NEET Retest: నీట్ రీటెస్ట్‌కి 48 శాతం విద్యార్థులు గైర్హాజరు..
ABN , Publish Date - Jun 23 , 2024 | 08:36 PM
దేశ వ్యాప్తంగా నీట్ ప్రవేశ పరీక్ష లీకేజ్ ప్రకంపనలు రేపుతన్న వేళ.. సుప్రీం కోర్టు(Supreme Court) ఆదేశాల మేరకు ఆదివారం నీట్ రీటెస్ట్ నిర్వహించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA).. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది విద్యార్థులకు తిరిగి నీట్ పరీక్ష నిర్వహించింది.
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా నీట్ ప్రవేశ పరీక్ష లీకేజ్ ప్రకంపనలు రేపుతన్న వేళ.. సుప్రీం కోర్టు(Supreme Court) ఆదేశాల మేరకు ఆదివారం నీట్ రీటెస్ట్ నిర్వహించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA).. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది విద్యార్థులకు తిరిగి నీట్ పరీక్ష నిర్వహించింది.
వారిలో 48 శాతం మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారని ఎన్టీఏ తెలిపింది. 1,563 మంది విద్యార్థుల్లో 813 మంది (52 శాతం) పరీక్షకు హాజరుకాగా, 750 మంది (48 శాతం) గైర్హాజరయ్యారని వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హరియాణా, మేఘాలయలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ పరిధిలో ఏడు పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు రీటెస్ట్ నిర్వహించారు.
చండీగఢ్ నుంచి ఇద్దరు విద్యార్థులూ హాజరుకాలేదు. ఛత్తీస్ గఢ్‌లో 602 మంది విద్యార్థులకుగానూ 311 మంది హాజరుకాలేదు.హరియాణాలో 494 మందికి 287 మంది, మేఘాలయలో 466 మందికి 234 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. మే 5న నిర్వహించిన నీట్ పరీక్షలో 4,750 కేంద్రాల్లో 23 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు.
అయితే ఆ తరువాత విడుదల చేసిన ఫలితాల్లో 60మందికిపైగా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడంతో.. నీట్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు పెల్లుబిక్కాయి. విచారణ చేసిన పోలీసులు నీట్ పేపర్ లీకేజీ నిజమేనని నిర్ధారించారు. దీంతో తాము తీవ్రంగా నష్టపోయామని విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నారు. ఈ అంశం మోదీ ప్రభుత్వానికి తీవ్ర తలనొప్పిగా మారింది.
For Latest News and National News click here