Railways Subsidy: ప్రతి ప్రయాణీకుడి టిక్కెట్‌పై 46 శాతం సబ్సిడీ.. రైల్వే మంత్రి కీలక ప్రకటన
ABN , Publish Date - Dec 04 , 2024 | 02:56 PM
రైళ్లలో ప్రయాణించే ప్రయాణీకులకు భారత ప్రభుత్వం భారీ సబ్సిడీని ఇస్తుంది. పార్లమెంటు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే మంత్రి సమాధానమిస్తూ ఈ మేరకు పేర్కొన్నారు. రైల్వే ప్రయాణికులందరికీ భారత ప్రభుత్వం టిక్కెట్లపై 46 శాతం రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
దేశంలోని ప్రతి రైల్వే ప్రయాణీకుడికి ప్రయాణ టిక్కెట్‌పై 46 శాతం సబ్సిడీ (Indian Railways Subsidy) ఇస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం తెలిపారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో అనుబంధ ప్రశ్నలకు సమాధానమిస్తూ, రైల్వే మంత్రిత్వ శాఖ ప్రయాణీకుల కోసం సబ్సిడీపై ప్రతి సంవత్సరం 56,993 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని వెల్లడించారు. వృద్ధులు, గుర్తింపు పొందిన జర్నలిస్టులకు గతంలో ఇచ్చిన సబ్సిడీని పునరుద్ధరించే అవకాశం గురించి అడిగినప్పుడు వైష్ణవ్ ఈ మేరకు స్పందించారు. ప్రయాణికులకు సబ్సిడీపై రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతి ఏటా రూ.56,993 కోట్లు వెచ్చిస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
ప్రతి 100 రూపాయలకు
ఈ క్రమంలో ప్రతి రూ.100 ప్రయాణ సేవకు రూ. 54 మాత్రమే వసూలు చేస్తున్నట్లు చెప్పారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వం దేశంలోని చిన్న, మధ్యతరహా రైల్వే స్టేషన్‌లను అభివృద్ధి చేస్తున్నట్లు వైష్ణవ్ వెల్లడించారు. మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ప్రణితి షిండే లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆటగాళ్ల రైలు ప్రయాణంలో సబ్సిడీపై ఒక ప్రశ్న అడిగారు. క్రీడాకారులు క్రీడల్లో పాల్గొనేందుకు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుందని ప్రణితి షిండే తన ప్రశ్నలో పేర్కొన్నారు. ప్రణితి షింద్ అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి సమాధానమిచ్చారు.
చిన్న, మధ్య తరహా రైల్వే స్టేషన్ల అభివృద్ధి
ప్రభుత్వం రూ. 56,993 కోట్ల సబ్సిడీని ఇచ్చే రైల్వే ప్రయాణీకులలో క్రీడాకారులు కూడా ఉన్నారని వెల్లడించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వంలో దేశం మొత్తం రోడ్ల ద్వారా అనుసంధానించబడినట్లుగా తెలిపారు. దేశంలోని చిన్న, మధ్యతరహా రైల్వే స్టేషన్‌లను కూడా అభివృద్ధి చేశామని అశ్విని వైష్ణవ్ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇది తెలిసిన నెటిజన్లు తాము రైళ్లలో ప్రయాణం కోసం చెల్లిస్తున్న మొత్తం సబ్సిడీ ద్వారా వస్తుందా అని పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం ప్రత్యేక తరగతులకు చెందిన వారికి మాత్రమే సబ్సిడీ ఇస్తున్నారని అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
Indian Railways: ఈ రైల్వే ప్రయాణికులకు ఆహారం ఉచితం.. కారణమిదే..
Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..
Amritsar Golden Temple Incident: గోల్డెన్ టెంపుల్ దగ్గర సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు..
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Real vs Fake Charger: మీ ఫోన్ ఛార్జర్ నిజమైనదా, నకిలీదా.. ఇలా గుర్తించండి..
Read More Business News and Latest Telugu News