Amit Shah: సైబర్ నేరాలకు ముకుతాడు.. ఐదేళ్లలో 5 వేల సైబర్ కమాండోలు
ABN , Publish Date - Sep 10 , 2024 | 06:57 PM
ప్రధాన బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇంటర్మేడియేటరీస్, పేమెంట్ అగ్రిగేటర్లు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, ఐడీ ఇంటర్మేడియేటరీస్, కేంద్ర, రాష్ట్ర లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల ప్రతినిధులతో సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్ (సీఎఫ్ఎంఎస్)ను ఏర్పాటు చేస్తామని అమిత్‌షా ప్రకటించారు.
న్యూఢిల్లీ: దేశాభివృద్ధిలో సైబర్ సెక్యూరిటీ (Cyber Security) కీలక భూమిక పోషిస్తోందని, సైబర్ క్రైమ్‌ల నిరోధానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) తెలిపారు. సైబర్ నేరాలను నిరోధించేందుకు రాబోయే ఐదేళ్లలో 5 వేల సైబర్ కమాండోలకు శిక్షణ ద్వారా సిద్ధం చేసేందుకు కేంద్ర ఆలోస్తోందని చెప్పారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (14C) తొలి ఆవిర్భావ దినోత్సవంలో అమిత్‌షా మంగళవారంనాడు మాట్లాడుతూ, సైబర్ బేస్డ్ డాటా రిజిస్ట్రీ ఏర్పాటు, సైజర్ క్రైమ్ సమాచారం షేర్ చేసేందుకు ఒక పోర్టల్, అనుమానితులు భవిష్యత్ నేరాలకు పాల్పడకుండా నిరోధించేందుకు నేషనల్ రిజిస్ట్రీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. సైబర్ నేరాలకు ఎల్లలు లేవని, సైబర్ సెక్యూరిటీ లేకుండా జాతీయ భద్రత అసాధ్యమని స్పష్టం చేశారు.
ప్రధాన బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇంటర్మేడియేటరీస్, పేమెంట్ అగ్రిగేటర్లు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, ఐడీ ఇంటర్మేడియేటరీస్, కేంద్ర, రాష్ట్ర లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల ప్రతినిధులతో సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్ (సీఎఫ్ఎంఎస్)ను ఏర్పాటు చేస్తామని అమిత్‌షా ప్రకటించారు. ఈ ఏజెన్సీలు ఆన్‌లైన్ ఆర్థిక నేరాలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా తక్షణ చర్యలకు దిగుతాయన్నారు. లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో 'సహకార సమాఖ్య'కు ఒక ఉదాహరణగా సీఎఫ్ఎంసీ సేవలందిస్తుందన్నారు.
Sushilkumar Shinde: అప్పట్లో కశ్మీర్ పర్యటన భయమేసింది... కేంద్ర మాజీ హోం మంత్రి షిండే వెల్లడి
మేవాత్, జామ్‌తాఢా, అహ్మదాబాద్, హైదరాబాద్, ఛండీగఢ్, విశాఖపట్నం, గౌహతిలలో ఏర్పాటు చేసిన ఏడు జాయింట్ సైబర్ కోఆర్డినేషన్ టీమ్‌లు మంచి ఫలితాలను ఇస్తున్నట్టు అమిత్‌షా చెప్పారు. 'సైబర్ కమాండోస్' ప్రోగ్రాం కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సీబీఐ వంటి సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్లకు చెందిన సుశిక్షితులతో ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. సైబర్ సెక్యూరిటీకి ఎదురవుతున్న ముప్పును ఈ టీమ్ సమర్ధవంతగా ఎదుర్కొంటుందన్నారు. డిజిటల్ స్పేస్‌ను సురక్షితంగా ఉంచడంలో రాష్ట్రాలు, కేంద్ర సంస్థలకు ట్రైన్డ్ సైబర్ కమాండోలు సహకరిస్తారని చెప్పారు. ప్రపంచంలో జరిగే లావాదేవీల్లో 46 శాతం ఇండియాలోనే జరుగుతున్నందున సైబర్ ప్రపంచాన్ని సురక్షితంగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు.
Read More National News and Latest Telugu News Click Here
Rahul Gandhi: యూఎస్ పర్యటనలో మళ్లీ కీలక వ్యాఖ్యలు