Share News

High Court: మోదీపై ‘అనర్హత’ వేయాలన్న పిటిషన్‌ కొట్టివేత

ABN , Publish Date - Apr 30 , 2024 | 04:14 AM

దేవుళ్ల పేరున ఓట్లు అడుగుతున్న ప్రధాని మోదీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆరేళ్ల పాటు నిషేధం విధించాలని కోరుతూ సోమవారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

High Court: మోదీపై ‘అనర్హత’ వేయాలన్న పిటిషన్‌ కొట్టివేత

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 29: దేవుళ్ల పేరున ఓట్లు అడుగుతున్న ప్రధాని మోదీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆరేళ్ల పాటు నిషేధం విధించాలని కోరుతూ సోమవారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆయన ఎన్నికల ప్రచారంలో దేవుళ్లు, ప్రార్థనా స్థలాల పేరున ఓట్లు అడుగుతున్నారని, ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధమని పేర్కొంటూ న్యాయవాది ఆనంద్‌ ఎస్‌ జోంధాలే ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.


ఈ పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్‌ సచిన్‌ దత్తా ధర్మాసనం ఇందులో ఎలాంటి మెరిట్‌ లేదంటూ తిరస్కరించింది. ఇదే విషయమై ఆయన ఈ నెల పదో తేదీన ఈసీకి ఫిర్యాదు చేశారని, అక్కడ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే కోర్టును ఆశ్రయించడం ఏమిటని ప్రశ్నించింది. ఒకవేళ ఈసీ తగిన నిర్ణయం తీసుకోలేదని భావిస్తే అప్పుడు కోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది.

Updated Date - Apr 30 , 2024 | 04:14 AM