Share News

Bihar Politics: ప్రధాని మోదీకి నితీశ్ భారీ ట్విస్ట్.. అదివ్వకపోతే ఇక అంతే!

ABN , Publish Date - Jun 29 , 2024 | 04:10 PM

నితీశ్ కుమార్.. మోదీ ముందు భారీ డిమాండ్ ఉంచారు. అదే ప్రత్యేక హోదా. ఏపీలాగే ఎన్నో ఏళ్ల నుంచి బిహార్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక హోదా అడుగుతోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో తాము కీలకంగా ఉన్నామని భావిస్తున్న జేడీయూ ఇదే అదనుగా భావిస్తూ ప్రత్యేక హోదా అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తోంది.

Bihar Politics: ప్రధాని మోదీకి నితీశ్ భారీ ట్విస్ట్.. అదివ్వకపోతే ఇక అంతే!

పట్నా: ఏపీలో అత్యధిక ఎంపీ సీట్లు సాధించిన టీడీపీ, ఇటు బిహార్‌లో గణనీయ సంఖ్యలో ఎంపీ స్థానాలు గెలుచుకున్న జేడీయూ సాయంతో మూడోసారి ఎన్డీయే పగ్గాలు చేపట్టింది. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు, బిహార్ సీఎం నితీశ్ కుమార్(CM Nitish Kumar) ప్రధాని మోదీ ముందు పెద్ద కోరికలే కోరే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు జరిగాయి. వీటిని నిజం చేస్తూ నితీశ్ కుమార్.. మోదీ ముందు భారీ డిమాండ్ ఉంచారు.

అదే ప్రత్యేక హోదా. ఏపీలాగే ఎన్నో ఏళ్ల నుంచి బిహార్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక హోదా అడుగుతోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో తాము కీలకంగా ఉన్నామని భావిస్తున్న జేడీయూ ఇదే అదనుగా భావిస్తూ ప్రత్యేక హోదా అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తోంది. బిహార్‌కు ప్రత్యేక హోదా (Special Status) ఇవ్వాలని సీఎం నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) డిమాండ్‌ చేసింది. హోదా లేకుంటే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని కోరింది.


ఎన్డీయేలో భాగస్వామ్యంగా ఉన్న ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసింది. తీర్మానంలో రాష్ట్రం ఆర్థికంగా, అభివృద్ధిలో వెనుకబడి ఉండటాన్ని ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని, దీర్ఘకాలంగా ఉన్న ఈ డిమాండ్‌ను నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దీంతోపాటు ఈ మధ్యే రిజర్వేషన్లను 65 శాతానికి పెంచిన కోటాను కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఈ తీర్మానంలో పేర్కొన్నారు.

న్యాయ పరిశీలన, రక్షణ కోసం రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో రిజర్వేషన్‌ కోటాను చేర్చాలని జేడీయూ ప్రతిపాదించింది. అలాగే ఈ కోటాను నిరంతరాయంగా అమలు చేస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చింది. ఇదే సమావేశంలో ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీ అధిష్టానం సంజయ్ ఝాను నియమించారు.


నితీష్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన కోర్‌ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో రెండు ముఖ్యమైన ప్రతిపాదనలు ఆమోదం పొందాయి. అవి ఒకటి సంజయ్ ఝా నియామకం. రెండు జేడీయూ.. ఎన్డీయే కూటమిలోనే కొనసాగడం. ఈ నిర్ణయాలకు సభ్యులు ఆమోదం తెలిపారు.

For Latest News and National News click here..

Updated Date - Jun 29 , 2024 | 04:20 PM