Share News

Jammu and Kashmir: లోయలో పడిన వాహనం: ఐదుగురు సైనికులు మృతి

ABN , Publish Date - Dec 24 , 2024 | 08:09 PM

Jammu and Kashmir: జమ్మూ కశ్మీర్‌లో విషాదం చోటు చేసుకుంది. సైనికులతో వెళ్తున్న వాహనం భారీలో లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సైనికులు మరణించారు.

Jammu and Kashmir: లోయలో పడిన వాహనం: ఐదుగురు సైనికులు మృతి
security forces in Jammu and Kashmir

శ్రీనగర్, డిసెంబర్ 24: జమ్మూ కశ్మీర్‌ పూంచ్ జిల్లాలో మెంధార్‌ సమీపంలోని బల్నోయి వద్ద సైనికులు ప్రయాణిస్తున్న వాహనం భారీ లోయలో పడి పోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సైనికులు మరణించారు. పలువరు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం నీలం నుంచి బల్నోయ్ గోరా పోస్ట్‌కు సైనికులు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దాదాపు 350 అడుగుల లోతు ఉన్న లోయలో ఈ వాహనం పడిపోయింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న సైనిక ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకొని.. సహాయక చర్యలు చేపట్టారు. అయితే క్షతగాత్రులను వైద్య చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు ఇదే తరహా ఘటన గత నెలలో చోటు చేసుకుందని సైనిక అధికారులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజౌరి జిల్లాలో కాలాకోట్ సమీపంలోని బడ్గో గ్రామం వద్ద సైనికులు వెళ్తున్న వాహనం అదుపు తప్పి.. లోయలో పడిందని తెలిపారు. ఈ ప్రమాదంలో ఒక సైనికుడు మరణించారని.. మరో సైనికుడు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు.


నవంబర్ 4వ తేదీన చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో గాయపడిన సైనికుడు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడని సైనిక ఉన్నతాధికారులు గుర్తు చేశారు. ఇక రైయిసీ జిల్లాలో కారు లోయలో పడిందని.. ఈ ప్రమాదంలో మహిళ, 10 ఏళ్ల బాలుడు మరణించారని చెప్పారు. ఇదే ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని సైనిక అధికారులు వివరించారు.

Also Read: ఆసుపత్రి నుంచి కౌషిక్ డిశ్చార్జ్

Also Read: న్యూఢిల్లీలో ఎన్డీయే నేతల బేటీ.. హాజరుకానున్న సీఎం చంద్రబాబు

Also Read: రేవతి భర్తకు ఉద్యోగం.. దిల్ రాజ్ కీలక ప్రకటన

Also Read: బెలగావి వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాలు

Also Read: ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్

Also Read: ఎమ్మెల్యే మాధవీ రెడ్డి ఎఫెక్ట్.. ఇడుపులపాయకు జగన్

For National News And Telugu News

Updated Date - Dec 24 , 2024 | 08:12 PM