Christmas Market Attack: జర్మనీలో దాడి.. పలువురి మృతి, ఏడుగురి భారతీయులకు గాయాలు
ABN , Publish Date - Dec 22 , 2024 | 11:30 AM
క్రిస్మస్ వేడుకలు మరికొద్ది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. అలాంటి వేళ.. తూర్పు జర్మనీలోని మగ్దబగ్‌లో దారుణం చోటు చేసుకుంది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 21: తూర్పు జర్మనీలోని మగ్దబగ్‌లో దారుణం చోటు చేసుకుంది. క్రిస్మన్ మార్కెట్‌లో జరిగిన దాడిలో ఐదుగురు మరణించారు. ఈ దాడిలో ఏడుగురు భారతీయులు సహా 200 మంది గాయపడ్డారు. గాయపడిన భారతీయుల్లో నలుగురిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. 38 మంది మృతి
క్షతగాత్రుల కుటుంబాలతో జర్మనీలోని భారత రాయబార కార్యాలయ అధికారులు మాట్లాడుతున్నారని తెలిపింది. వారికి సరైన చికిత్స అందించేందుకు చర్యలు సైతం రాయబార కార్యాలయం చేపట్టిందని వివరించింది. అయితే ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడి తెలివి తక్కువ పనిగా అభివర్ణించింది. ఈ దాడికి పాల్పడిన వ్యక్తి సౌదీ అరేబియాకు చెందిన తలేబ్‌గా పోలీసులు గుర్తించారు. అయితే ఈ దాడి అతడు ఉద్దేశ పూర్వకంగానే చేశారని వారు స్ఫష్టం చేశారు.
Also Read: మహిళలకు గుడ్ న్యూస్.. మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధరలు
మరోవైపు జర్మనీ ఛాన్సెలర్ ఓలాఫ్ స్కోల్జ్ ఈ ఘటనపై స్పందించారు. ఈ దాడిని ఖండించారు. ఇది భయకరమైన దాడిగా జర్మనీ చాన్సెలర్ అభివర్ణించారు. ఈ దాడిలో ఐదుగురు మరణించారని తెలిపారు.
గతంలో బెర్లిన్‌లో క్రిస్మస్ మార్కెట్‌లో చోటు చేసుకున్న సంఘటనను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ ఘటన జరిగి దాదాపు ఏనిమిదేళ్లు అయిందని వివరించారు. అనంతరం జర్మనీలో ఈ కారుతో దాడి చేశారని తెలిపారు. ఈ ఘటన.. దేశాన్ని దిగ్బ్రాంతిలో ముంచెత్తిందని అభివర్ణించారు.
తలేబ్.. ఇస్లాం వ్యతిరేకి అని పోలీసులు పేర్కొన్నారు. జర్మనీ తీసుకు వచ్చిన మైగ్రేషన్ విధానంపై అతడు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు. క్రిస్మస్ వేడుకలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఆ క్రమంలో క్రిస్మస్ మార్కెట్‌కు భారీగా ప్రజలు పోటెత్తారు. అదే సమయంలో అధిక వేగంతో కారును నడుపుతూ.. మార్కెట్‌లోకి తలేబ్ దూసుకు వెళ్లాడు. దీంతో 205 మంది ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో క్షతగాత్రులు 15 ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అల్టర్నేటివ్ ఫర్ జర్మనీ పార్టీకి తలేబ్ మద్దతుదారుడిగా వ్యవహరిస్తున్నారని జర్మనీ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇస్లాంకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం అతడికి అలవాటు అని తెలిపారు. 2006 నుంచి జర్మనీలో అతడు నివసిస్తున్నారని పేర్కొన్నారు. మాగ్దబగ్‌కు 40 కిలోమీటర్ల దూరంలోని బెర్న్‌బగ్‌లో వైద్యుడిగా తలేబ్ ప్రాక్టీస్ చేస్తున్నాడని వివరించారు.
For National News And Telugu News