఎందుకంటే తాజాగా జరిగిన తనిఖీల్లో భాగంగా 430 కిలోల కల్తీ ఖోయాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.మ
పండుగల సీజన్ వచ్చిందంటే చాలు స్వీట్లకు ఫుల్లు డిమాండ్ ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ స్వీట్లను తినేందుకు ఇష్టపడతారు. ఈ క్రమంలోనే దాదాపు ప్రతి ఫ్యామిలీ స్వీట్లను కొనుగోలు చేస్తుంది. కానీ ఇదే అదునుగా భావించిన పలువురు మాత్రం స్వీట్లను కల్తీ చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగి పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. దీంతో 430 కిలోల కల్తీ ఖోయాను(adulterated khoya) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన దేశరాజధాని ఢిల్లీ(Delhi)లో చోటుచేసుకుంది.
దుర్వాసన
ఢిల్లీ ప్రభుత్వ ఆహార భద్రతా విభాగం అధికారులు మోరీ గేట్ వద్ద ఉన్న హోల్‌సేల్ ఖోయా మార్కెట్‌పై దాడి చేసిన క్రమంలో ఈ కల్తీ ఖోయా వెలుగులోకి వచ్చింది. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ ప్రకారం 15 మంది అధికారుల బృందం ఖోయా మార్కెట్‌పై దాడి చేసింది. ఆ సమయంలో 430 కిలోల ఖోయా దుర్వాసన వెదజల్లుతున్నట్లు గుర్తించారు. దీంతో దానిని స్వాధీనం చేసుకున్న తర్వాత, ఖోయా నమూనాలను ఆహార భద్రత, ప్రమాణాల చట్టం 2006 కింద పరీక్ష కోసం ప్రయోగశాలకు పంపారు. అలాగే స్వాధీనం చేసుకున్న ఖోయాను ధ్వంసం చేశారు.
దుకాణాలకు
ఈ క్రమంలో దీపావళి దృష్ట్యా బయట ఆహారం లేదా స్వీట్స్ కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్త వహించాలని ఆహార భద్రత అధికారులు ప్రజలకు సూచించారు. ఏ ఆహారం తీసుకున్నా కూడా కల్తీ విషయంలో జాగ్రత్త వహించాలని కోరారు. ఆహార పదార్థాల్లో కల్తీ గురించి మీకు ఏదైనా అనుమానాలు ఉంటే వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు. మరోవైపు ఇటివల తెలంగాణ హైదరాబాద్ పరిధిలోని ప్రకాశ్ నగర్లో కూడా 700 కిలోల కుళ్లిన చికెన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ ఫుడ్ సెఫ్టీ అధికారుల తనిఖీల్లో భాగంగా ఈ దందా వెలుగులోకి వచ్చింది. ఆ చికెన్‌ను మద్యం దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
మరికొన్ని రోజుల్లో
అయితే దీపావళి పండుగ నేపథ్యంలో ఖోయాకు డిమాండ్ భారీగా పెరిగింది. దీని కారణంగా కల్తీ కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖోయా మండిలో విక్రయించే ఖోయా నాణ్యతను నిర్ధారించడానికి, వినియోగదారులకు సురక్షితమైన స్వీట్లను అందించడానికి ఆహార భద్రతా విభాగం రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు నిర్వహించాలని యోచిస్తోంది. ఈ క్రమంలో కల్తీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ తనిఖీలను ఫుడ్ సేఫ్టీ అధికారులు మరింత పెంచనున్నారు.
ఇవి కూడా చదవండి:
Gold Rates Today: సామాన్యులకు పసిడి రేట్ల షాకింగ్.. ఇప్పుడే ఇలా అయితే, మరి పెళ్లిళ్ల సీజన్ నాటికి..
Manappuram Finance: మణప్పురం ఫైనాన్స్‌కు భారీ షాక్.. 11 నెలల కనిష్టానికి షేర్లు
Stock Market: వారాంతంలో స్టాక్ మార్కెట్లో లాభాల జోష్.. కొన్ని గంటల్లోనే లక్షల కోట్ల లాభం..
Lay Offs: మళ్లీ వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో లే ఆఫ్స్.. భయాందోళనలో టెకీలు..
Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..
Read More National News and Latest Telugu News